● మద్రాసు హైకోర్టులో బాధ్యతల స్వీకరణ ● జస్టిస్ కె. గోవిందరాజన్ – మధురై బెంచ్‌లో కేంద్ర ప్రభుత్వ డిప్యూటీ సొలిసిటర్ జనరల్‌గా సేవలందించారు.
● జస్టిస్ రజనీష్ పధియాల్ –ఈడీ ప్రత్యేక ప్రభుత్వ ప్లీడర్‌గా పనిచేశారు. అమెరికాలోని కాలిఫోర్నియా యూనివర్సిటీ నుంచి మాస్టర్స్ పూర్తి చేశారు.
● జస్టిస్ ఎన్. రమేష్ – ఈడీ ప్రత్యేక ప్లీడర్‌గా పనిచేశారు. గతంలో సివిల్ జడ్జిగా విధులు నిర్వర్తించి, అనంతరం హైకోర్టు ప్రాక్టీస్ కొనసాగించారు.
● జస్టిస్ జి.కె. ముత్తుకుమార్– తమిళనాడు ప్రభుత్వ ప్లీడర్‌గా వ్యవహరించారు. తిరుపతి లడ్డూ, ఈరోడ్ పసుపు వంటి ఉత్పత్తులకు జీఐ గుర్తింపు రాబట్టడంలో కీలక పాత్ర పోషించారు.
● జస్టిస్ ఆర్. రాజేష్ వివేకానందన్ – కేంద్ర ప్రభుత్వ డిప్యూటీ సొలిసిటర్ జనరల్‌గా పనిచేశారు.
● జస్టిస్ ఎస్. రవికుమార్ – పుదుచ్చేరి ప్రభుత్వ సూపరింటెండింగ్ అడ్వకేట్‌గా బాధ్యతలు నిర్వహించారు.
● జస్టిస్ ఎన్. దిలీప్‌కుమార్– ఆదాయ పన్న , కస్టమ్స్, ఏఐసీటీఈ విభాగాలు సహా కేంద్ర ప్రభుత్వ విభాగాల తరఫున వాదనలు వినిపించారు.
● జస్టిస్ ఇ. మనోహరన్– తమిళనాడు అడ్వకేట్ జనరల్ కార్యాలయంలో ప్రభుత్వ ప్లీడర్‌గా పనిచేశారు.
● జస్టిస్ డాక్టర్ పి.మురుగన్–జిల్లా ప్రిన్సిపల్ జడ్జిగా సేవలందించిన ఈయన సోషియాలజీ, ఫిలాసఫీ వంటి విభాగాల్లో 10కి పైగా పీజీ డిగ్రీ లు, రాజ్యాంగ చట్టంలో డాక్టరేట్ సాధించారు.
● జస్టిస్ ఎమ్.టి. సుమతి– వివిధ జిల్లాల కుటుంబ, మహిళా సివిల్ కోర్టుల్లో జడ్జిగా సేవలందించారు.
● జస్టిస్ ఎస్. అల్లి – మద్రాస్ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌గా, చైన్నె జిల్లా ప్రిన్సిపల్ సెషన్స్ జడ్జిగా పనిచేశారు.
● జస్టిస్ సి. తిరుమగల్ – ఎన్డీపీఎస్ ప్రత్యేక కోర్టులతో పాటు పలు జిల్లాల మహిళా కోర్టుల జడ్జిగా పనిచేశారు.
● జస్టిస్ ఎస్. కార్తికేయన్ – చైన్నె జిల్లా ప్రిన్సిపల్ సెషన్స్ జడ్జిగా, పుదుచ్చేరి ప్రభుత్వ లా సెక్రటరీగా పనిచేశారు.
● జస్టిస్ పి. మురుగేసన్– చైన్నె సీబీఐ ప్రత్యేక కోర్టు ప్రిన్సిపల్ జడ్జిగా బాధ్యతలు నిర్వహించారు.
● జస్టిస్ ఎన్. గుణశేఖరన్– తిరుప్పూర్, తిరుచ్చి, నామక్కల్ జిల్లాల ప్రిన్సిపల్ సెషన్స్ జడ్జిగా పనిచేశారు.
సాక్షి,చైన్నె: మద్రాస్ హైకోర్టుకు కొత్తగా నియమితులైన 15 మంది న్యాయమూర్తులు ప్రమాణ స్వీకారం చేశారు. హైకోర్టు ఆడిటోరియంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్.ఎ. ధర్మాధికారి వీరిచే ప్రమాణ స్వీకారం చేయించారు. వీరిలో 5 మంది శాశ్వత న్యాయమూర్తులుగా, 10 మంది అదనపు న్యాయమూర్తులుగా బాధ్యతలు స్వీకరించారు. వివరాలు.. మద్రాస్ హైకోర్టుకు 19 మందిని న్యాయమూర్తులుగా నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేయగా, వారిలో 8 మంది అడ్వకేట్లు, 7 మంది జిల్లా జడ్జీలు కలిపి మొత్తం 15 మంది నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం ముద్ర వేశారు.ప్రమాణ స్వీకార అనంతరం తమ తమ చాంబర్‌లలో వీరు బాద్యతలు స్వీకరించారు . వీరికి హైకోర్టులోని సహచర న్యాయ మూర్తులు, న్యాయవాదులు, బార్ కౌన్సిల్ వర్గాలు శుభాకాంక్షలు తెలియజేశాయి.
కొత్త న్యాయమూర్తులు..