భర్తను చంపేందుకు భార్య భారీ స్కెచ్‌..! | wife and husband incident in Tamil Nadu | Sakshi
Sakshi News home page

భర్తను చంపేందుకు భార్య భారీ స్కెచ్‌..!

Aug 11 2026 11:11 AM | Updated on Aug 11 2026 11:11 AM

wife and husband incident in Tamil Nadu

తమిళనాడు: మాదక ద్రవ్యాలతో భర్తను హత్య చేసేందుకు యత్నించిన భార్యను పోలిసులు అరెస్టు చేశారు. కల్లకురిచి జిల్లాలోని చిన్నసేలం గ్రామానికి చెందిన రాజీవ్‌ గాంధీ(40) వ్యవసాయ కూలీ. ఇతను తన భార్య కనగ, పిల్లలతో కలిసి నివసిస్తున్నాడు. ఈ నేపథ్యంలో, గత 6వ తేదీ సాయంత్రం సుమారు 5 గంటలకు రాజీవ్‌ గాంధీ తన ఇంటి ముందు నిలబడి ఉండగా, పొలం బయట రోడ్డు నుండి బైకు పై వచ్చిన ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు కత్తులతో అతని మెడపైనా, నడుముపైనా పొడిచారు. 

కేకలు విని ఇరుగుపొరుగు వారు వచ్చారు. వారు రావడం చూసిన, ఆ గుర్తుతెలియని వ్యక్తులు బైకు పై పారిపోయారు .దీని తరువాత, రాజీవ్‌ గాందీని రక్షించి కల్లకురిచి ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ ఆయనకు ఇంటెన్సివ్‌ ట్రీట్మెంట్‌ అందిస్తున్నారు.ఈ విషయమై చిన్నసేలం పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు కోసం రెండు ప్రత్యేక బందాలను ఏర్పాటు చేశారు. అందులో, రాజీవ్‌ గాంధీ భార్య కనక, ఆమె వివాహితర ప్రియుడు, మాజీ పంచాయత్‌ అధ్యక్షుడు ధనపాల్‌ (53), ఇద్దరు అనుచరులతో కలిసి రాజీవ్‌ గాందీని హత్య చేయడానికి యత్నించినట్లు వెల్లడైంది. దీంతో చిన్నసేలం పోలీసులు ఆ గ్రూపు మాజీ నాయకుడు ధనపాల్, కనక,  కిరాయి హంతకులైన పాల్‌ రాజ్‌ (24), కార్తీక్‌తో సహా మరో నలుగురి పై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement