ఒలింపియన్ జ్యోతి యర్రాజికి వైఎస్‌ జగన్‌ అభినందనలు | YS Jagan Congratulates Olympian Jyothi Yarraji | Sakshi
Sakshi News home page

ఒలింపియన్ జ్యోతి యర్రాజికి వైఎస్‌ జగన్‌ అభినందనలు

Jun 27 2026 11:01 AM | Updated on Jun 27 2026 11:12 AM

YS Jagan Congratulates Olympian Jyothi Yarraji

సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌.. ఒలింపియన్ జ్యోతి యర్రాజికి అభినందనలు తెలిపారు. 2026 ఆసియా క్రీడలకు అర్హత సాధించడంపై వైఎస్‌ జగన్‌ హర్షం వ్యక్తం చేశారు. ఆమె భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ ఎక్స్‌ వేదికగా..‘విశాఖపట్నం నుండి వెళ్లిన జ్యోతి అంతర్జాతీయ వేదికపై మరోసారి ఏపీ సత్తా చాటారు. 2026 ఆసియా క్రీడలకు అర్హత సాధించడం, నేషనల్ ఇంటర్-స్టేట్ ఛాంపియన్‌షిప్స్'లో స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకోవడం.. జ్యోతి అసాధారణ ప్రతిభ, పోరాట పటిమకు ఇవన్నీ నిదర్శనం. ఆమె భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నా’ అని ఆకాంక్షించారు.

ఇదిలా ఉండగా.. విశాఖపట్నానికి చెందిన జ్యోతి(26) ఇటీవల ముగిసిన జాతీయ సీనియర్‌ అంతరాష్ట్ర చాంపియన్‌షిప్‌లో 12.99 సెకన్ల టైమింగ్‌తో 100 మీటర్ల హర్డిల్స్‌ రేసును పూర్తి చేసి మొదటి స్థానంలో నిలిచింది. ఆసియా క్రీడల క్వాలిఫయింగ్‌ మార్క్‌ (13.34 సెకన్లు)ను సునాయాసంగా అధిగమించి ఆమె పోటీలకు అర్హత సాధించింది. 2023లో సాధించిన 12.78 సెకన్ల టైమింగ్‌తో ఇప్పటికీ జాతీయ రికార్డు జ్యోతి పేరిటే ఉంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement