చెరకు రైతులకు మెట్రిక్‌ టన్నుకు రూ.4,000 | - | Sakshi
Sakshi News home page

చెరకు రైతులకు మెట్రిక్‌ టన్నుకు రూ.4,000

Aug 11 2026 2:12 AM | Updated on Aug 11 2026 2:12 AM

అసెంబ్లీలో ప్రత్యేక తీర్మానం

అన్నదాతకు సీఎం విజయ్‌

ప్రోత్సాహకం

సాక్షి, చైన్నె : ఇటీవల కాలంగా గవర్నర్‌ , కేంద్ర ప్రభుత్వ రూపంలో తమిళ్‌ తాయ్‌ వాల్తు రాష్ట్రంలో జరిగే కార్యక్రమాలలో మూడో స్థానానికి నెట్టబడుతూ వస్తున్న విషయం తెలిసిందే. టీవీకే ప్రభుత్వం అధికారంలోకి వచ్చినానంతరం తమిళ్‌ తాయ్‌ వాల్తు విషయంగా చోటు చేసుకుంటూ వస్తున్న పరిణామాలు వివాదాలకు దారి తీస్తున్నాయి. ఈ పరిస్థితులలో సోమవారం అసెంబ్లీలో ఇందుకు సంబంధించిన ప్రత్యేక తీర్మానాన్ని సీఎం విజయ్‌ ప్రవేశ పెట్టారు.

తమిళ్‌ అంటే పవర్‌ – తమిళ్‌ అంటే ‘గెత్తు’..

ప్రపంచంలో తమిళులు లేని దేశమంటూ లేదని, తమిళం అంటే కేవలం ఒక భాష కాదని, అదొక సంస్కృతి, ఆలోచన , ఆతిథ్యానికి ప్రతీక అని చెప్పారు. ఒక రకంగా చెప్పాలంటే తమిళం అంటే గెత్తు (స్టైల్‌ లేదా గెలుపు), తమిళం అంటే పవర్‌‘ అని సీఎం స్పష్టం చేశారు.

ఏకగ్రీవంగా మద్దతు..

భిన్నత్వంలో ఏకత్వమనే భారతీయ భావనకు ఈ తీర్మానం ప్రతీక అని, ఇందులో ఎటువంటి రాజకీయ విబేధాలు చూడకూడదని సీఎం కోరారు. అనంతరం ఈ ప్రత్యేక తీర్మానానికి అసెంబ్లీలోని డీఎంకే, అన్నాడీఎంకే, కాంగ్రెస్‌, పిఎంకే, వీసీకే సహా అన్ని రాజకీయ పక్షాలు తమ పూర్తి మద్దతును ప్రకటించాయి.

వరి, చెరకు రైతులకు

ఊహించని ప్రోత్సాహకం

తమిళనాడులోని వరి, చెరకు వ్యవసాయ రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్‌ అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. శాసనసభ నిబంధన 110 కింద ప్రసంగించిన ఆయన, వరి ధాన్యం , చెరకు పంటలకు ఇచ్చే రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రోత్సాహకాన్ని భారీగా పెంచుతున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర చరిత్రలోనే ఇంత పెద్ద మొత్తంలో ప్రోత్సాహకాలను పెంచడం ఇదే తొలిసారి అని ఆయన పేర్కొన్నారు.

వరి ధాన్యానికి మద్దతు ధర పెంపు

సెప్టెంబరు 1 నుంచి ధాన్యం సేకరణ సీజన్‌ ప్రారంభం కానున్న నేపథ్యంలో, కేంద్ర ప్రభుత్వ కనీస మద్దతు ధరతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహకాన్ని పెంచారు. సన్న రకం ధాన్యం– క్వింటాలుకు రూ.289 పెంచి, మొత్తం ధరను రూ2,750గా నిర్ణయించారు. సాధారణ రకం ధాన్యం క్వింటాలుకు రూ.159 పెంచి, మొ త్తం ధరను రూ.2,600గా నిర్ణయించారు. ఒకే సంవత్స రంలో వరి ధాన్యానికి రాష్ట్ర ప్రోత్సాహకాన్ని రూ.156 కంటే ఎక్కువగా పెంచి ఇవ్వడం తమిళనాడు చరిత్రలోనే ఇదే ప్రథమం అని సీఎం వ్యాఖ్యలు చేశారు.

తమిళ్‌ తాయ్‌ వాల్తుకు

పెద్ద పీట

ఎవరినీ కించపరిచేది కాదు..

తమిళ్‌త్తాయ్‌ వాల్తు గీతం ప్రపంచమంతా సంతోషంగా ఉండాలని కోరుకుంటుందే తప్పా, ఏ ఇతర భాషను, మతాన్ని, జాతినీ లేదా వ్యక్తిని కించపరిచేలా ఉండదని ఆయన స్పష్టం చేశారు. రాజ్యాంగం ప్రతి రాష్ట్ర భాషకు, సంస్కృతికి ,సాంప్రదాయానికి సమాన హక్కులను ఇచ్చిందని, ఆ హక్కు ప్రాతిపదికన తమిళ్‌ తాయ్‌ వాల్తు మొదటి ప్రాధాన్యం ఇవ్వడం రాష్ట్ర హక్కులలో భాగమని వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం జనవరి 28, 2026న విడుదల చేసిన మార్గదర్శకాలపై జులై 9న ప్రధానికి లేఖ రాసిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు.

చెరుకు పంటకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం మెట్రిక్‌ టన్నుకు రూ. 3,290.50గా నిర్ణయించగా, తమిళనాడు ప్రభుత్వం తన వంతుగా ప్రత్యేక ప్రోత్సాహకంగాగా709.50 అదనంగా ప్రకటించింది దీంతో దీనితో చెరకు రైతులకు మెట్రిక్‌ టన్నుకు మొత్తం రూ.4,000 లభించనుంది. రాష్ట్ర చరిత్రలో మెట్రిక్‌ టన్ను చెరకుపై రూ.134 కంటే ఎక్కువ ప్రత్యేక ప్రోత్సాహకాన్ని అందించడం కూడా ఇదే మొదటిసారి అని సీఎం వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా ఉన్నప్పటికీ రైతు సంక్షేమమే ముఖ్యం అని పేర్కొన్నారు.రైతులు పంటలు వేయడం నుంచి, కోతలు కోసి విక్రయించే వరకు తమ సర్వస్వాన్ని ధారపోస్తారన్నారు. ప్రస్తుతం తమిళనాడు ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించకపోయినప్పటికీ, రైతు సోదరుల ప్రయోజనాలను కాపాడాలనే దృఢ సంకల్పంతోనే ఈ చారిత్రాత్మక పెంపును ప్రకటించామని వ్యాఖ్యలు చేశారు. కాగా, పంట రుణమాఫీ లాగే మద్దతు ధరల పెంపు కూడా ఓ దగా అపి టీవీకే ప్రభుత్వంపై అమ్మ మక్కల్‌ మున్నేట్ర కళగం నేత టీటీవీ దినకరన్‌ తీవ్ర ఽస్థాయిలో ధ్వజమెత్తారు.ఎన్నికలకు ముందు ధాన్యానికి క్వింటాలుకు రూ.3,500, చెరకుకు టన్నుకు రూ.4,500 ఇస్తామని హామీ ఇచ్చిన టీవీకే తాజాగా మాట మార్చిందన్నారు. పీఎంకే అద్యక్షుడు అన్బుమణి రాందాసు స్పందిస్తూ, వరి, చెరకు ప్రోత్సాహకాలు సరిపోవు అని, మరింతగా పెంచాల్సిందేనని డిమాండ్‌ చేశారు. ఇది కంటి తడుపు చర్య అని వ్యాఖ్యలు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement