మార్గాని భరత్‌ను హౌస్‌ అరెస్ట్‌ చేసిన పోలీసులు | Margani Bharat Placed Under House Arrest in Rajahmundry | Sakshi
Sakshi News home page

మార్గాని భరత్‌ను హౌస్‌ అరెస్ట్‌ చేసిన పోలీసులు

Aug 11 2026 7:05 PM | Updated on Aug 11 2026 7:46 PM

Margani Bharat Placed Under House Arrest in Rajahmundry

రాజమండ్రి: వైఎస్సార్‌సీపీ నేత, మాజీ ఎంపీ మార్గాని భరత్‌ను పోలీసులు హౌస్‌ అరెస్ట్‌ చేశారు. మృతి చెందిన మెడికో ప్రియాంక కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలని మార్గాని భరత్‌ క్యాండిల్‌ ర్యాలీకి సిద్ధమయ్యారు. దీంతో భరత్‌ ఇంటి దగ్గర పోలీసులు భారీగా మోహరించారు.

ఈ కేసులో నిందితులను కాపాడే అదృశ్యశక్తులు ఉన్నాయా అంటూ మార్గాని భరత్‌ మంగళవారం మీడియా సమావేశంలో నిలదీసిన విషయం తెలిసిందే. ప్రియాంక కేసులో పోలీసులు వ్యవహరించిన తీరుపై అనుమానాలు ఉన్నాయని చెప్పారు. 

ఆ ఘటన మూడో తేదీన జరిగితే, ఆరో తేదీన నిందితులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు ప్రకటించారని తెలిపారు. అంత ఆలస్యం ఎందుకు అయ్యిందని, ఆ సమయంలో నిందితులు ఎక్కడ ఉన్నారని నిలదీశారు. వారిని ఎవరైనా దాచారా అని ప్రశ్నించారు. వారి వెనుక ఎవరు ఉన్నారో బయటపెట్టాలని డిమాండ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement