breaking news
qualifier match
-
IPL 2025: 'ఈ లెక్కన' ఈ సారి ఆర్సీబీదే టైటిల్..!
ఐపీఎల్ 2025లో భాగంగా నిన్న (మే 29) జరిగిన తొలి క్వాలిఫయర్ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌పై ఆర్సీబీ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా తొమ్మిదేళ్ల తర్వాత ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకుంది. ఐపీఎల్లో ఆర్సీబీకి ఇది నాలుగో ఫైనల్ అవుతుంది. గడిచిన మూడు సందర్భాల్లో ఈ జట్టు రన్నరప్‌తో సరిపెట్టుకుంది.ఆర్సీబీ ఫైనల్‌కు చేరిన సీజన్లు..2009- డెక్కన్ ఛార్జర్స్ చేతిలో 6 పరుగుల తేడాతో ఓటమి2011- సీఎస్కే చేతిలో 58 పరుగుల తేడాతో ఓటమి2016- ఎస్ఆర్హెచ్ చేతిలో 8 పరుగుల తేడాతో ఓటమి2025- ?కాగా, ఈ సీజన్లో ఆర్సీబీ ఫైనల్‌కు చేరాక ఓ ఆసక్తికర విషయం ట్రెండింగ్‌లోకి వచ్చింది. ప్రతి సీజన్లో ఈ సాలా కప్ నమదే అనే ఆర్సీబీ అభిమానులకు ఇది ఊపునిచ్చే అంశం. అదేంటంటే.. 2018 నుంచి క్వాలిఫయర్-1లో గెలిచిన జట్టే టైటిల్ గెలిచింది. ఈ విషయం తెలిసి ఆర్సీబీ అభిమానులు ఉబ్బితబ్బిబవుతున్నారు. ఈ ఒక్క సెంటిమెంట్ చాలు మేము ఈ యేడు కప్ కొడతామని చెప్పడానికంటూ చాటింపు చేసుకుంటున్నారు.సెంటిమెంట్ విషయాన్ని పక్కన పెడితే, ఈ యేడు ఆర్సీబీకి టైటిల్ గెలిచే జట్టుకు ఉండాల్సిన లక్షణాలన్నీ ఉన్నాయి. ఆర్సీబీ ఈ సీజన్లో గత సీజన్లకు చాలా భిన్నంగా కనిపిస్తుంది. టైటిల్ గెలవాలన్న కసి ఆ జట్టులోని ప్రతి ఒక్క ఆటగాడిలో ఉంది. అందుకు తగ్గట్టుగానే వారి ప్రదర్శనలు కూడా ఉన్నాయి. పైపెచ్చు ప్రతి సీజన్లో వీక్‌గా కనిపించే ఆర్సీబీ బౌలింగ్ విభాగం ఈ సీజన్లో చాలా స్ట్రాంగ్‌గా ఉంది. నిన్న జరిగిన క్వాలిఫయర్-1 మ్యాచ్‌లో అది నిరూపితమైంది. ఇదే జోరును ఆర్సీబీ బౌలర్లు ఫైనల్ మ్యాచ్‌లోనూ కొనసాగిస్తే, ఆ జట్టును టైటిల్ గెలవకుండా ఎవరూ ఆపలేరు.ఈ సారి ఆర్సీబీకి పటిష్టమైన జట్టుతో పాటు సెంటిమెంట్లు కూడా వర్కౌటయ్యేలా ఉన్నాయి. క్వాలిఫయర్-1 సెంటిమెంట్‌తో పాటు విరాట్ కోహ్లి జెర్సీ నంబర్ సెంటిమెంట్ కూడా ఆ జట్టుకు ఈ సారి కలిసొచ్చేలా ఉంది. కోహ్లి జెర్సీ నంబర్ 18, ఐపీఎల్ సీజన్ సంఖ్య కూడా 18.2018 నుంచి క్వాలిఫయర్-1 గెలిచిన జట్లు, టైటిల్ గెలిచిన జట్ల వివరాలు..2018- క్వాలిఫయర్-1 విజేత సీఎస్కే- టైటిల్ విజేత కూడా సీఎస్కేనే2019- క్వాలిఫయర్-1 విజేత ముంబై ఇండియన్స్- టైటిల్ విజేత కూడా ముంబై ఇండియన్సే2020- క్వాలిఫయర్-1 విజేత ముంబై ఇండియన్స్- టైటిల్ విజేత కూడా ముంబై ఇండియన్సే2021- క్వాలిఫయర్-1 విజేత సీఎస్కే- టైటిల్ విజేత కూడా సీఎస్కేనే2022- క్వాలిఫయర్-1 విజేత గుజరాత్- టైటిల్ విజేత కూడా గుజరాతే2023- క్వాలిఫయర్-1 విజేత సీఎస్కే- టైటిల్ విజేత కూడా సీఎస్కేనే2024- క్వాలిఫయర్-1 విజేత కేకేఆర్- టైటిల్ విజేత కూడా కేకేఆరే2025- క్వాలిఫయర్-1 విజేత ఆర్సీబీ- టైటిల్ విజేత..? -
IPL 2025, Qualifier 1: పంజాబ్‌పై ఆర్సీబీ ఘన విజయం
పంజాబ్‌పై ఆర్సీబీ ఘన విజయంఐపీఎల్ 2025లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో ఇవాళ (మే 29) జరిగిన క్వాలిఫయర్-1 మ్యాచ్‌లో ఆర్సీబీ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో ఆర్సీబీ ఫైనల్‌కు చేరింది. పంజాబ్ జూన్ 1న జరిగే క్వాలిఫయర్-2లో రేపు జరుగబోయే ఎలిమినేటర్ మ్యాచ్‌లో (గుజరాత్ వర్సెస్ ముంబై) విజేతతో తలపడుతుంది.ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్.. ఆర్సీబీ బౌలర్లు ఆకాశమే హద్దుగా చెలరేగడంతో 14.1 ఓవర్లలో 101 పరుగులకే కుప్పకూలింది. హాజిల్‌వుడ్, సుయాశ్ శర్మ తలో 3, యశ్ దయాల్ 2, రొమారియో షెపర్డ్, భువనేశ్వర్ కుమార్ తలో వికెట్ తీశారు.పంజాబ్ ఇన్నింగ్స్‌లో ప్రభ్‌సిమ్రన్ సింగ్ (18), మార్కస్ స్టోయినిస్ (26), అజ్మతుల్లా ఒమర్జాయ్ (18) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. ప్రియాంశ్ ఆర్య 7, జోస్ ఇంగ్లిస్ 4, శ్రేయస్ అయ్యర్ 2, నేహల్ వధేరా 8, శశాంక్ సింగ్ 3, ముషీర్ ఖాన్ 0, హర్‌ప్రీత్ బ్రార్ 4 పరుగులకే ఔటయ్యారు. అనంతరం 102 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆర్సీబీ.. 10 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి దర్జాగా విజయతీరాలకు చేరింది. ఫిల్ సాల్ట్ (27 బంతుల్లో 56 నాటౌట్; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు అర్ద శతకంతో చెలరేగగా.. విరాట్ కోహ్లి 12, మయాంక్ అగర్వాల్ 19, రజత్ పాటిదార్ 15 (నాటౌట్) పరుగులు చేశారు. పంజాబ్ బౌలర్లలో జేమీసన్, ముషీర్ ఖాన్ తలో వికెట్ తీశారు.రెండో వికెట్ కోల్పోయిన ఆర్సీబీ7.5వ ఓవర్- 84 పరుగుల వద్ద ఆర్సీబీ రెండో వికెట్ కోల్పోయింది. ముషీర్ ఖాన్ బౌలింగ్‌లో మయాంక్ అగర్వాల్ (19) ఔటయ్యాడు. టార్గెట్ 102.. 30 పరుగుల వద్ద కోహ్లి ఔట్3.2వ ఓవర్- 102 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో ఆర్సీబీ 30 పరుగుల వద్ద విరాట్ కోహ్లి (12) వికెట్ కోల్పోయింది. జేమీసన్ బౌలింగ్‌లో జోస్ ఇంగ్లిస్‌కు క్యాచ్ ఇచ్చి విరాట్ ఔటయ్యాడు. రెచ్చిపోయిన ఆర్సీబీ బౌలర్లు.. 101 పరుగులకే కుప్పకూలిన పంజాబ్టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ ఆర్సీబీ బౌలర్లు ఆకాశమే హద్దుగా చెలరేగడంతో 14.1 ఓవర్లలో 101 పరుగులకే కుప్పకూలింది. హాజిల్‌వుడ్, సుయాశ్ శర్మ తలో 3, యశ్ దయాల్ 2, రొమారియో షెపర్డ్, భువనేశ్వర్ కుమార్ తలో వికెట్ తీశారు. పంజాబ్ ఇన్నింగ్స్‌లో ప్రభ్‌సిమ్రన్ సింగ్ (18), మార్కస్ స్టోయినిస్ (26), అజ్మతుల్లా ఒమర్జాయ్ (18) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. ప్రియాంశ్ ఆర్య 7, జోస్ ఇంగ్లిస్ 4, శ్రేయస్ అయ్యర్ 2, నేహల్ వధేరా 8, శశాంక్ సింగ్ 3, ముషీర్ ఖాన్ 0, హర్‌ప్రీత్ బ్రార్ 4 పరుగులకే ఔటయ్యారు. 78 పరుగుల వద్ద ఎనిమిదో వికెట్ కోల్పోయిన పంజాబ్10.3వ ఓవర్- 78 పరుగుల వద్ద పంజాబ్ ఎనిమిదో వికెట్ కోల్పోయింది. సుయాశ్ శర్మ బౌలింగ్‌లో ప్రమాదకరంగా కనిపిస్తున్న మార్కస్ స్టోయినిస్ (26) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఏడో వికెట్ కోల్పోయిన పంజాబ్8.5వ ఓవర్- 60 పరుగుల వద్ద పంజాబ్ ఏడో వికెట్ కోల్పోయింది. సుయాశ్ బౌలింగ్‌లో ముషీర్ ఖాన్ (0) ఎల్బీడబ్ల్యూగా ఔటయ్యాడు. ఆరో వికెట్ కోల్పోయిన పంజాబ్8.2వ ఓవర్- 60 పరుగుల వద్ద పంజాబ్ ఆరో వికెట్ కోల్పోయింది. సుయాశ్ శర్మ బౌలింగ్‌లో శశాంక్ సింగ్ (3) క్లీన్ బౌల్డయ్యాడు. 50 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన పంజాబ్టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. ఆ జట్టు 50 పరుగులకే సగం వికెట్లు కోల్పోయింది. 6.3వ ఓవర్లో యశ్ దయాల్ బౌలింగ్‌లో నేహల్ వధేరా (8) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దయాల్, హాజిల్‌వుడ్ తలో 2, భువీ ఓ వికెట్ తీశారు. 38 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయిన పంజాబ్5.1వ ఓవర్- 38 పరుగుల వద్ద పంజాబ్ నాలుగో వికెట్ కోల్పోయింది. హాజిల్‌వుడ్ బౌలింగ్‌లో భువనేశ్వర్ కుమార్‌కు క్యాచ్ ఇచ్చి జోష్ ఇంగ్లిస్ (4) ఔటయ్యాడు. పీకల్లోతు కష్టాల్లో పంజాబ్3.4వ ఓవర్- 30 పరుగుల వద్ద పంజాబ్ మూడో వికెట్ కోల్పోయింది. హాజిల్‌వుడ్ బౌలింగ్‌లో జితేశ్ శర్మకు క్యాచ్ ఇచ్చి శ్రేయస్ అయ్యర్ (2) ఔటయ్యాడు. ఇన్ ఫామ్ బ్యాటర్లు ప్రియాంశ్, ప్రభ్‌సిమ్రన్, శ్రేయస్ ఔట్ కావడంతో పంజాబ్ పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. 27 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన పంజాబ్2.6వ ఓవర్- టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేస్తున్న పంజాబ్ 27 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లో జితేశ్ శర్మకు క్యాచ్ ఇచ్చి ఇన్ ఫామ్ బ్యాటర్ ప్రభ్‌సిమ్రన్ సింగ్ (18) ఔటయ్యాడు. తొలి వికెట్ కోల్పోయిన పంజాబ్1.2వ ఓవర్- 9 పరుగుల వద్ద పంజాబ్ తొలి వికెట్ కోల్పోయింది. యశ్ దయాల్ బౌలింగ్‌లో కృనాల్ పాండ్యాకు క్యాచ్ ఇచ్చి ప్రియాంశ్ ఆర్య (7) ఔటయ్యాడు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆర్సీబీ, స్టార్ బౌలర్ వచ్చేశాడుఐపీఎల్ 2025లో భాగంగా ఇవాళ (మే 29) జరుగుతున్న క్వాలిఫయర్-1 మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్, ఆర్సీబీ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు చెరో మార్పు చేశాయి. పంజాబ్ తరఫున మార్కో జన్సెన్ స్థానంలో అజ్మతుల్లా ఒమర్జాయ్ తుది జట్టులోకి వచ్చాడు. ఆర్సీబీ తరఫున స్టార్ పేసర్ జోష్ హాజిల్‌వుడ్ బరిలోకి దిగనున్నాడు. నువాన్ తుషార స్థానాన్ని జోష్ భర్తీ చేశాడు.జట్ల వివరాలు..పంజాబ్ కింగ్స్ (ప్లేయింగ్ XI): ప్రియాంష్ ఆర్య, ప్రభ్సిమ్రాన్ సింగ్, జోష్ ఇంగ్లిస్(w), శ్రేయాస్ అయ్యర్(c), నెహాల్ వధేరా, శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్, అజ్మతుల్లా ఒమర్జాయ్, హర్‌ప్రీత్ బ్రార్, అర్ష్‌దీప్ సింగ్, కైల్ జామీసన్ఇంపాక్ట్ సబ్‌లు: విజయ్‌కుమార్ వైషాక్, ప్రవీణ్ దూబే, సూర్యాంశ్ షెడ్గే, ముషీర్ ఖాన్, జేవియర్ బార్ట్లెట్.రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ప్లేయింగ్ XI): విరాట్ కోహ్లీ, ఫిలిప్ సాల్ట్, రజత్ పాటిదార్(సి), లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ(w), రొమారియో షెపర్డ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, యశ్ దయాల్, జోష్ హేజిల్‌వుడ్, సుయాష్ శర్మఇంపాక్ట్ సబ్స్: మయాంక్ అగర్వాల్, రసిఖ్ సలామ్, మనోజ్ భాండాగే, టిమ్ సీఫెర్ట్, స్వప్నిల్ సింగ్. -
RCB VS PBKS Qualifier-1: అలా జరిగితే గెలవకపోయినా పంజాబ్ ఫైనల్‌కు చేరుతుంది..!
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో లీగ్ దశ మ్యాచ్‌లన్నీ ముగిశాయి. పంజాబ్, ఆర్సీబీ, గుజరాత్, ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించాయి. మే 29న జరిగే క్వాలిఫయర్-1లో ఆర్సీబీ, పంజాబ్ తలపడతాయి. మే 30న జరిగే ఎలిమినేటర్ మ్యాచ్‌లో గుజరాత్, ముంబై ఇండియన్స్ అమీతుమీ తేల్చుకుంటాయి. లీగ్ దశలో సాధించిన విజయాలు, నెట్ రన్‌రేట్ ఆధారంగా ప్లే ఆఫ్స్ బెర్త్‌లు ఖరారయ్యాయి. పంజాబ్, ఆర్సీబీ తలో 14 మ్యాచ్‌ల్లో చెరో 9 విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో నిలిచాయి. పాయింట్లు సమంగా (19) ఉన్నా, ఆర్సీబీతో పోలిస్తే నెట్ రన్‌రేట్ మెరుగ్గా ఉండటంతో పంజాబ్‌కు తొలి ప్లే ఆఫ్స్ బెర్త్ దక్కింది.గుజరాత్ 14 మ్యాచ్‌ల్లో 9 విజయాలు, ముంబై ఇండియన్స్ 14 మ్యాచ్‌ల్లో 8 విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో మూడు, నాలుగు స్థానాల్లో నిలిచాయి. గుజరాత్ కూడా పంజాబ్, ఆర్సీబీ మాదిరి 14 మ్యాచ్‌ల్లో 9 విజయాలు సాధించినా.. పంజాబ్, ఆర్సీబీ ఆడాల్సిన ఓ మ్యాచ్ (వేర్వేరుగా) రద్దైంది. దీంతో పంజాబ్, ఆర్సీబీలకు అదనంగా తలో పాయింట్ లభించింది.ప్లే ఆఫ్స్ మ్యాచ్‌లు ఎలా..?పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో నిలిచే జట్లు (పంజాబ్, ఆర్సీబీ) మొదటి క్వాలిఫయర్‌లో తలపడతాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కు చేరుతుంది. ఈ మ్యాచ్‌లో ఓడిన జట్టుకు మరో ఛాన్స్ ఉంటుంది. క్వాలిఫయర్-2లో (జూన్ 1) పోటీ పడే అవకాశం దక్కుతుంది. క్వాలిఫయర్-2లో ఇంకో బెర్త్ ఎలిమినేటర్ మ్యాచ్ ద్వారా తెలుస్తుంది. పాయింట్ల పట్టికలో మూడు, నాలుగు స్థానాల్లో నిలిచే జట్లు ఎలిమినేటర్ మ్యాచ్‌లో తలపడతాయి. గెలిచిన జట్టు క్వాలిఫయర్-2లో పోటీ పడాల్సి ఉంటుంది. ఎలిమినేటర్‌లో ఓడిన జట్టు ఇంటి ముఖం పడుతుంది. క్వాలిఫయర్-2లో గెలిచే జట్టు.. క్వాలిఫయర్-1లో గెలిచే జట్టుతో ఫైనల్లో (జూన్ 3) తలపడుతుంది.ఆర్సీబీ, పంజాబ్ క్వాలిఫయర్ మ్యాచ్ రద్దైతే..?పంజాబ్, ఆర్సీబీ మధ్య మే 29న జరగాల్సిన క్వాలిఫయర్-1 మ్యాచ్ ఏ కారణంగా అయినా రద్దైతే పంజాబ్ ఫైనల్‌కు చేరుతుంది. పాయింట్ల పట్టికలో పంజాబ్ అగ్రస్థానంలో ఉంది కాబట్టి, ఆ జట్టుకు ఈ అవకాశం దక్కుతుంది. షెడ్యూల్ ప్రకారం క్వాలిఫయర్-1కు రిజర్వ్ డే లేదు. కాబట్టి తప్పనిసరిగా మ్యాచ్ జరిగి గెలిస్తేనే ఆర్సీబీ ఫైనల్‌కు చేరుతుంది. పంజాబ్‌కు అలా కాదు. ఏ కారణంగా అయినా మ్యాచ్ రద్దైనా ఆ జట్టు ఫైనల్‌కు చేరుతుంది. ప్రస్తుతమున్న సమాచారం ప్రకారం ఏ కారణంగా కూడా పంజాబ్, ఆర్సీబీ క్వాలిఫయర్-1 మ్యాచ్ రద్దయ్యే అవకాశం లేదు. -
SRH Vs KKR: ఫైనల్ చేరడమే మిగిలింది: కమిన్స్ పోస్ట్ వైరల్
ఐపీఎల్-2024లో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన ఆట తీరుతో ఎన్నో రికార్డులు బద్దలు కొట్టింది. క్యాష్ రిచ్ లీగ్ చరిత్రలో అత్యధిక స్కోరు(287) నమోదు చేసిన జట్టుగా చరిత్ర సృష్టించింది. గత మూడేళ్లుగా పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానం కోసం పోటీ పడ్డ దుస్థితి నుంచి.. ఈసారి ఏకంగా ఫైనల్ రేసులో నిలిచే స్థాయికి చేరుకుంది. కనీసం ప్లే ఆఫ్స్ చేరినా చాలంటూ ఆరెంజ్ ఆర్మీ అభిమానులు ఎదురుచూస్తున్న వేళ.. విధ్వంసకర ఆట తీరుతో ఏకంగా క్వాలిఫయర్-1కు అర్హత సాధించింది. ఇంకొక్క ఆటంకం దాటితే చాలు.. ఐపీఎల్ పదిహేడో ఎడిషన్‌లో ఫైనల్ చేరిన తొలి జట్టుగా అర్హత సాధించే అవకాశం ముంగిట నిలిచింది. ప్రధాన కారణాలు ఇవేఇక ఈ సీజన్లో సన్‌రైజర్స్ అద్భుత విజయాలకు ప్రధాన కారణం విధ్వంసకర బ్యాటింగ్‌తో పాటు కెప్టెన్ ప్యాట్ కమిన్స్ వ్యూహాలు, కోచ్ డానియల్ వెటోరీ ప్రణాళికలు అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా సారథిగా కమిన్స్ జట్టును గెలుపు బాట పట్టించడంలో పూర్తిగా విజయవంతమయ్యాడు.ప్రత్యర్థి జట్ల వ్యూహాలను చిత్తు చేస్తూ మైదానంలో ఎప్పటికప్పుడు సరికొత్త ప్రణాళికలతో ముందుకు సాగి సన్‌రైజర్స్ విన్‌రైజర్స్‌గా మార్చడంలో సఫలమయ్యాడు ఈ పేస్ బౌలర్. ఒత్తిడి నెలకొన్న సమయాల్లోనూ ఏమాత్రం సహనం కోల్పోకుండా ఆటగాళ్లకు అండగా నిలుస్తూ ఫలితాలు రాబడుతున్నాడు. ఫ్రాంఛైజీ తన కోసం ఖర్చు పెట్టిన రూ. 20.50 కోట్లకు పూర్తి న్యాయం చేస్తూ పైసా వసూల్ ప్రదర్శన ఇస్తున్నాడు.మరో అవకాశం కూడా ఉందిఇక కమిన్స్ సారథ్యంలో ఆకాశమే హద్దుగా చెలరేగుతున్న సన్‌రైజర్స్ క్వాలిఫయర్-1లోనూ ఇదే జోష్ కనబరిస్తే.. టైటిల్‌కు కేవలం ఒక్క అడుగు దూరంలో నిలుస్తుంది.ఒకవేళ కేకేఆర్‌తో ఈ మ్యాచ్‌లో ఓడినా క్వాలిఫయర్-2 రూపంలో కమిన్స్ బృందానికి మరో అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఎలా చూసినా ఈసారి సన్‌రైజర్స్‌కు ఫైనల్ చేరేందుకు సానుకూలతలే ఎక్కువగా కనిపిస్తున్నాయంటూ ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్ నెట్టింట సందడి చేస్తున్నారు.ఫైనల్స్‌లో అడుగుపెట్టడమే తరువాయిఈ నేపథ్యంలో సన్‌రైజర్స్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఇన్‌స్టా పోస్ట్ వైరల్‌గా మారింది. కాగా సొంతమైదానం ఉప్పల్‌లో సన్‌రైజర్స్ ఆదివారం.. ఈ సీజన్ లీగ్ దశలో తమ ఆఖరి మ్యాచ్ ఆడింది. పంజాబ్ కింగ్స్‌పై నాలుగు వికెట్ల తేడాతో గెలుపొంది పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది.అనంతరం కేకేఆర్- రాజస్తాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ రద్దు కావడంతో రెండో స్థానాన్ని మరింత పదిలం చేసుకుని క్వాలిఫయర్-1కు అర్హత సాధించింది. ఈ నేపథ్యంలో కమిన్స్ స్పందిస్తూ.. ‘‘ఉప్పల్‌లో మరో అద్భుతమైన రోజు. మాకు మద్దతుగా నిలిచినందుకు ధన్యవాదాలు. ఇక మనం ఫైనల్స్‌లో అడుగుపెట్టడమే తరువాయి’’ అని అభిమానులను ఉత్సాహపరిచాడు.ఈసారి కచ్చితంగా తుదిపోరుకు అర్హత సాధిస్తామని ఈ సందర్భంగా కమిన్స్ ధీమా వ్యక్తం చేశాడు. కాగా కేకేఆర్- సన్‌రైజర్స్ మధ్య క్వాలిఫయర్-1కు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదిక. ఇదే గడ్డపై వన్డే వరల్డ్‌కప్-2023 ఫైనల్లో ప్యాట్ కమిన్స్ సారథ్యంలోని ఆస్ట్రేలియా విజేతగా నిలిచిన విషయం తెలిసిందే.చదవండి: KKR vs SRH: ప్రమాదకారి.. ఫైనల్ చేరే తొలి జట్టు ఇదే: పాక్ లెజెండ్ Locked and loaded for Qualifier 1 🔥💪#PlayWithFire #KKRvSRH pic.twitter.com/nkTpipX0I8— SunRisers Hyderabad (@SunRisers) May 21, 2024 -
Monte Carlo Masters Series: సుమిత్ సంచలనం
మోంటెకార్లో (మొనాకో): ఈ ఏడాది తన జోరు కొనసాగిస్తూ భారత టెన్నిస్ నంబర్‌వన్ సుమిత్ నగాల్ మరో గొప్ప విజయం సాధించాడు. ప్రతిష్టాత్మక మోంటెకార్లో మాస్టర్స్ సిరీస్–1000 టోర్నీలో రెండో రౌండ్లోకి దూసుకెళ్లాడు. క్వాలిఫయర్ హోదాలో మెయిన్ ‘డ్రా’లో అడుగు పెట్టిన ప్రపంచ 93వ ర్యాంకర్ సుమిత్ తొలి రౌండ్లో ప్రపంచ 38వ ర్యాంకర్ మాటియో అర్నాల్డిని బోల్తా కొట్టించాడు. సోమవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో సుమిత్ 5–7, 6–2, 6–4తో అర్నాల్డిపై గెలిచి క్లే కోర్టు మాస్టర్స్ సిరీస్ టోరీ్నల్లో రెండో రౌండ్‌కు చేరిన తొలి భారతీయ ప్లేయర్‌గా గుర్తింపు పొందాడు. 2 గంటల 37 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సుమిత్ తొలి సెట్‌ను కోల్పోయినా ఆందోళన చెందలేదు. రెండో సెట్లో అద్భుతంగా ఆడి అర్నాల్డి సర్వీస్‌ను మూడుసార్లు బ్రేక్ చేసి సెట్‌ను సొంతం చేసుకున్నాడు. నిర్ణాయక మూడో సెట్లోనూ సుమిత్ తన దూకుడు కొనసాగించి మూడో గేమ్‌లో, ఏడో గేమ్‌లో అర్నాల్డి సర్వీస్‌లను బ్రేక్ చేసి తన సరీ్వస్‌లను నిలబెట్టుకొని చిరస్మరణీయ విజయాన్ని అందుకున్నాడు. రెండో రౌండ్లో ప్రపంచ ఏడో ర్యాంకర్ హోల్గర్ రూనె (డెన్మార్క్)తో సుమిత్ ఆడతాడు. రెండో రౌండ్లోకి ప్రవేశించడం ద్వారా సుమిత్ వచ్చే ర్యాంకింగ్స్‌లో కెరీర్ బెస్ట్ 80వ స్థానానికి చేరుకోనున్నాడు. ఈ ఏడాది సుమిత్ ఆ్రస్టేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ తొలి రౌండ్లో ప్రపంచ 27వ ర్యాంకర్ అలెగ్జాండర్ బుబ్లిక్ (కజకిస్తాన్)ను ఓడించి రెండో రౌండ్‌కు చేరగా... చెన్నై ఓపెన్ చాలెంజర్ టోర్నీలో విజేతగా నిలిచాడు. దుబాయ్ ఓపెన్ ఏటీపీ–500 టోర్నీ, ఇండియన్ వెల్స్ మాస్టర్స్–1000 టోర్నీ మెయిన్ ‘డ్రా’ తొలి రౌండ్లో ఓడిపోయాడు. -
గుజరాత్ వర్సెస్ చెన్నై.. ఎవరి బలమెంత..?
-
లంకపై హ్యాట్రిక్ సాధించిన యూఏఈ ఆటగాడు మన వాడే..!
టీ20 వరల్డ్‌కప్ గ్రూప్-ఏ క్వాలిఫయర్స్‌లో ఇవాళ (అక్టోబర్ 18) జరుగుతున్న మ్యాచ్‌లో హ్యాట్రిక్ సాధించిన యూఏఈ బౌలర్ కార్తీక్ మెయప్పన్‌పై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. 22 ఏళ్ల ఈ యువ రైట్ ఆర్మ్ లెగ్ బ్రేక్ బౌలర్.. లంకతో జరిగిన మ్యాచ్‌లో ఎవరూ ఊహించని విధంగా హ్యాట్రిక్ సాధించి యావత్ క్రికెట్ ప్రపంచ దృష్టిని ఆకర్శించాడు. లంక ఇన్నింగ్స్‌లో 15వ ఓవర్ వేసిన కార్తీక్.. ఆఖరి మూడు బంతులకు రాజపక్స, అసలంక, షనక వికెట్లు తీసి, ప్రస్తుత వరల్డ్‌కప్‌లో హ్యాట్రిక్ సాధించిన తొలి ఆటగాడిగా, టీ20 వరల్డ్‌కప్ చరిత్రలో ఈ ఘనత సాధించిన 5వ బౌలర్‌గా రికార్డుల్లోకెక్కాడు. కార్తీక్‌కు ముందు పొట్టి ప్రపంచకప్‌లో బ్రెట్ లీ, కర్టిస్ క్యాంపర్, వనిందు హసరంగ, కగిసో రబాడలు మాత్రమే హ్యాట్రిక్ సాధించారు. కాగా, లంకతో మ్యాచ్‌లో హ్యాట్రిక్ సాధించడంతో స్టార్ ఇమేజ్ తెచ్చుకున్న కార్తీక్ గురించి నెటిజన్లు ఆరా తీయడం మొదలు పెట్టారు. భారతీయ పేరు కలిగి ఉండటంతో మనవారు ఇంకాస్త ఎక్కువ ఆసక్తి కనబర్చి కార్తీక్ పూర్వపరాలను సేకరించారు. కార్తీక్ పళనియపన్ మెయప్పన్ మన దక్షిణాది చెందిన వాడే అని తెలిసి ఫ్యాన్స్ సంబురపడిపోతున్నారు. కార్తీక్ అక్టోబర్ 8, 2000 సంవత్సరంలో తమిళనాడులోని చెన్నై సగరంలో జన్మించాడు. కార్తీక్ కుటుంబం 2012లో దుబాయ్‌లో సెటిల్ కావడంతో.. అతను తన క్రికెటింగ్ కెరీర్‌ను యూఏఈ జట్టుతో ప్రారంభించాడు. 2019లో యూఏఈ తరఫున వన్డే అరంగేట్రం చేసిన కార్తీక్.. ఇప్పటివరకు 8 వన్డేలు. 12 టీ20లు ఆడి మొత్తం 28 వికెట్లు పడగొట్టాడు. ఇదిలా ఉంటే, శ్రీలంక-యూఏఈ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేయగా.. ఛేదనలో చేతులెత్తేసిన యూఏఈ 10 ఓవర్ల తర్వాత 6 వికెట్లు నష్టానికి 36 పరుగులు మాత్రమే చేసి ఓటమి దశగా సాగుతుంది. View this post on Instagram A post shared by ICC (@icc) var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1971406958.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
T20 World Cup 2022: చిన్న జట్ల మధ్య ఉత్కంఠ పోరు.. నెదర్లాండ్స్‌దే గెలుపు
టీ20 వరల్డ్‌కప్ 2022కు అదిరిపోయే ఆరంభం లభించింది. టోర్నీ ఓపెనింగ్ మ్యాచ్‌లో పసికూన నమీబియా.. ఆసియా ఛాంపియన్ శ్రీలంకపై సంచలన విజయం సాధించగా.. ఆఖరి నిమిషం వరకు నువ్వా నేనా అన్నట్లు సాగిన రెండో క్వాలిఫయర్ మ్యాచ్‌లో యూఏఈని నెదర్లాండ్స్‌ను ఖంగుతినిపించింది. చిన్న జట్ల మధ్య జరిగిన ఈ లో స్కోరింగ్ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన యూఏఈ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 111 పరుగులు చేయగా.. ఛేదనలో నెదర్లాండ్స్ మధ్యలో తడబడినప్పటికీ మరో బంతి మిగిలుండగానే లక్ష్యాన్ని చేరుకుని 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. An incredible opening day of the #T20WorldCup comes to an end 🔥 Netherlands cross the finish line in yet another thrilling contest!#UAEvNED |📝 https://t.co/sD75sGYNF1 pic.twitter.com/Kh8yIBhSeJ — ICC (@ICC) October 16, 2022 నెదర్లాండ్స్ గెలుపుకు ఆఖరి ఓవర్లో 6 పరుగులు అవసరం కాగా.. కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్ (16 నాటౌట్), లొగాన్ వాన్ బీక్ (4 నాటౌట్) జాగ్రత్తగా ఆడి జట్టును విజయతీరాలకు చేర్చారు. చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో గెలుపు ఇరు జట్ల మధ్య దోబూచులాడింది. యూఏఈ చేసింది తక్కువ పరుగులే అయినా దాన్ని కాపాడుకునేందుకు విశ్వప్రయత్నాలు చేసి అందరిని ఆకట్టుకుంది. యూఏఈ ఇన్నింగ్స్‌లో ముహమ్మద్ వసీమ్ (47 బంతుల్లో 41; ఫోర్, 2 సిక్సర్లు) టాప్ స్కోరర్ కాగా.. నెదర్లాండ్స్ బౌలర్లు బాస్ డి లీడ్ (3/19), ఫ్రెడ్ క్లాస్సెన్ (2/13), టిమ్ ప్రింగిల్ (1/13), వాన్ డెర్ మెర్వ్ (1/19) అద్భుతంగా బౌలింగ్ చేసి యూఏఈని నామమాత్రపు స్కోర్‌కే పరిమితం చేశారు. అనంతరం సునాయాస లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన నెదర్లాండ్స్‌ను యూఏఈ బౌలర్లు జునైద్ సిద్ధిఖీ (3/24), అయాన్ అఫ్జల్ ఖాన్ (1/15), జహూర్ ఖాన్ (1/11), కార్తీక్ మెయ్యప్పన్ (1/22), బాసిల్ హమీద్ (1/7) వణికించారు. వీరి ధాటికి నెదర్లాండ్స్ ఓ దశలో ఓటమి దిశగా సాగింది. అయితే కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్, లొగాన్ వాన్ బీక్ సంయమనంతో ఆడి నెదర్లాండ్స్‌ను విజయతీరాలకు చేర్చారు. నెదర్లాండ్స్ 19.5 ఓవర్లలో 7 వికెట్లు లక్ష్యాన్ని ఛేదించింది. నెదర్లాండ్స్ ఇన్నింగ్స్‌లో మ్యాక్స్ ఓడౌడ్ (23) టాప్ స్కోరర్ కాగా.. మిగిలిన వారంతా తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. -
T20 World Cup 2022: చరిత్ర సృష్టించిన యూఏఈ ఆల్‌రౌండర్
టీ20 వరల్డ్‌కప్‌లో తొలి రోజే సంచలనాల మోత మోగింది. ఓపెనింగ్ మ్యాచ్‌లో పసికూన్ నమీబియా.. ఆసియా ఛాంపియన్ శ్రీలంకకు మైండ్ బ్లాంక్ అయ్యే షాకివ్వగా.. యూఏఈ-నెదర్లాండ్స్ మధ్య జరుగుతున్న రెండో క్వాలిఫయర్ మ్యాచ్‌లో వరల్డ్ రికార్డు నమోదైంది. యూఏఈ ఆటగాడు అయాన్ అఫ్జల్ ఖాన్.. టీ20 వరల్డ్‌కప్ ఆడిన అత్యంత పిన్న వయస్కుడిగా చరిత్ర సృష్టించాడు. అయాన్.. 16 ఏళ్ల 335 రోజుల వయసులోనే టీ20 ప్రపంచ కప్ మ్యాచ్ ఆడి రికార్డుల్లోకెక్కాడు. గతంలో ఈ రికార్డు పాక్ బౌలర్ మహ్మద్ అమీర్ పేరిట ఉండేది. అమీర్.. 17 ఏళ్ల 55 రోజుల వయసులో టీ20 వరల్డ్‌కప్ మ్యాచ్ ఆడగా.. అయాన్ తాజాగా అమీర్ రికార్డును బద్దలు కొట్టాడు. టీ20 వరల్డ్‌కప్ ఆడిన అత్యంత పిన్నవయస్కుల జాబితాలో అయాన్, అమీర్ తర్వాత ఆఫ్ఘన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ (17 ఏళ్ల 170 రోజులు), పాకిస్తాన్ ఆటగాడు అహ్మద్ షెహజాద్ (17 ఏళ్ల 196 రోజులు), ఐర్లాండ్ ప్లేయర్ జార్జ్ డాక్రెల్ (17 ఏళ్ల 282 రోజులు) వరుసగా 3 నుంచి 5 స్థానాల్లో ఉన్నారు. ఇక ప్రస్తుత వరల్డ్‌కప్‌లో అత్యంత పెద్ద వయసు కలిగిన ఆటగాడి విషయానికొస్తే.. నెదర్లాండ్స్‌కు చెందిన స్టెఫాన్ మైబుర్గ్కు ఆ ఘనత దక్కింది. మైబుర్గ్.. 38 ఏళ్ల 230 వయసులో టీ20 వరల్డ్‌కప్ మ్యాచ్ ఆడుతున్నాడు. వరల్డ్‌కప్‌లో అత్యంత పిన్న వయస్కుడు (అయాన్), అతి పెద్ద వయసు కలిగిన ఆటగాడు (మైబుర్గ్) ఇలా ఒకే మ్యాచ్‌లో ఎదురురెదురు పడటం మరో విశేషం. ఓవరాల్‌గా టీ20 వరల్డ్‌కప్ చరిత్రలో అత్యంత పెద్ద వయస్కుడైన క్రికెటర్ రికార్డు హాంగ్‌కాంగ్ ఆటగాడు ర్యాన్ క్యాంప్‌బెల్ పేరిట ఉంది. క్యాంప్‌బెల్.. 2016 వరల్డ్‌కప్‌లో 44 ఏళ్ల 33 రోజుల వయసులో టీ20 వరల్డ్‌కప్ మ్యాచ్ ఆడాడు. ఇదిలా ఉంటే, యూఏఈ-నెదర్లాండ్స్ జట్ల మధ్య జరిగిన క్వాలిఫయర్ మ్యాచ్‌లో నెదర్లాండ్స్ 3 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన యూఏఈ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 111 పరుగులు చేయగా.. నెదర్లాండ్స్ 7 వికెట్లు కోల్పోయి మరో బంతి మిగిలుండగానే లక్ష్యాన్ని చేరుకుంది. -
GT VS RR: బట్లర్ గిట్లర్ జాన్తానై.. మహ్మద్ షమీ ఆసక్తికర కామెంట్లు..!
ఐపీఎల్ 2022 సీజన్లో ఇవాళ (మే 24) తొలి క్వాలిఫయర్ మ్యాచ్ జరుగనుంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగే ఈ మ్యాచ్‌లో గుజరాత్, రాజస్తాన్ జట్లు తలపడనున్నాయి. రాత్రి 7:30 గంటలకు ప్రారంభమయ్యే ఈ సమరంలో గెలుపే లక్ష్యంగా ఇరు జట్లు బరిలోకి దిగనున్నాయి. ఈ కీలక మ్యాచ్‌కు ముందు జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో గుజరాత్ స్టార్ పేసర్ మహ్మద్ షమీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రాజస్తాన్ ఇన్ ఫామ్ బ్యాటర్ జోస్ బట్లర్‌ను కట్టడి చేసే విషయంలో తన గేమ్ ప్లాన్ ఎలా ఉండబోతుందో వివరిస్తూ.. తాను రికార్డులను, ఫామ్‌ను చూసి బయపడే టైప్ కాదని వ్యాఖ్యానించాడు. మనకు మనపై, మన నైపుణ్యంపై నమ్మకం ఉండాలే కానీ పేర్లను చూసి ఎప్పుడూ బయపడకూడదని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. బ్యాటర్ సూపర్ ఫామ్‌లో ఉన్నాడని, భారీ షాట్లు ఆడతాడని బౌలర్ ఎప్పుడూ ఆలోచించకూడదని.. ప్రతి ఒక్కరికి ఓ బలహీనత ఉంటుందని, దాన్ని క్యాష్ చేసుకుని వ్యూహాలు రచించాలని అన్నాడు. బట్లర్ జోరుకు అడ్డుకట్ట వేసేందుకు తమ ప్లాన్లు తమకున్నాయని తెలిపాడు. ఇదే సందర్భంగా షమీ తన వ్యక్తిగత ప్రదర్శనపై ఆనందం వ్యక్తం చేశాడు. గత కొన్ని మ్యాచ్‌ల్లో కాస్త స్లో అయినప్పటికీ.. ప్లే ఆఫ్ మ్యాచ్‌లో సత్తా చాటుతానని ధీమా వ్యక్తం చేశాడు. కాగా, ప్రస్తుత సీజన్లో మహ్మద్ షమీ గుజరాత్ లీడింగ్ వికెట్ టేకింగ్ బౌలర్‌గా కొనసాగుతున్నాడు. అతను ఇప్పటి వరకు ఆడిన 14 మ్యాచ్‌ల్లో 17 స్ట్రయిక్ రేట్‌తో 8 కంటే తక్కువ ఎకానమీతో 18 వికెట్లు పడగొట్టాడు. మరోవైపు లైఫ్ టైమ్ ఫామ్‌లో జోస్ బట్లర్.. ప్రస్తుత సీజన్లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. అతను ఇప్పటివరకు ఆడిన 14 మ్యాచ్‌ల్లో 48.38 సగటున 146.96 స్ట్రయిక్ రేట్‌తో 629 పరుగులు చేశాడు. ఇందులో 3 సెంచరీలు, 3 అర్ధ సెంచరీలు ఉన్నాయి. చదవండి: వర్షం పడితే కథేంటి.. ఫైనల్ చేరే దారులు ఎలా ఉన్నాయంటే! -
IPL 2022: గుజరాత్‌ను ఢీకొట్టనున్న రాజస్తాన్.. నేడే తొలి క్వాలిఫయర్
కోల్‌కతా: ఈ ఏడాదే ఐపీఎల్లో ప్రవేశించిన గుజరాత్ టైటాన్స్ ఇప్పుడు ఫైనల్లో అడుగు పెట్టేందుకు తహతహలాడుతోంది. ఇప్పటిదాకా ఈ టోర్నీలో అంచనాలకు మించి రాణించిన టైటాన్స్ నేడు జరిగే తొలి క్వాలిఫయర్‌లో మాజీ చాంపియన్ రాజస్తాన్ రాయల్స్‌తో తలపడుతుంది. ఇరు జట్లను పరిశీలిస్తే... రాజస్తాన్ బలమంతా బ్యాటింగే. లీగ్ దశలో ఏకంగా 200 పైచిలుకు స్కోర్లను మూడుసార్లు చేసింది. 190 పరుగుల లక్ష్యాన్ని కూడా అవలీలగా ఛేదించింది. ఓపెనింగ్‌లో బట్లర్ సెంచరీలతో కదంతొక్కాడు. గత కొన్ని మ్యాచ్‌ల్లో ఇతను విఫలమైతే వెంటనే మెరిపించే బాధ్యతను మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ తీసుకున్నాడు. ఈ ఇద్దరితో పాటు కెప్టెన్ సంజూ సామ్సన్తో టాపార్డర్ పటిష్టంగా ఉంది. మిడిలార్డర్లో హెట్‌మైర్, దేవ్‌దత్ పడిక్కల్, రియాన్ పరాగ్‌లతో బ్యాటింగ్ ఆర్డర్ బలంగా ఉంది. సీమర్లు బౌల్ట్, ప్రసిధ్ కృష్ణ, స్పిన్నర్లు చహల్, అశ్విన్‌లు కూడా రాణిస్తుండటంతో రాజస్తాన్ లీగ్ దశలో రెండో స్థానంలో నిలిచింది. చాంపియన్లను ‘ఢీ’కొట్టి... మరోవైపు గుజరాత్ డిఫెండింగ్ చాంపియన్ చెన్నైపై రెండుసార్లు, మాజీ చాంపియన్ రాజస్తాన్‌పై ఆడిన ఒకసారి గెలిచి ఆరంభం నుంచి ఆఖరిదాకా అగ్రస్థానంలోనే నిలిచింది. ఓపెనర్ వృద్ధిమాన్ సాహా, వేడ్, కెప్టెన్ హార్దిక్ పాండ్యా, మిల్లర్, రాహుల్ తెవాటియాలు చకచకా పరుగులు సాధిస్తున్నారు. బౌలింగ్‌లో సీనియర్ సీమర్ షమీ, ఫెర్గూసన్ ప్రత్యర్థి బ్యాటర్లను దెబ్బతీస్తున్నారు. లీగ్ స్పెషలిస్టు స్పిన్నర్ రషీద్ ఖాన్ బంతితోనే కాదు... అవసరమైనప్పుడు బ్యాట్‌తోనూ జట్టుకు అవసరమైన పరుగులు జతచేస్తున్నాడు. జట్లు (అంచనా).. గుజరాత్: హార్దిక్ పాండ్యా (కెప్టెన్), సాహా, గిల్, వేడ్, మిల్లర్, తెవాటియా, రషీద్ ఖాన్, షమీ, సాయికిషోర్, ఫెర్గూసన్, యశ్ దయాళ్. రాజస్తాన్: సామ్సన్ (కెప్టెన్), యశస్వి, బట్లర్, పడిక్కల్, హెట్‌మైర్, పరాగ్, అశ్విన్, బౌల్ట్, చహల్, ప్రసిధ్ కృష్ణ, మెక్కాయ్. -
రాజస్థాన్ ప్లేయర్లు ప్రయాణిస్తున్న ఫ్లైట్‌లో అల్లకల్లోలం.. విమానం దించాలంటూ కేకలు..!
