విజయ్‌ సర్కార్‌ కీలక తీర్మానం.. బీజేపీ వాకౌట్‌ | Tamil Nadu Assembly Passes Anti-NEET Resolution As BJP MLAs Walk Out Amid Heated Debate, More Details Inside | Sakshi
Sakshi News home page

విజయ్‌ సర్కార్‌ కీలక తీర్మానం.. బీజేపీ వాకౌట్‌

Aug 11 2026 12:50 PM | Updated on Aug 11 2026 1:17 PM

Tamilnadu Vijay Govt Moves Resolution Against Neet

చెన్నై: టీవీకే ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నీట్‌కు వ్యతిరేకంగా తమిళనాడు అసెంబ్లీలో తీర్మానం చేసింది. దీంతో సభ నుంచి బీజేపీలు ఎమ్మెల్యేలు వాకౌట్‌ చేశారు. నీట్‌ కారణంగా విద్యార్థుల దృష్టి స్కూల్‌ చదువు నుంచి కోచింగ్‌లపైకి మళ్లుతోందని మంత్రి అరుణ్‌రాజ్‌ అన్నారు. భారీ ఫీజులు వసూలు చేసే కోచింగ్‌ సెంటర్లను నీట్‌ ప్రోత్సహిస్తోందంటూ మంత్రి ఆరోపించారు.

నీట్ అనేది సామాజిక న్యాయం, సమానత్వం, రాష్ట్ర హక్కులకు విరుద్ధంగా ఉందని మంత్రి అరుణ్‌రాజ్‌ పేర్కొన్నారు. పేపర్ లీక్‌లు, విద్యార్థులు ప్రాణాలు కోల్పోవడం వంటి అంశాలను అరుణ్‌రాజ్ ప్రస్తావించారు. సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన విజయ్‌.. టీవీకేను బలమైన రాజకీయ శక్తిగా నిలబెట్టేందుకు అడుగులు వేస్తున్నారు. యువత, విద్యార్థులు, రాష్ట్ర హక్కులు వంటి అంశాలను ప్రధాన అజెండాగా విజయ్‌ సర్కార్‌ ముందుకెళ్తుంది. నీట్‌ వ్యతిరేకతను బలంగా వినిపించడం ద్వారా విద్యార్థుల్లో, యువ ఓటర్లలో తన పార్టీకి స్థానం పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు.

కాగా, డ్రగ్‌ రహిత తమిళనాడు కార్యక్రమంలో సీఎం విజయ్‌ పాల్గొన్నారు. డ్రగ్స్‌ వినియోగానికి వ్యతిరేకంగా ఆయన ప్రతిజ్ఞ చేశారు. విద్యార్థులతో కలిసి డ్రగ్‌ ఫ్రీ ఫ్లైడ్జ్‌ చేసిన సీఎం విజయ్‌.. డ్రగ్స్‌ వాడొద్దు.. సన్నిహితులు వాడుతుంటే ఊరుకోవద్దు.. డ్రగ్స్‌ ఫ్రీ తమిళనాడు కోసం అంతా కృషి చేద్దామంటూ పిలుపునిచ్చారు.
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement