breaking news
heartbreak
-
‘వీకెండ్’ కోసం వచ్చి అనంతలోకాలకు...
ఘట్కేసర్(హైదరాబాద్): ఓ ఐటీ కంపెనీలో కొత్తగా ఉద్యోగంలో చేరారు ఆ యువకులు. వరుసగా రెండు రోజులు సెలవులు రావడంతో స్నేహితులతో ఉత్సాహంగా పార్టీ చేసుకునేందుకు శుక్రవారం సాయంత్రం ఘట్కేసర్ పరిధి ఏదులాబాద్‌లోని విహారి నెస్ట్ ఫాంహౌస్‌కు వచ్చారు. అర్థరాత్రి దాటిన తర్వాత బయటకు వచ్చి మిగతా స్నేహితులతో కలిసి రెండు కార్లలో ఏదులాబాద్ లక్ష్మీనారాయణ చెరువును చూసేందుకు వెళ్లారు. తిరిగి ఫాంహౌస్‌కు చేరుకునే క్రమంలో ఓ కారు రోడ్డు పక్కనున్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టడంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. మరో యువకుడి పరిస్థితి విషమంగా ఉంది. ఇన్స్పెక్టర్ పరశురాం తెలిపిన మేరకు గచి్చ»ౌలిలోని అసెన్షన్ ఐటీ కంపెనీలో పనిచేసే మిత్రులు కుంట్లూరుకు చెందిన భార్గవ్‌యాదవ్ (23), సైనిక్‌పురికి చెందిన వర్షిత్ (22), పటాన్‌చెరుకు చెందిన దినేశ్ (22), అల్వాల్‌కు చెందిన ప్రవీణ్ (30) నలుగురు ఒక కారులో, మరొక కారులో మరో నలుగురు కలిసి మొత్తం ఎనిమిది మంది శుక్రవారం సాయంత్రం 3 గంటల ప్రాంతంలో ఫౌహౌంస్కు చేరుకున్నారు. రాత్రి వరకు విందు చేసుకొని అర్థరాత్రి దాటిన తర్వాత కారులో బయటకు వచ్చి లక్ష్మీనారాయణ చెరువు తిలకించారు. తిరిగిఫాంహౌస్కు చేరుకునే క్రమంలో కిలోమీటర్‌కు ముందే రోడ్డు పక్కనున్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టారు. ఈ సంఘటనలో రెండు స్తంభాలు విరిగిపోయాయి. వెనక కూర్చున్న భార్గవ్, వర్షిత్ బెల్ట్ పెట్టుకోకపోవండతో కారు డోర్లు తెరుచుకొని రోడ్డుపై పడి అక్కడికక్కడే మృంతిచెందారు. కారులో ముందు భాగంలో ఎయిర్ బ్యాగులు తెరుచుకోవడంతో డ్రైవర్ సీటు పక్కన కూర్చున్న దినేశ్‌కు స్వల్పగాయాలయ్యాయి. డ్రైవర్ వైపు నుంచి స్తంభాన్ని ఢీకొట్టడంతో కారు నడుపుతున్న ప్రవీణ్‌కు తీవ్రగాయాలయ్యాయి. వీరు ప్రయాణిస్తున్న కారు వెనకాల మరో కారులో ఉన్న స్నేహితులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ జరిపి పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాలను గాంధీ ఆస్పత్రికి తరలించారు. గాయాలైన ప్రవీణ్‌ను ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అనుమతి లేకుడా మద్యం?కాగా ఫాంహౌస్‌లో యువకులు మద్యం సేవించారా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల ఫాంహౌస్‌లలో అనుమతి లేకుండానే మందు పార్టీలు జరుగుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. రోడ్డు ప్రమాదాలు∙జరిగి మరణాలు సంభవిస్తున్నా ఎక్సైజ్ అధికారుల్లో చలనం రావడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
ప్రేమలో భంగపడినా మరింత మనిషినవుతా..
హార్ట్ బ్రేకింగ్ వల్లగానీ, ప్రేమలో పడటం వల్లగానీ తనకేమి పెద్దగా బాధగా ఉండదని అంటున్నారు ప్రముఖ హాలీవుడ్ గాయకుడు శ్యామ్ స్మిత్. తను ఎంతగానో ఇష్టపడిన వ్యక్తులు తనను వదిలేసి గాయపరిచిన, ప్రేమలో భంగపడినా తనకు మరింత మానవత్వంతో ఆలోచించగలిగే శక్తి వస్తుందని చెప్తున్నారు. 'తప్పుల విషయంలో నేను నా ఆత్మతో చెప్తాను. నీకింకా 22 సంవత్సరాలు. నువ్విప్పుడు ఎంతమందితోనైనా ప్రేమలో పడగలవు. చివరికి హృదయాన్ని బద్దలుకొట్టుకుంటావు. అయితే, దానివల్ల నేనేమీ బాధపడను.. అలాగే జరిగితే నేను మంచి మనిషిగా మరింత ఆలోచిస్తానుగానీ పట్టించుకోను' అని అంటున్నారు. -
గుండెపోటుతో ఒక్కరోజే 12 మంది మృత్యువాత
సాక్షి నెట్వర్క్: రాష్ట్రం ముక్కలవుతుందనే భయంతో సీమాంధ్రజిల్లాల్లో మృత్యుఘంటికలు మోగుతూనే ఉన్నాయి. రాష్ట్ర విభజన నిర్ణయంతో మనస్తాపానికి గురై శనివారం ఒక్కరోజే 12 మంది గుండెపోటుతో మరణించారు. పశ్చిమగోదావరి జిల్లాలోనే ఆరుగురు మృత్యువాత పడ్డారు. నిడదవోలుకు చెందిన లారీ డ్రైవర్ బడుగు శంకరుడు (42), నరసాపురానికి చెందిన హోంనీడ్స్ ఏజెన్సీ యజమాని ప్రత్తి శ్రీనివాస్ (46), నరసాపురం మండలం దర్భరేవు గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీ యడ్ల నాగేశ్వరరావు (54)గుండె ఆగి చనిపోయారు. పెరవలి మండలం ముక్కామలకు చెందిన యాండ్ర రంగారావు (31), గోపాలపురానికి చెందిన డేవిడ్‌రాజు (53), ఉండి మండలం మహదేవపట్నానికి చెందిన జల్లి సహదేవుడు (35) గుండెపోటుతో మరణించారు. అదేవిధంగా కర్నూలు జిల్లా వెల్దుర్తి మండల పరిధిలోని రామళ్లకోట గ్రామానికి చెందిన ఏపూరి రమణ (41), రత్నపల్లెకు చెందిన నారాయణ (52), అనంతపురం జిల్లా నంబులపూలకుంటలో ఆర్ఎంపీ వైద్యుడు కృష్ణ (42), గుంటూరు జిల్లా తెనాలి పట్టణానికి చెందిన తూమాటి నాగయ్య (45), చిత్తూరు జిల్లా కలకడవుండలం ఎర్రకోటపల్లె గ్రావూనికి చెందిన ఎం.వెంక ట్రావుయ్యు(60), తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం కేశవదాసుపాలేనికి చెందిన బెల్లంకొండ సీతారత్నం(55) గుండెపోటుతో శనివారం మృత్యువాత పడ్డారు.