సీఎం విజయ్ ప్రసంగిస్తూ భాష అనేది కేవలం ఒక కమ్యూనికేషన్ మాత్రమే కాదని, ప్రపంచంలో ఏ భాషకై నా అది వర్తిస్తుందన్నారు.అయితే, తమిళం కేవలం ఒక భాష మాత్రమే కాదని, అది మన ప్రాణం, మన భావోద్వేగం. అమ్మ అని పిలిచినప్పుడు ఏ బంధం, ప్రేమ మనలో ఉప్పొంగుతుందో, మన మాతృభాష అయిన తమిళం కూడా అంతే పవిత్రమైనదని వ్యాఖ్యలు చేశారు. 1891లో మనోన్మణియం సుందరనార్ రాసిన గీతాన్ని ప్రస్తావిస్తూ భారత ఉపఖండం అనే అందమైన ముఖానికి నొసటిపై రూపకమైన తిలకం వంటిది తమిళనాడు అని, దాని పరిమళం ప్రపంచమంతా వ్యాపించాలని ఆయన పేర్కొన్నారు.
అసెంబ్లీలో ప్రసంగిస్తున్న సీఎం విజయ్


