గుంటూరు వెస్ట్: ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వచ్చే అర్జీల పరిష్కారంలో వివిధ ప్రభుత్వ శాఖల సమన్వయం చాలా ముఖ్యమని జిల్లా రెవెన్యూ అధికారి షేఖ్ ఖాజావలి తెలిపారు. సోమవారం స్థానిక కలెక్టరేట్లోని ఎస్‌ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో నిర్వహించిన పీజీఆర్‌ఎస్ కార్యక్రమంలో డీఆర్‌ఓ మాట్లాడుతూ కొన్ని అర్జీల పరిష్కారం రెండు, మూడు శాఖల సహకారంతో ఉంటాయన్నారు. సమన్వయం లేకపోతే అర్జీలు పరిష్కారం కావన్నారు. అర్జీలకు నిర్దేశిత కాలపరిమితిలో నాణ్యతతో కూడిన పరిష్కారం చూపాలన్నారు. పీజీఆర్‌ఎస్ కార్యక్రమంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రజాభిప్రాయ సేకరణ జరుపుతున్న దృష్ట్యా అర్జీదారులు సంతృప్తి చెందేలా పరిష్కారానికి కృషి చేయాలన్నారు. అనంతరం వచ్చిన అర్జీలను డీఆర్‌ఓతోపాటు డిప్యూటీ కలెక్టర్లు గంగరాజు, డేవిడ్, డీఈఓ సలీం బాష, జిల్లా అధికారులు పరిశీలించారు.
జిల్లా రెవెన్యూ అధికారి ఖాజావలి


