ఒకే ఓవర్లో  6 సిక్స్‌లు | Nepal batter Kushal Bhurtel record books by hitting six sixes in a single over | Sakshi
Sakshi News home page

ఒకే ఓవర్లో  6 సిక్స్‌లు

Jun 2 2026 6:00 AM | Updated on Jun 2 2026 6:00 AM

Nepal batter Kushal Bhurtel record books by hitting six sixes in a single over

నేపాల్‌ బ్యాటర్‌ కుశాల్‌ భుర్తేల్‌ సంచలన ప్రదర్శన

అంతర్జాతీయ టి20ల్లో ఈ ఘనత సాధించిన ఆరో బ్యాటర్‌గా గుర్తింపు  

సింగపూర్‌: అంతర్జాతీయ టి20 మ్యాచ్‌లో ‘ఓవర్‌లో 6 సిక్సర్ల’ ఫీట్‌ మరోసారి నమోదైంది. నేపాల్‌ బ్యాటర్‌ కుశాల్‌ భుర్తేల్‌ ఈ అరుదైన జాబితాలో చేరాడు. ఆసియా క్రీడల అర్హత టోర్నీలో భాగంగా ఆదివారం చైనాతో జరిగిన మ్యాచ్‌లో కుశాల్‌ ఈ ఘనతను సాధించాడు. చైనా లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌ చెన్‌ జూ యూ ఓవర్లో అతను ఆరు సిక్సర్లు బాదాడు. ఈ ఓవర్లో తొలి ఐదు బంతులను కుశాల్‌ వరుసగా 6, 6, 6, 6, 6 కొట్టాడు.

 తర్వాతి బంతిని చెన్‌ ‘వైడ్‌’గా వేశాడు. అయితే ఈ అదనపు బంతిని కూడా కుశాల్‌ సిక్స్‌గా మలచడంతో ఓవర్లో 6 గీ6 పూర్తయింది. మ్యాచ్‌లో కుశాల్‌ 43 బంతుల్లోనే 5 ఫోర్లు, 16 సిక్సర్లతో 129 పరుగులు సాధించాడు. అతని జోరుకు తోడు కుశాల్‌ మల్లా (47 బంతుల్లో 85 నాటౌట్‌; 8 ఫోర్లు, 5 సిక్స్‌లు), రోహిత్‌ పౌడేల్‌ (21 బంతుల్లో 69 నాటౌట్‌; 5 ఫోర్లు, 7 సిక్స్‌లు) కూడా చెలరేగడంతో  నేపాల్‌ 20 ఓవర్లలో 2 వికెట్లకు 313 పరుగులు చేసింది. అనంతరం 19.2 ఓవర్లలో 92 పరుగులకే కుప్పకూలిన చైనా 221 పరుగుల తేడాతో ఓడింది. 
 

Advertisement
 
Advertisement
Advertisement