‘నన్ను నగ్నంగా మార్చకండి!’ | If Earth Can Talk: Emotional Heartbreak Warning to Humanity | Sakshi
Sakshi News home page

‘నన్ను నగ్నంగా మార్చకండి!’

Aug 11 2026 2:54 PM | Updated on Aug 11 2026 3:05 PM

If Earth Can Talk: Emotional Heartbreak Warning to Humanity

నేను మీ పాదాల కింద ఉన్న భూమిని. యుగాలుగా మిమ్మల్ని మోస్తున్న ఓర్పును. పేగు బంధంతో మీ పొట్ట నింపుతున్న తల్లిని. కానీ ఈరోజు మీ పురోగతి నా పాలిట శాపమైంది. మానవ మనుగడకు కావలసిన వనరులన్నీ నా గుండె లోతుల్లోంచి తీసి ఇచ్చినందుకు నాకిదేనా బహుమానం? ఒకవేళ నాకు గొంతు వస్తే.. నా వేదనను మీకు ఇలా విన్నవించుకునేదాన్ని!

  • శాస్త్ర సాంకేతిక రంగాల మహత్తర ప్రగతి అని మీరు మురిసిపోతుంటే ఆ వెనుక కుమిలిపోతున్నది నేనే. రోజూ పారిశ్రామిక రంగాలు వెదజల్లే నల్లని దట్టమైన పొగలు, విషవాయువులతో నా శ్వాస ఆగిపోతోంది.

  • మీ ఆసుపత్రులు, వైద్య రంగం ఇచ్చే చికిత్సలతో మనుషులు కోలుకుంటున్నారు గానీ, అక్కడి నుంచి వెలువడే బయో మెడికల్ వ్యర్థాలు, హానికర ప్లాస్టిక్ నన్ను రోగగ్రస్తురాలిగా మారుస్తున్నాయి.

  • పారిశుధ్య లోపం వల్ల ఉత్పత్తయ్యే కుళ్లిన వ్యర్థాలు, పారిశ్రామిక రసాయనాలు నా సిరల్లోకి విషాన్ని నింపుతున్నాయి.

  • ఎలక్ట్రానిక్స్, 5జీ యుగం తెచ్చిన మొబైల్ రేడియేషన్ నా వాతావరణాన్ని, జీవవైవిధ్యాన్ని అతలాకుతలం చేస్తోంది. మానవ తప్పిదాల వల్ల నా నేల తల్లి నల్లబడిపోతోంది.

  • పండిస్తున్న పంటల పేరుతో వ్యవసాయంలో విచ్చలవిడిగా వాడే క్రిమిసంహారక మందులు, రసాయన ఎరువులు నా జీవసారాన్ని పీల్చి పిప్పి చేస్తున్నాయి.

  • పచ్చని చెట్లను నరికివేసి నన్ను నగ్నంగా మార్చడం వల్ల వర్షపు నీటికి నా పైపొరలు కొట్టుకుపోయి నేల తీవ్ర క్రమక్షయానికి గురవుతోంది.

మీ నాగరికత సాధించిన ప్రగతికి నేను సంతోషిస్తున్నాను.. కానీ విషపు వలయాలతో నా గుండెలపై నిర్మించే ఏ సామ్రాజ్యమూ శాశ్వతం కాదని గ్రహించండి!

దయచేసి మానవాళికి నా విజ్ఞప్తి..

  • క్రిమిసంహారకాలు, కృత్రిమ ఎరువులతో నేలను విషపూరితం చేయకండి; ప్రకృతి వ్యవసాయాన్ని ఆదరించండి.

  • పచ్చదనాన్ని నాశనం చేసి నేల క్రమక్షయానికి కారణం కాకండి.

  • ప్లాస్టిక్, ఇ-వేస్ట్, వైద్య వ్యర్థాలను నిర్లక్ష్యంగా నేలపై పడేసి నన్ను కలుషితం చేయకండి.

  • పరిమితి లేని వాహన వినియోగం, పారిశ్రామిక వ్యర్థాలతో నా వాతావరణానికి, ఆయువుకు గొడ్డలిపెట్టు కాకండి.

ఇదీ చదవండి: ఆకాశమే హద్దుగా పసిడి ధరలు.. ఒక్కరోజే ఇంతలా..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement