ఈసారి భారత్‌-పాక్‌ మ్యాచ్‌ సాధారణ మ్యాచ్‌ కాదు..! | India, Pakistan meeting reserved for medals at Asian Games | Sakshi
Sakshi News home page

ఈసారి భారత్‌-పాక్‌ మ్యాచ్‌ సాధారణ మ్యాచ్‌ కాదు..!

Aug 13 2026 7:25 AM | Updated on Aug 13 2026 7:25 AM

India, Pakistan meeting reserved for medals at Asian Games

భారత్‌-పాకిస్తాన్‌ క్రికెట్‌ జట్ల మధ్య ఈసారి జరుగబోయే మ్యాచ్‌ సాధారణ మ్యాచ్‌గా ఉండదని క్రిక్‌బజ్‌ ఓ నివేదికలో తెలిపింది. ఇరు జట్లు త్వరలో జరుగబోయే ఏషియన్‌ గేమ్స్‌లో తలపడాల్సి ఉండగా.. అది పతక పోరే ఉంటుందని సదరు క్రికెట్‌ వెబ్‌సైట్‌ అంచనా వేస్తుంది. 2026 ఏషియన్‌ గేమ్స్‌లో భారత్-పాక్‌ మ్యాచ్ లీగ్ లేదా గ్రూప్ దశలో ఉండదు.

పురుషుల విభాగంలో భారత్, పాక్‌ టాప్-2 సీడెడ్ జట్లుగా నేరుగా క్వార్టర్‌ఫైనల్‌కు అర్హత సాధించాయి. భారత్ క్వార్టర్‌ఫైనల్-2లో, పాక్‌ క్వార్టర్‌ఫైనల్-1లో సెప్టెంబర్ 28న బరిలోకి దిగనున్నాయి.

క్వార్టర్‌ఫైనల్‌లో గెలిచిన భారత్ అక్టోబర్ 1న క్వార్టర్‌ఫైనల్-3 విజేతతో సెమీఫైనల్ ఆడుతుంది. పాక్‌ క్వార్టర్‌ఫైనల్-4 విజేతతో సెమీస్‌లో తలపడుతుంది. ఈ డ్రా ప్రకారం భారత్, పాక్‌ సెమీఫైనల్లో ఎదురుపడే అవకాశం లేదు.

ఇరు జట్లు ఫైనల్‌కు చేరితే అక్టోబర్ 3న బంగారు పతకం కోసం పోటీ జరుగుతుంది. ఒకవేళ సెమీఫైనల్లో ఓడితే అదే రోజు కాంస్య పతకం కోసం జరిగే మూడో స్థానం మ్యాచ్‌లో ఇరు జట్లు తలపడే అవకాశం ఉంటుంది.

మహిళల క్రికెట్‌లోనూ దాదాపు ఇదే పరిస్థితి. భారత్ టాప్ సీడ్‌గా, పాక్‌ నాలుగో సీడ్‌గా ఉన్నాయి. భారత్ క్వార్టర్‌ఫైనల్లో జపాన్‌తో, పాక్‌ థాయ్‌లాండ్‌తో తలపడనున్నాయి. ఈ విభాగంలోనూ భారత్-పాక్‌ మ్యాచ్ జరిగితే అది ఫైనల్ లేదా కాంస్య పతక పోరులోనే ఉండే అవకాశం ఉంది.

ఈసారి ఆసియా క్రీడలు సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 4 వరకు నాగోయాలో జరగనున్నాయి. క్రికెట్ పోటీలు మాత్రం సెప్టెంబర్ 17 నుంచే ప్రారంభం కానున్నాయి. అన్ని మ్యాచ్‌లు టీ20 ఫార్మాట్‌లో నిర్వహించనున్నారు.

భారత పురుషుల జట్టుకు శ్రేయాస్ అయ్యర్, మహిళల జట్టుకు హర్మన్‌ప్రీత్ కౌర్ నాయకత్వం వహించనున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement