కట్టా కుస్తీ –3 వస్తుందా ? | - | Sakshi
Sakshi News home page

కట్టా కుస్తీ –3 వస్తుందా ?

Aug 11 2026 2:06 AM | Updated on Aug 11 2026 2:06 AM

తమిళసినిమా: చిత్రాలకు సీక్వెల్స్‌ అనేవి మొదటి భాగం విజయాలను బట్టి ఉంటుంది. అలా సీక్వెల్స్‌ అనేవి అరుదుగానే రూపొందుతుంటాయి. అలాంటి వాటిలో కట్టా కుస్తీ చిత్రం ఒకటి. సెల్లా అయ్యావు దర్శకత్వంలో విష్ణు విశాల్‌, నటి ఐశ్వర్య లక్ష్మి జంటగా నటించిన ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. దీంతో ఈ చిత్రానికి సీక్వెల్‌ గా రూపొందిన కట్టా కుస్తీ 2 చిత్రం కూడా ఇటీవల విడుదలై దానికంటే పెద్ద విజయాన్ని అందుకుంది. దీంతో కట్టా కుస్తీ –3 చిత్రానికి అవకాశం ఉందా ? అన్న ప్రశ్నకు దర్శకుడు సెల్లా అయ్యావు బదిలీస్తూ కట్టా కుస్తీ చిత్రం మంచి విజయాన్ని సాధించడమే దానికి సీక్వెల్‌ పొందడానికి కారణం అని పేర్కొన్నారు. సాధారణంగా పార్టు –2 చిత్రం రూపొందిస్తున్నప్పుడు దానిపై అంచనాలు ఎక్కువగా ఉంటాయని, ఇదే విషయాన్ని తాను నటుడు విష్ణు విశాల్‌ తో చెప్పానన్నారు. అందుకు ఆయన పేరు కోసం పార్ట్‌ చేయవద్దని, మంచి కథ అమిరితేనే చేద్దామని చెప్పారన్నారు. దీంతో ఆరు నెలల పాటు చుట్టూ సిద్ధం చేసుకుని అది అందరికీ నచ్చిన తర్వాతే కట్టాకుస్తే –2 చిత్రాన్ని ప్రారంభించినట్లు చెప్పారు. మొదటి భాగం కంటే రెండో భాగం అధికంగా ఆదరణను పొందటం సంతోషకరం అన్నారు. తదుపరి చిత్రాలు చేస్తున్నప్పుడు సక్సెస్‌ అయిన చిత్రాల పేర్లతో మాత్రమే చేయకూడదని భావించానన్నారు. అదేవిధంగా కథకు కొనసాగింపు ఉండాలని భావించానని, అలాంటి కథ అమరడంతో కట్టా కుస్తీ చిత్రాన్ని రెండు భాగాలు రూపొందించినట్లు చెప్పారు. అదేవిధంగా మంచి కథ అమిరితే కట్టాకుస్తీ –3 చిత్రం రూపొందుతుందని దర్శకుడు సెల్లా అయ్యావు చెప్పారు. ప్రస్తుతం కెన్‌ కరుణాస్‌ హీరోగా చిత్రాన్ని తెరకెక్కించే ప్రయత్నాలు జరుగుతున్నాయని, దీనికి సంబంధించిన చర్చలు జరుగుతున్నట్లు చెప్పారు. ఇది ప్రేమ,వినోదం తో కూడిన కుటుంబ సమేతంగా చూసి ఆనందించే కథా చిత్రంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement