సింగీతం శ్రీనివాసరావు మృతి పట్ల వైఎస్‌ జగన్‌ సంతాపం | YS Jagan Expresses Grief Over the Demise of Veteran Director Singeetam Srinivasa Rao | Sakshi
Sakshi News home page

సింగీతం శ్రీనివాసరావు మృతి పట్ల వైఎస్‌ జగన్‌ సంతాపం

Oct 4 2026 8:24 AM | Updated on Oct 4 2026 8:27 AM

YS Jagan Expresses Grief Over the Demise of Veteran Director Singeetam Srinivasa Rao

సాక్షి,తాడేపల్లి : ప్రముఖ దర్శకుడు, లెజెండరీ ఫిలింమేకర్ సింగీతం శ్రీనివాసరావు మృతి పట్ల వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి తీవ్ర సంతాపం తెలిపారు. ఈ మేరకు వైఎస్‌ జగన్‌ ఒక ప్రకటన విడుదల చేశారు.  

‘దక్షిణ భారత సినీ రంగంలో సింగీతం శ్రీనివాసరావు తనదైన ప్రత్యేక ముద్ర వేశారు. దర్శకుడిగా, స్క్రీన్‌ప్లే రచయితగా, నిర్మాతగా, సంగీత దర్శకుడిగా, నటుడిగా ఆయన ప్రదర్శించిన బహుముఖ ప్రజ్ఞ చిరస్మరణీయం. ఎన్నో విభిన్నమైన, ప్రయోగాత్మక చిత్రాలతో భారతీయ సినిమా స్థాయిని మరింత ఉన్నతంగా నిలిపారు. మూస ధోరణులకు భిన్నంగా కొత్త కథలు, కొత్త సాంకేతికత, వినూత్నమైన ఆలోచనలతో తరతరాల సినీ ప్రేక్షకులను అలరించారు.

తెలుగు, తమిళం, కన్నడ, హిందీతో పాటు పలు భాషల్లో అనేక చిత్రాలకు దర్శకత్వం వహించి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడమే కాకుండా, ఎన్నో ప్రతిష్ఠాత్మక పురస్కారాలు అందుకున్నారు. 

94 ఏళ్ల వయసులోనూ సినిమాపై అదే అంకితభావంతో పనిచేయడం ఆయనలోని కళాతపనకు నిదర్శనం. సింగీతం శ్రీనివాసరావు మృతి భారతీయ చలనచిత్ర రంగానికి తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా’ అంటూ వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు. అలాగే ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులు, సినీ రంగానికి చెందిన ప్రముఖులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement