వేలూరు: క్రైస్తవులను ఎస్సీ జాబితాలో చేర్చాలని కోరుతూ దళిత క్రైస్తవుల సమ్మేళనం ఆధ్వర్యంలో వేలూరు అన్నారోడ్డులో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు వేలూరు క్యాతలిక్ చర్చిల బిషఫ్ అంబు రోస్ పిచ్చముత్తు, సీఎస్‌ఐ వేలూరు డయాసీస్ బిషఫ్ శర్మ నిత్మానందం అధ్యక్షత వహించారు. తిరువణ్ణామలై పాస్టర్ భూపతి లూర్దు స్వామి, పాస్టర్ ఐసెక్ కదీర్‌వేల్‌లు మాట్లాడుతూ మత మార్చుకొని క్రైస్తవ దేవాలకు వెళ్తున్న వారిని బీసీ జాబితాలో చేర్చాలని సుప్రీకోర్టు న్యాయమూర్తి తీర్పు ఇవ్వడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. దేశవ్యాప్తంగా క్రైస్తవ సోదరులు ఈ చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారన్నారు. దేశ వ్యాప్తంగా దళిత క్రైస్తవులు అనేక వెనుక బడి ఉన్నారని అయితే హిందువుగా ఉండి క్రైస్తవ చర్చిలకు వెలితే వెంటనే కుల ధ్రువీకరణ సర్టిఫికెట్లును మారుతుందని తీర్పు ఇవ్వడం సరికాదన్నారు. ఈ ధర్నాలో పాస్టర్‌లు, మత బోధకులు, ఎస్‌సీ, ఎస్‌టీ దళిత సంఘాల ప్రతినిధులు, వివిధ చర్చిలకు చెందిన బిషఫ్‌లు పాల్గొన్నారు.