తొలి క్వాలిఫయర్ మ్యాచ్ ఆడేందుకు కోల్‌కతా బయల్దేరిన రాజస్థాన్ రాయల్స్ బృందానికి చేదు అనుభవం ఎదురైంది. నిన్న (మే 22) ముంబై నుంచి ఆర్ఆర్ బృందంతో బయల్దేరిన ప్రత్యేక విమానంలో కొంత సేపు గందరగోళ వాతావరణం నెలకొంది. వాతావరణ మార్పుల కారణంగా విమానంలోకి ఒక్కసారిగా దట్టమైన పొగమంచు వచ్చి చేరింది. దీంతో రాజస్థాన్ సభ్యులు భయాందోళనలకు గురయ్యారు. ఆర్ఆర్ బృందంలోని ఓ వ్యక్తి.. విమానం దించాలంటూ గట్టిగా కేకలు వేశాడు. View this post on Instagram A post shared by Rajasthan Royals (@rajasthanroyals) అయితే కొద్ది సేపటికే పొగమంచు మొత్తం క్లియర్ కావడంతో విమానంలో ఉన్నవారంతా ఊపిరిపీల్చుకున్నారు. విమానం ల్యాండ్ అయ్యే సమయంలో 'హల్లా బోల్' అనే నినాదాలతో విమానం మార్మోగింది. దీనికి సంబంధించిన వీడియోను రాజస్థాన్ తమ ట్విటర్ హ్యాండిల్లో పోస్టు చేయగా ప్రస్తుతం వైరలవుతోంది. ఈ వీడియోలో యశస్వి జైస్వాల్ తదితర సభ్యులు కనిపించారు. కాగా, కోల్‌కతా పరిసర ప్రాంతాల్లో గత కొన్ని రోజులుగా ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు కురుస్తున్న క్రమంలో ఆర్ఆర్ సభ్యులు ప్రయాణిస్తున్న విమానం మేఘాల్లో నుంచి దూసుకుపోవడంతో ఫ్లైట్‌లోకి పొగమంచు చేరింది. ఇదిలా ఉంటే, సీఎస్కేపై విజయంతో రాజస్థాన్ పాయింట్ల పట్టికలో రెండో స్థానంతో లీగ్ దశను ముగించిన విషయం తెలిసిందే. శాంసన్ సేన మే 24న ఈడెన్ గార్డెన్స్‌లో టేబుల్ టాపర్ అయిన గుజరాత్ టైటాన్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఫైనల్ చేరుతుంది. ఈ మ్యాచ్‌లో ఓడిన జట్టుకు మరో అవకాశం ఉంటుంది. ఎలిమినేటర్‌లో గెలిచిన జట్టుతో క్వాలిఫయర్ 1లో ఓడిన జట్టు తలపడుతుంది. చదవండి: లివింగ్‌స్టోన్ విధ్వంసం.. చివరి పోరులో పంజాబ్ చేతిలో చిత్తైన సన్‌రైజర్స్ -
2 ప్రపంచకప్‌లలో 2 వేర్వేరు దేశాలు.. చరిత్ర సృష్టించిన నమీబియా క్రికెటర్
David Wiese Played For Two Nations In Consecutive World Cups: ప్రస్తుతం జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌లో నమీబియాకు ప్రాతినిధ్యం వహిస్తున్న డేవిడ్ వీస్ చరిత్ర సృష్టించాడు. వరుస ప్రపంచకప్‌లలో రెండు వేర్వేరు దేశాలకు ప్రాతినిధ్యం వహించిన తొలి క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పాడు. 2016 ప్రపంచకప్‌లో జన్మస్థలమైన దక్షిణాఫ్రికాకు ప్రాతినిధ్యం వహించిన వీస్.. ప్రస్తుత వరల్డ్‌కప్‌లో తన తండ్రి స్వస్థలమైన నమీబియా తరఫున ఆడుతున్నాడు. 36 ఏళ్ల సీమ్ బౌలింగ్ ఆల్‌రౌండర్ అయిన వీస్.. 2013లో దక్షిణాఫ్రికా తరఫున పరిమిత ఓవర్ల ఫార్మాట్లో అరంగేట్రం చేసి 6 వన్డేలు, 20 టీ20లు ఆడాడు. గత టీ20 ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా తరఫున 3 మ్యాచ్‌లు ఆడిన వీస్.. జట్టులో స్థానాన్ని సుస్థిరం చేసుకోలేకపోయాడు. 2019లో నమీబియా టీ20 ప్రపంచకప్‌కు క్వాలిఫై కావడంలో కీలకపాత్ర పోషించిన వీస్.. నాటి నుంచి ఆ జట్టులో కీలక సభ్యుడిగా కొనసాగుతున్నాడు. ఈ క్రమంలో సోమవారం(అక్టోబర్ 18) శ్రీలంకతో జరిగిన క్వాలిఫయింగ్ మ్యాచ్‌లో బరిలోకి దిగిన అతను.. కేవలం 6 పరుగులు మాత్రమే చేశాడు. ఈ మ్యాచ్‌లో లంక బౌలర్ల ధాటికి తొలుత బ్యాటింగ్ చేసిన నమీబియా 96 పరుగులకే ఆలౌట్ కాగా.. శ్రీలంక కేవలం 3 వికెట్లు కోల్పోయి 13.3 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. ఇదిలా ఉంటే, ప్రస్తుత ప్రపంచకప్‌లో అన్నీ అనుకూలించి నమీబియా సూపర్ 12 స్టేజ్‌కి చేరితే.. అక్కడ దక్షిణాఫ్రికాతో తలపడే అవకాశం ఉంది. చదవండి: ఇంగ్లండ్‌ను ముప్పుతిప్పలు పెట్టిన 'జార్వో' మళ్లీ వచ్చేశాడు.. -
టీ20 వరల్డ్‌కప్.. ఐసీసీ కీలక నిర్ణయం
దుబాయ్: కరోనా మహమ్మారి కారణంగా పురుషుల టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా మూడు సబ్-రీజినల్ క్వాలిఫయర్ టోర్నీలను రద్దు చేస్తున్నట్లు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) శుక్రవారం ప్రకటించింది. ఐసీసీమెన్స్ టీ20 ప్రపంచకప్ కోసం ఈ అర్హత టోర్నీలను నిర్వహిస్తున్నది. కాగా మూడు క్వాలిఫయింగ్ మ్యాచ్‌ల్లో ఎ, బి క్వాలిఫయర్స్ మ్యాచ్‌లు ఫిన్లాండ్లో జరగనుండగా, వచ్చే రెండు నెలల్లో సి క్వాలిఫయర్స్‌కు బెల్జియం ఆతిథ్యమివ్వాల్సి ఉంది. కరోనా నేపథ్యంలో అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని మూడు క్వాలిఫయర్లను రద్దు చేయడమే మంచిదని నిర్ణయించినట్లు ఐసీసీ ఒక ప్రకటనలో తెలిపింది. వీటితో పాటు టీ20 వరల్డ్‌కప్ అమెరికా క్వాలిఫయర్స్, ఆసియా క్వాలిఫయర్స్ టోర్నీలు కూడా వాయిదా పడ్డాయి. 2022లో ఆస్ట్రేలియా వేదికగా జరిగే టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనే చివరి రెండు జట్లను ఈ టోర్నీ ద్వారా ఎంపికచేస్తారు. కాగా ఈ ఏడాది అక్టోబర్‌లో భారత్‌లో జరగాల్సిన 2021 టీ20 ప్రపంచకప్ కరోనా కారణంగా యూఏఈలో జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటికే దీనిపై బీసీసీఐ ఐసీసీని సంప్రదించినట్లు సమాచారం. -
బంగ్లాదేశ్‌తో భారత్ ఢీ
కోల్‌కతా: తమ చివరి మ్యాచ్‌లో ఆసియా చాంపియన్ ఖతర్‌ను నిలువరించిన భారత్ మరో మ్యాచ్‌కు సిద్ధమయింది. ప్రపంచకప్ క్వాలిఫ యర్స్‌లో భాగంగా నేడు ఇక్కడి సాల్ట్ లేక్ స్డేడి యంలో జరిగే మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో తలపడుతుంది. ఖతర్‌తో మ్యాచ్‌కు దూర మైన స్టార్ సునీల్ ఛెత్రి తిరిగి జట్టులోకి రావ డం కలిసొచ్చే అంశం. బలాబలాల పరంగా చూస్తే భారత్ బంగ్లాదేశ్ కంటే ముందుంది. ప్రస్తుతం భారత్ 104వ ర్యాంకులో ఉండగా... బంగ్లాదేశ్ 207 ర్యాంకులో ఉంది. ఛెత్రి, బల్వంత్ సింగ్, మన్వీర్ సింగ్‌లతో కూడిన అటాకింగ్ చెలరేగితే భారత్‌కు విజయం ఖాయ మైనట్లే. వీరితో పాటు మిడ్‌ఫీల్డ్‌లో ఉదాంత సింగ్, ఆశికి కురునియన్ గోల్ చేసే అవకాశా లను సృష్టించడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే భారత్‌ను డిఫెన్సు విభాగం కలవరపెడు తుంది. నేడు జరిగే మ్యాచ్‌కు డిఫెండర్ సందేశ్ జింగాన్ మోకాలి గాయంతో దూరం అయ్యా డు. ఒమన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో డిఫెన్సు లో అదరగొట్టిన భారత్ చివరి 9 నిమిషాల్లో చేతులెత్తేసి ప్రత్యర్థికి రెండు గోల్స్‌ను సమర్పిం చుకొని విజయాన్ని దూరం చేసుకుంది. భారత ఆటగాళ్లు అలసిపోవడమే దీనికి కారణం అని... వారి ఫిట్నెస్ను మెరుగుపరచాల్సిన అవసరం ఉందంటూ కోచ్ ఇగోర్ స్టిమాక్ తెలిపాడు. అయితే ఖతర్‌తో మ్యాచ్‌లో మాత్రం ఆకట్టు కుంది. ముఖ్యంగా ఛెత్రి గైర్హాజరీలో నాయకత్వ బాధ్యతలు చేపట్టిన గోల్‌కీపర్ గుర్ప్రీత్ సింగ్ సంధు ప్రత్యర్థి గోల్ చేసే అవకాశాలను సమ ర్థంగా అడ్డుకున్నాడు. వీరంతా సమిష్టిగా ఆడితే భారత్ ప్రపంచ కప్ ఆశలను సజీవంగా ఉంచు కున్నట్లే. ‘ ఇది ఛెత్రికి, బంగ్లాదేశ్‌కు మధ్య జరిగే మ్యాచ్ కాదు. భారత్‌కు బంగ్లాదేశ్‌కు మధ్య జరిగేది. నేను జట్టులో ఒక సభ్యుడిని మాత్ర మే. జట్టుకు విజయాన్ని అందించే ఆటగాళ్లు చాలా మంది ఉన్నారు. మేమంతా ఒకటిగా... దేశం కోసం ఆడతాం.’ అని మ్యాచ్‌కు ముందు జరిగిన సమావేశంలో ఛెత్రి పేర్కొన్నాడు. భార త ఫుట్‌బాల్‌కు మక్కాగా భావించే కోల్‌కతాలో మ్యాచ్ జరుగుతుండటంతో... 45 వేల సామ ర్ధ్యం గల సాల్ట్‌లేక్ స్టేడియం టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. -
అఫ్గాన్‌కు స్కాట్లాండ్ షాక్
బులవాయో: ప్రపంచకప్ క్వాలిఫయింగ్ టోర్నీలో ఫేవరెట్లలో ఒకటైన అఫ్గానిస్తాన్‌కు స్కాట్లాండ్ షాకిచ్చింది. తొలి మ్యాచ్‌లో బ్యాట్స్‌మన్ కాలమ్ మెక్లియోడ్ (146 బంతుల్లో 157 నాటౌట్; 23 ఫోర్లు, 1 సిక్స్) అజేయ సెంచరీతో స్కాట్లాండ్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అతి పిన్న సారథి రషీద్ ఖాన్ నేతృత్వంలో అఫ్గాన్ మొదట 49.4 ఓవర్లలో 255 పరుగులకు ఆలౌటైంది. నబీ (92; 7 ఫోర్లు, 3 సిక్స్‌లు), నజీబుల్లా జద్రాన్ (67; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. వీల్, బెరింగ్టన్ చెరో 3 వికెట్లు పడగొట్టారు. తర్వాత స్కాట్లాండ్ 47.2 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 256 పరుగులు చేసి గెలిచింది. మెక్ లియోడ్కు బెరింగ్టన్ (67; 4 ఫోర్లు) అండగా నిలిచాడు. మిగతా మ్యాచ్‌ల్లో ఐర్లాండ్ డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో 93 పరుగుల తేడాతో నెదర్లాండ్స్‌పై గెలుపొందగా, యూఏఈ కూడా డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలోనే 56 పరుగుల తేడాతో పపువా న్యూగినియాపై నెగ్గింది. జింబాబ్వే శుభారంభం మరోవైపు ఆతిథ్య జింబాబ్వే తొలి మ్యాచ్‌లో 116 పరుగుల తేడాతో నేపాల్‌పై జయభేరి మోగించి శుభారంభం చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లకు 380 పరుగులు సాధించింది. బ్రెండన్ టేలర్ (91 బంతుల్లో 100; 7 ఫోర్లు, ఒక సిక్స్), సికిందర్ రజా (66 బంతుల్లో 123; 7 ఫోర్లు, 9 సిక్స్‌లు) ధాటిగా ఆడి సెంచరీలు చేయడం విశేషం. ఐదో వికెట్‌కు వీరిద్దరు 173 పరుగులు జోడించారు. అనంతరం నేపాల్ జట్టు 50 ఓవర్లలో 8 వికెట్లకు 264 పరుగులు చేసి ఓడిపోయింది. ‘సెంచరీ హీరో’ సికిందర్ రజా బౌలింగ్‌లోనూ రాణించి మూడు వికెట్లు తీశాడు. సికిందర్ రజా -
కోహ్లి కొడతాడా?
బెంగళూరు: అందరి దృష్టి అతడి మీదే. అతడు ఎలా చెలరేగుతాడో చూడాలని అభిమానులు ఉవ్విళ్లూరుతున్నారు. సొంత మైదానంలో అరుదైన రికార్డు సాధిస్తాడా, లేదా అని క్రికెట్ లవర్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తనకు కలిసొచ్చిన చిన్నస్వామి స్టేడియంలో 'విరాట్' పర్వం లిఖించాలని కోరుకుంటున్నారు. నేడు జరగనున్న ఐపీఎల్-9 మొదటి క్వాలిఫయిర్ మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో క్రికెట్ ఫ్యాన్స్.. విరాట్ కోహ్లి గురించే చర్చించుకుంటున్నారు. ఈ ఐపీఎల్ లో అత్యధిక పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకున్న బెంగళూరు కెప్టెన్ మరో 81 పరుగులు చేస్తే అరుదైన ఘనత అతడి సొంతమవుతుంది. 14 మ్యాచ్‌లలో 4 సెంచరీలు, 6 అర్ధ సెంచరీలతో ఏకంగా 919 పరుగులు చేసిన కోహ్లి 81 పరుగులు సాధిస్తే వెయ్యి పరుగులు పూర్తవుతాయి. కోహ్లి ప్రస్తుత ఫామ్ ను బట్టి చూస్తే అతడు వెయ్యి పరుగుల మైలురాయిని అందుకునేలా కన్పిస్తున్నాడు. ఈ మైదానంలో గత నాలుగు మ్యాచ్‌లలో కలిపి 351 పరుగులు చేసిన 'మిస్టర్ అగ్రసివ్' ఈ ఫీట్ సాధిస్తాడని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఒకవేళ ఈ మ్యాచ్ లో విఫలమైనా అతడికి మరో అవకాశం ఉంది. రాయల్ ఛాలెంజర్స్ ఫైనల్స్ కు చేరితే మరో మ్యాచ్ ఆడతాడు. బెంగళూరు ఓడితే అతడికి రెండు మ్యాచ్ లు ఆడొచ్చు. ఎలిమినేటర్ మ్యాచ్ లో ఓడిన జట్టుతో రెండో క్వాలిఫయిర్ లో ఆడొచ్చు. ఈ మ్యాచ్ నెగ్గితే ఫైనల్లో ఆడే అవకాశం ఉంటుంది. మొత్తం మూడు మ్యాచ్ లు ఆడే అవకాశం ఉంది కాబట్టి కోహ్లి వెయ్యి పరుగులు పూర్తి చేయడం ఖాయమంటున్నారు అభిమానులు. ఇప్పటికే సింగిల్ ఐపీఎల్ సీజన్ లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ఘనత సాధించాడు.