కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డితో వైఎస్సార్‌సీపీ నేతల భేటీ | YSRCP Leaders Meet Union Minister Kishan Reddy to Stop Illegal Mining in Panchadarla | Sakshi
Sakshi News home page

కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డితో వైఎస్సార్‌సీపీ నేతల భేటీ

Aug 11 2026 7:36 PM | Updated on Aug 11 2026 7:58 PM

YSRCP Leaders Meet Union Minister Kishan Reddy to Stop Illegal Mining in Panchadarla

ఢిల్లీ: కేంద్ర గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డిని మంగళవారం వైఎస్సార్‌సీపీ నేతలు గుడివాడ అమర్నాథ్, కరణం ధర్మశ్రీ, తనుజారాణి, గురుమూర్తి , మేడా రఘునాథ్ రెడ్డి , గొల్ల బాబురావు మంగళవారం కలిశారు. పంచదార్లలో అక్రమ మైనింగ్ ఆపివేయాలని విజ్ఞప్తి చేశారు. మైనింగ్‌ ఫ్రీ హెరిటేజ్‌ జోన్‌గా ప్రకటించాలని కోరారు.

పంచదార్లలో గ్రావెల్ క్వారీ కార్యకలాపాలపై తక్షణ ఫీల్డ్ ఇన్‌స్పెక్షన్ జరిపాలని మైనింగ్ అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని వైఎస్సార్‌సీపీ నేతలు విజ్ఞప్తి చేశారు. క్వారీ లీజు, అనుమతి సరిహద్దులు, అప్రూవ్డ్ మైనింగ్ ప్లాన్, అనుమతించిన లోతు-పరిమాణాలు పరిశీలించాలని అన్నారు. రెవెన్యూ, కడాస్ట్రల్, GPS/GIS రికార్డులతో జాయింట్ సర్వే నిర్వహించి లీజు సరిహద్దులు దాటి తవ్వకాలు జరిగాయో లేదో నిర్ధారించాలని చెప్పారు.

అనధికార క్వారీ, బ్లాస్టింగ్ కార్యకలాపాలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వైఎస్సార్‌సీపీ నేతలు కోరారు. గ్రావెల్ తవ్విన పరిమాణం, రవాణా వివరాలు పరిశీలించి అధిక తవ్వకాలు, అక్రమ రవాణా ఉన్నాయో తేల్చాలని అన్నారు. ASI రక్షిత బౌద్ధ అవశేషాలు, ధర్మలింగేశ్వరస్వామి ఆలయం సమీపంలో బ్లాస్టింగ్ ప్రభావం అంచనా వేయాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement