క్రమశిక్షణ.. పెంపొందించుకోవాలి | - | Sakshi
Sakshi News home page

క్రమశిక్షణ.. పెంపొందించుకోవాలి

Aug 11 2026 2:06 AM | Updated on Aug 11 2026 2:06 AM

కొరుక్కుపేట: విద్యా నైపుణ్యంతో పాటు వ్యక్తిత్వ బలం , క్రమశిక్షణను పెంపొందించుకోవాలని మాజీ డీజీపీ డాక్టర్‌ సి. శైలేంద్ర బాబు విద్యార్థులకు సూచించారు.ఎస్‌.ఆర్‌.ఎం. ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ– వడపళని క్యాంపస్‌లో ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ విభాగం 18వ మొదటి సంవత్సరం విద్యార్థుల ఇండక్షన్‌ కార్యక్రమం సోమవారం విజయవంతంగా జరిగింది.ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా తమిళనాడు మాజీ డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌ డాక్టర్‌ సి. శైలేంద్ర బాబు, గౌరవ అతిథిగా యాక్సెంచర్‌ స్ట్రాటజీ అండ్‌ కన్సల్టింగ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సంతోష్‌ నటరాజన్‌ పాల్గొని వేడుకలను ప్రారంభించి విద్యార్థులకు స్ఫూర్తిదాయకమైన ప్రసంగం అందించారు.ఫ్యాకల్టీ ఆఫ్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ టెక్నాలజీలోని వివిధ విభాగాలలో కొత్తగా చేరిన మొదటి సంవత్సరం విద్యార్థులను అభినందించారు. సెమీకండక్టర్లు, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ వంటి అభివద్ధి చెందుతున్న సాంకేతికతలలో అందుబాటులో ఉన్న పరిశోధనా అవకాశాలు , భవిష్యత్‌ వత్తి అవకాశాల గురించి వారు వివరించారు.ధైర్యం, వ్యక్తిత్వం, విలువలు, కషి , నిబద్ధత కలిగి ఉండాలన్నారు.. విద్యా నైపుణ్యంతో పాటు వ్యక్తిత్వ బలం , క్రమశిక్షణను పెంపొందించుకోవాలని విద్యార్థులను కోరారుఎస్‌ ఆర్‌ ఎం ప్రో–ఛాన్స్‌లర్‌ (పరిపాలన) డా. రవి పచ్చముత్తు, డైరెక్టర్‌ హరిణి రవి, వైస్‌ ఛాన్సలర్‌ డా. సి. ముత్తమిళచెల్వన్‌, మొదటి సంవత్సరం విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, వారి విద్యా ప్రస్థానం విజయవంతంగా, సంతప్తికరంగా సాగాలని ఆకాంక్షించారు.ఇంకా పరిపాలన డైరెక్టర్‌ డా. వెంకటేష్‌ బాబు, విద్యా విభాగ డైరెక్టర్‌ డా. రామ ఎస్‌ కొమరగిరిలు విద్యార్థులకు తమ శుభాకాంక్షలు తెలియజేశారు. వడపళని క్యాంపస్‌, ఇంజనీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ ఫ్యాకల్టీ డీన్‌ డా. సి.వి. జయకుమార్‌ స్వాగతోపన్యాసం చేశారు. ఇంజనీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ ఫ్యాకల్టీ వైస్‌ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ సి. గోమతి వందన సమర్పణతో కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement