తప్పు ఒప్పుకో..
మంగళగిరిలో జరిగిన ర్యాలీలో పాల్గొన్న దొంతిరెడ్డి, మురుగుడు, చిల్లపల్లి
ప్రత్తిపాడులో డీఎస్సీ అక్రమాలపై భారీ నిరసన ర్యాలీలో పాల్గొన్న సమన్వయకర్త బలసాని కిరణ్‌కుమార్, నాయకులు
డీఎస్సీ అక్రమాలపై దగా పడ్డ యువత పక్షాన వైఎస్సార్ సీపీ పోరుబాట పట్టింది. రోడ్డున పడ్డ నిరుద్యోగులకు అండగా నిలిచి, వారి గొంతుకై అన్యాయాన్ని ప్రశ్నించింది. రూ.లక్షలు తీసుకుని తమ అనుయాయులకు, అర్హత లేనివారికి పప్పూ బెల్లాల్లా ఉపాధ్యాయ ఉద్యోగాలు పంచిపెట్టి, అర్హులైన అభ్యర్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టారని వైఎస్సార్ సీపీ నేతలు మండిపడ్డారు. డీఎస్సీ స్కాంపై వెంటనే సీబీఐ విచారణ జరగాలని, జరిగిన అక్రమాలకు బాధ్యత వహిస్తూ తప్పు ఒప్పుకొని.. మంత్రి పదవి నుంచి లోకేష్ తప్పుకోవాలని నినదించారు. డీఎస్సీ అక్రమాలపై ఉమ్మడి జిల్లావ్యాప్తంగా నిర్వహించిన ర్యాలీలు ఉవ్వెత్తున ఎగిసిన నిరసన గళమై.. జన ప్రభంజనమై టీడీపీ సర్కారు అవినీతిని నలుదిశలా చాటాయి.
– సాక్షి నెట్‌వర్క్
గుంటూరులో జరిగిన నిరసన ర్యాలీలో పాల్గొన్న జిల్లా అధ్యక్షుడు
అంబటి రాంబాబు, నగర అధ్యక్షురాలు నూరిఫాతిమా, పానుగంటి చైతన్య


