జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ
గుంటూరు వెస్ట్: ఎస్‌ఐఆర్‌లో భాగంగా జిల్లాలో 1,68,218 నోటీసులు జారీ చేశామని జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ తెలిపారు. ఈ మేరకు సంబంధిత అధికారులతో మంగళవారం టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ నియోజకవర్గాల వారీగా తాడికొండ 24,862, మంగళగిరి 29,456, పొన్నూరు 27,095, తెనాలి 4,459, ప్రత్తిపాడు 19,556, గుంటూరు పశ్చిమ 30,022, గుంటూరు తూర్పు 32,768 నోటీసులు ఉన్నాయి. ఈ నెలాఖరులోపు క్లెయిమ్‌లు, అభ్యంతరాలు సమర్పించవచ్చని ఆయన పేర్కొన్నారు. ముసాయిదా ఓటర్ల జాబితాపై క్లెయిమ్‌లు, అభ్యంతరాలు జూలై 31వ తేదీ నుంచి స్వీకరించనున్నట్లు జిల్లా కలెక్టర్ వివరించారు.


