న్యూఢిల్లీ: మమతా బెనర్జీ మేనల్లుడికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. కంటి చికిత్స కోసం విదేశాలకు వెళ్లేందుకు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ బెనర్జీకి సుప్రీంకోర్టు అనుమతిచ్చింది. పదహారు కేసులున్న కారణంగా అతడు తిరిగి రాడేమో అన్న కలకత్తా హైకోర్టు అభ్యంతరాలను తోసిపుచ్చింది. విదేశీ టూర్‌కు అనుమతి నిరాకరిస్తూ ఆగస్టు 5న ఇచ్చిన ఆదేశాలను పక్కన పెట్టింది.
హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ అభిషేక్ బెనర్జీ దాఖలు చేసిన పిటిషన్‌పై చీఫ్ జస్టిస్ సూర్యకాంత్, న్యాయమూర్తులు జోయ్‌మాల్య బాగ్చి, వి. మోహనలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. తనకు నచ్చిన వైద్యం చేయించుకునే హక్కు ప్రతిఒక్కరికీ ఉందని వ్యాఖ్యానించిన బెంచ్ పర్యటన వివరాలతోపాటు ఎక్కడెక్కడ బస చేసేదీ వివరంగా దర్యాప్తు సంస్థలకు తెలపాలని ఆదేశించింది. ఈ వివరాలను గోప్యంగా ఉంచాలని స్పష్టం చేసింది.
అభిషేక్ బెనర్జీ విదేశాలకు వెళ్లిన తరువాత తిరిగి రాకపోవచ్చు అని బెంగాల్ ప్రభుత్వం తరఫున అదనపు సోలిసిటర్ జనరల్ ఎస్.వి.రాజు వాదనను బెనర్జీ తరఫు న్యాయవాది గోపాల్ శంకరనారాయణన్ ఖండించారు.
చదవండి: 'మొయిత్రాకు ఏమైనా జరిగితే ఆ జడ్జిదే బాధ్యత'
మమత వర్గం నిరసనలో తిరుగుబాటు ఎమ్మెల్యేలు
కోల్‌కతా: తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ)లో అంతర్గత విభేదాలు మరో ఆసక్తికరమైన మలుపు తిరిగాయి. మమతా బెనర్జీకి చెందిన వర్గం అసెంబ్లీ ఆవరణలో సోమవారం చేపట్టిన నిరసనలో తిరుగుబాటు రితబ్రత వర్గానికి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు పాలుపంచుకున్నారు. ఆదివారం మమత కంచ్రాపారలో పోలీస్ కస్టడీలో చనిపోయిన టీఎంసీ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లగా రాళ్లు, కర్రలతో కొందరు ఆమెపైకి దాడికి యత్నించడం తెల్సిందే.
ఈ ఘటనను నిరసిస్తూ మమత వర్గం ఎమ్మెల్యేలు చేపట్టిన ఆందోళనలో రితబ్రత వర్గంలోని ఎమ్మెల్యేలు అబ్దుల్ ఖలేక్ మొల్లా, తౌసిఫుర్ రహ్మాన్, బిభాస్ సర్దార్ పాల్గొన్నారు. తాము రితబ్రత వర్గంలో కొనసాగుతున్నామంటూనే, మమతపై జరిగిన దాడిని ఖండిస్తున్నామన్నారు. మమత సారథ్యంలోని టీఎంసీ గెలుచుకున్న 80 సీట్లకు గాను 65 మంది అనంతరం రితబ్రత నాయకత్వంలో వేరు కుంపటి పెట్టుకోవడం తెల్సిందే.


