నిఫ్టీ-50 నుంచి విప్రో అవుట్! | Wipro Replaced by BSE in Nifty 50 Check Effective Date Market Cap Key Details | Sakshi
Sakshi News home page

నిఫ్టీ-50 నుంచి విప్రో అవుట్!

Aug 11 2026 1:45 PM | Updated on Aug 11 2026 1:45 PM

Wipro Replaced by BSE in Nifty 50 Check Effective Date Market Cap Key Details

భారతీయ స్టాక్ మార్కెట్ బెంచ్‌మార్క్ సూచీ నిఫ్టీ-50లో చారిత్రాత్మక మార్పు చోటుచేసుకుంది. దాదాపు మూడు దశాబ్దాలుగా నిఫ్టీలో నిలకడగా కొనసాగుతున్న స్వదేశీ ఐటీ దిగ్గజం విప్రో ప్రధాన సూచీ నుంచి వైదొలగనుంది. దాని స్థానంలో దేశంలోనే అతిపెద్ద స్టాక్ ఎక్స్చేంజ్ ఆపరేటర్ అయిన బీఎస్‌ఈ ప్రవేశించనుంది. ఈ మేరకు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) ఇండెక్స్ మెయింటెనెన్స్ కమిటీ తన అర్ధవార్షిక సమీక్ష వివరాలను వెల్లడించింది. ఈ మార్పులు సెప్టెంబర్ 30, 2026 నుంచి అమలులోకి రానున్నాయి.

ఈ పరిణామం కేవలం ఒక సాంకేతిక సూచీ పునర్వ్యవస్థీకరణ మాత్రమే కాదు; భారత కార్పొరేట్ రంగంలో సంభవిస్తున్న నాటకీయ మార్పునకు బలమైన నిదర్శనం. గత ఆరు నెలల సగటు ఫ్రీ-ఫ్లోట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆధారంగా చూస్తే బీఎస్‌ఈ విలువ రూ.1,40,879 కోట్లకు చేరగా విప్రో విలువ రూ.55,930 కోట్లకు పరిమితమైంది. నిబంధనల ప్రకారం కనిష్ట పరిమాణంలో ఉన్న కంపెనీ కంటే 1.5 రెట్ల కంటే ఎక్కువ మార్కెట్ క్యాప్ సాధించిన బీఎస్‌ఈ ప్రధాన సూచీకి అర్హత సాధించగా విప్రో 'నిఫ్టీ నెక్స్ట్ 50'కి మారనుంది.

ఒకప్పుడు భారత ఆర్థిక వ్యవస్థకు చోదక శక్తిగా నిలిచిన ఐటీ పరిశ్రమ వర్తమాన సవాళ్లను ఎదుర్కొంటోందని ఇది స్పష్టం చేస్తోంది. గ్లోబల్ టెక్నాలజీ క్లయింట్ల బడ్జెట్ కోతలు, డిస్క్రిషనరీ వ్యయాల్లో మందగమనం, ఏఐ తెస్తున్న సాంకేతిక విప్లవం సంప్రదాయ అవుట్‌సోర్సింగ్ ప్రాజెక్టుల లాభదాయకతను ఒత్తిడిలోకి నెట్టాయి. నిఫ్టీ-50లో టాప్-5 ఐటీ కంపెనీల ఉమ్మడి వెయిటేజీ ఈ ఏడాది 9 శాతం కంటే దిగువకు పడిపోవడం గమనార్హం. 2002 సంవత్సరం తర్వాత ఐటీ రంగానికి ఇది అత్యల్ప నిష్పత్తి కావడం విశేషం.

ఇదీ చదవండి: ఆకాశమే హద్దుగా పసిడి ధరలు.. ఒక్కరోజే ఇంతలా..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement