పొన్నూరు మండలం, చింతలపూడి గ్రామంలో నాకు 77 సెంట్లు భూమి ఉంది. దీనికి సంబంధించి పాస్‌బుక్‌తోపాటు అడంగల్ కూడా ఉంది. అందులో 33 సెంట్లు మా మామగారికి తమలపాకు తోటకు కౌలికిచ్చాను. ఆయన కొందరితో కుమ్మకై ్క ఆ భూమి తనదని వేరొకరికి విక్రయించారు. దీనికి పొన్నూరు తహసీల్దార్‌తోపాటు సిబ్బంది కూడా సహకరించి పేర్లు మార్చేస్తున్నారు. అడుగుతుంటే పొన్నూరు ఎమ్మెల్యే మనుషులమని బెదిరిస్తున్నారు. నా భూమి నాకు ఇప్పించి, న్యాయం చేయండి.
– త్రిపురనేని వెంకటస్వామి,
చింతలపూడి, పొన్నూరు మండలం


