టీమిండియా ఓపెనర్ సంజూ శాంసన్‌కు మరో షాక్ తగలనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే జింబాబ్వే టూర్‌కు దూరమైన అతను.. ఏషియన్ గేమ్స్ జట్టులోనూ స్థానంలో కోల్పోనున్నట్లు క్రీడా వర్గాలు అంటున్నాయి. గత నెలలో భారత సెలెక్టర్లు 15 మంది సభ్యుల ఏషియన్ గేమ్స్ జట్టును ప్రకటించారు. ఈ జట్టులో సంజూ శాంసన్ కూడా ఉన్నాడు. ప్రస్తుతం ఈ జట్టు నుంచి కూడా సంజూను తప్పించాలని బీసీసీఐ యోచిస్తున్నట్లు సమాచారం.
యువ ఆటగాళ్లకు అవకాశాల పేరుతో సంజూ టీ20 కెరీర్‌కు ఫుల్‌స్టాప్ పెట్టాలని కొందరు బీసీసీఐ పెద్దలు యోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా వైభవ్ సూర్యవంశీ విషయంలో బీసీసీఐపై భారీ ఒత్తిడి ఉందని, అతడికి అవకాశాలు ఇవ్వడం కోసమే సంజూను శాశ్వతంగా తప్పించే ప్లాన్ జరుగుతుందని అతని అభిమానులు అనుకుంటున్నారు.
కాగా, ఐర్లాండ్ సిరీస్, ఆతర్వాత ఇంగ్లండ్‌తో జరిగిన తొలి రెండు టీ20ల్లో దారుణంగా విఫలమైన సంజూ శాంసన్‌ను జింబాబ్వే పర్యటనకు ఎంపిక చేయని విషయం తెలిసిందే. విశ్రాంతి పేరుతో సెలెక్టర్లు అతన్ని తప్పించారన్న ప్రచారం జరుగుతుంది.
ఈ సిరీస్‌కు సంజూ స్థానంలో యువ వికెట్‌కీపర్ బ్యాటర్ ప్రభ్‌సిమ్రన్ సింగ్‌కు అవకాశం కల్పించారు. ప్రస్తుత ఇంగ్లండ్ పర్యటన తర్వాత భారత జట్టు మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం జింబాబ్వే పర్యటనకు వెళ్లనుంది. ఏషియన్ గేమ్స్ విషయానికొస్తే.. ఈ ఖండాంతరం క్రీడలు సెప్టెంబర్ 19- అక్టోబర్ 4 మధ్యలో జరుగనున్నాయి.
జింబాబ్వే పర్యటనకు భారత జట్టు: శ్రేయస్ అయ్యర్ (సి), వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ (విసి), ఇషాన్ కిషన్ (డబ్ల్యుకె), శివమ్ దూబే, సూర్యాంశ్ షెడ్గే, రింకూ సింగ్, హర్ష్ దూబే, వరుణ్ చక్రవర్తి, ప్రిన్స్ యాదవ్, యశ్ ఠాకూర్, అశోక్ శర్మ, మయాంక్ యాదవ్, ప్రభ్‌సిమ్రన్ సింగ్ (విసి)
ఏషియన్ గేమ్స్‌కు భారత జట్టు: శ్రేయస్ అయ్యర్ (సి), తిలక్ వర్మ, రవి బిష్ణోయ్, అభిషేక్ శర్మ, నితీష్ కుమార్ రెడ్డి, జస్ప్రీత్ బుమ్రా, సంజు శాంసన్, అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, ఇషాన్ కిషన్, వాషింగ్టన్ సుందర్, అర్ష్దీప్ సింగ్, శివం దూబే, వరుణ్ చక్రవర్తి, వైభవ్ సూర్యవంశీ


