సాక్షి, హైదరాబాద్: డీలిమిటేషన్ బిల్లుకు బీఆర్‌ఎస్ మద్దతు ఉంటుందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. దక్షిణాది రాష్ట్రాల పార్లమెంట్ ప్రాతినిధ్యం తగ్గకూడదని ఆయన అన్నారు. మహిళా రిజర్వేషన్ అమలుకు బీఆర్‌ఎస్ పూర్తి మద్దతు ఉంటుందని ప్రకటించారు. తెలంగాణకు ఎలాంటి అన్యాయం జరిగినా సహించేది లేదని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన తన X ఖాతాలో ట్వీట్ చేశారు.
పార్లమెంట్‌లో దక్షిణాది రాష్ట్రాలకు ప్రస్తుతం ఉన్న 24 శాతం ప్రాతినిధ్య వాటాను కాపాడాలని తాము నిరంతరం డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. ప్రతిపాదిత విధానం ప్రకారం పార్లమెంట్ స్థానాలను 50 శాతం పెంచడంతో పాటు, 2051 వరకు రాష్ట్రాల మధ్య ప్రాతినిధ్య నిష్పత్తిలో మార్పులు చేయకుండా రక్షణ కల్పించనున్నారని పేర్కొన్నారు.
Our stand on Delimitation has always been clear: No reduction in South India's parliamentary representation. No injustice to Telangana will be tolerated We have consistently demanded that the South's existing 24% share in parliament be protected. The proposed 50% increase in seats, with a safeguard against altering the inter-state representation ratio until 2051, addresses this key concern while increasing Telangana's Lok Sabha seats from 17 to 26. Keeping Telangana's interests paramount, our three Rajya Sabha MPs will vote in favour of the proposal. We have always supported women's reservation and remain committed to its implementation.
— KTR (@KTRBRS) November 28, 2026
ఈ ప్రతిపాదన అమలైతే తెలంగాణలో లోక్‌సభ స్థానాలు ప్రస్తుతం ఉన్న 17 నుంచి 26కు పెరుగుతాయని తెలిపారు. తెలంగాణ ప్రయోజనాలే తమకు అత్యంత ముఖ్యమని పేర్కొంటూ, ఈ ప్రతిపాదనకు అనుకూలంగా తమ ముగ్గురు రాజ్యసభ సభ్యులు ఓటు వేయనున్నట్లు వెల్లడించారు. మహిళా రిజర్వేషన్లకు తాము ఎప్పటి నుంచో మద్దతు ఇస్తున్నామని, వాటిని అమలు చేయడానికి కట్టుబడి ఉన్నామని కేటీఆర్ స్పష్టం చేశారు.


