అదిరిందయ్యా చంద్రం… నీ లూటీ తంత్రం: వైఎస్‌ జగన్‌ | YSRCP Chief YS Jagan Lashes Out At Chandrababu Amaravati Corruption | Sakshi
Sakshi News home page

అదిరిందయ్యా చంద్రం… నీ లూటీ తంత్రం: వైఎస్‌ జగన్‌

Nov 28 2026 5:50 PM | Updated on Nov 28 2026 6:08 PM

YSRCP Chief YS Jagan Lashes Out At Chandrababu Amaravati Corruption

తాడేపల్లి :  అమరావతి పేరుతో చంద్రబాబు చేస్తున్న దోపిడీపై వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అదిరిందయ్యా చంద్రం.. అమరావతిలో నీ ‘కలెక్షన్‌ రేటు’, నీ “కరప్షన్‌ రేటు’’ అదిరిందయ్యా అంటూ వైఎస్‌ జగన్‌ ట్వీట్‌లో ధ్వజమెత్తారు.  

ఎస్‌ఎఫ్‌టీకి రూ. 30 వేలా? ఏంటి బాబూ.. బంగారంతో కడుతున్నావా? అంటూ నిలదీశారు.  దీనిలో భాగంగా అమరావతి పేరుతో చంద్రబాబు చేసే దోపిడీపై పలు ప్రశ్నలు సంధించారు వైఎస్‌ జగన్‌.  ఈ మేరకు అమరావతి పేరుతో చంద్రబాబు ఏ విధంగా దోపిడి చేస్తున్నారో వివరించారు వైఎస్‌ జగన్‌.

▪️2018లో కొత్త సచివాలయ భవనాల నిర్మాణ వ్యయం – రూ.2,271 కోట్లు.

▪️2024లో అధికారంలోకి రాగానే టెండర్ల రద్దు, భారీగా అవే బిల్డింగులకు అంచనాల పెంపు.
▪️2025 ఏప్రిల్‌లో మళ్లీ అవే కంపెనీలకు, అవే పనులు.
▪️ఈసారి కాంట్రాక్టు విలువ ఏకంగా రూ.4,689 కోట్లకు పెంపు.
▪️ఇప్పుడు మళ్లీ అవే పనులకు,  మళ్లీ అంచనాల పెంపు. మొత్తం విలువ రూ.6,641 కోట్లు.
▪️దీనికి అదనంగా అద్దాలు, ఏసీలు సహా ఇతర పనులకు మరో రూ.4,830 కోట్లు.
▪️ఇప్పటికి ఆ 5 భవనాలు, 52.20 లక్షల SFT నిర్మాణ వ్యయం – రూ.15,317 కోట్లు!

  • అంటే చంద్రబాబూ అమరావతిలో నీ స్పెషల్‌ రేటు.. SFTకి రూ.29,340 ఏంటి? ఏమైనా బంగారంతో కడుతున్నావా?

  • పైగా ఇసుక ఫ్రీ, కరెంటు ఛార్జీల్లో రాయితీలు, సీనరేజ్, NAC ఛార్జీల మినహాయింపు.

  • కడుతున్నది ఉద్యోగులు పనిచేసే భవనాలే కదా బాబూ?

  • బెంగళూరు, హైదరాబాద్‌, చెన్నై లాంటి మెట్రో నగరాల్లో సైతం ఫైవ్‌స్టార్‌ సదుపాయాలతో కూడా SFTకి రూ.5 వేలు మించి లేదు. 

  • మరి చంద్రబాబుగారూ… అమరావతిలో ఈ స్పెషల్‌ రేటు ఏంటి?

  • అంతర్జాతీయ స్థాయిలో నిర్మాణాలా? లేక ఇంటర్నేషనల్‌ స్థాయి అవినీతా?

  • ప్రజల నెత్తిన అప్పులు… మీ వాళ్లకు భారీ కాంట్రాక్టులు… మీకేమో ముడుపులు. ఇది అమరావతిలో జరుగుతున్న మాయ!

  • అదిరిందయ్యా చంద్రబాబూ… నీ లూటీ తంత్రం… 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement