పబ్లిక్ ఇష్యూకి వస్తున్న నేపథ్యంలో కో–లొకేషన్, డార్క్ ఫైబర్ కేసుల వివాదాన్ని నేషనల్ స్టాక్ ఎక్సే్చంజ్ (ఎన్‌ఎస్‌ఈ) సెటిల్ చేసుకుంది. ఇందుకోసం మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి రూ. 714.74 కోట్లు చెల్లించినట్లు తెలిపింది. మొత్తం రూ. 1,491.21 కోట్లకి సెటిల్ చేసేందుకు సెబీ నుంచి సూత్రప్రాయ అనుమతులు లభించడంతో ఈ మేరకు చెల్లింపులు జరిపినట్లు వివరించింది.
ఇప్పటికే రూ. 776.47 కోట్లు డిపాజిట్ చేయగా మిగతా మొత్తాన్ని తాజాగా చెల్లించినట్లు పేర్కొంది. రెండు కేసులను రూ. 1,387.39 కోట్లకు సెటిల్ చేసుకునేలా ముందుగా ప్రతిపాదించిన ఎన్‌ఎస్‌ఈ, ఆ తర్వాత దాన్ని రూ. 1,491.21 కోట్లకు సవరించింది. ఐపీవో ద్వారా ఎన్‌ఎస్‌ఈ దాదాపు రూ. 30,000 కోట్లు సమీకరించే యత్నాల్లో ఉంది.


