‘ఇండియా’ కూటమికి స్టాలిన్ షాక్?! | DMK Hints at Supporting Centre Revised Delimitation Bill | Sakshi
Sakshi News home page

‘ఇండియా’ కూటమికి స్టాలిన్ షాక్?!

Nov 28 2026 11:35 AM | Updated on Nov 28 2026 11:42 AM

DMK Hints at Supporting Centre Revised Delimitation Bill

సాక్షి,చెన్నై: నవంబర్ 30న ప్రారంభం కానున్న ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలకు ముందు ప్రతిపక్ష ఇండియా కూటమికి డీఎంకే అధినేత ఎం.కె. స్టాలిన్‌ ఊహించని షాక్ ఇచ్చారు. డీలిమిటేషన్ (నియోజకవర్గాల పునర్విభజన) బిల్లుకు మద్దతు ఇవ్వాలని స్టాలిన్‌ నిర్ణయించుకున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. కేంద్ర ప్రభుత్వం తమ డిమాండ్లకు అంగీకరించడం వల్లే డీఎంకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు జాతీయ మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి.

ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టనున్న డీలిమిటేషన్ బిల్లు ముసాయిదాపై చర్చించేందుకు, శనివారం ఉదయం స్టాలిన్‌ తన పార్టీకి చెందిన 22 మంది లోక్‌సభ, 8మంది రాజ్యసభ ఎంపీలతో సమావేశమయ్యారు. ఈ భేటీలో బిల్లుకు మద్దతు పలికేలా పార్టీ వైఖరిని ఖరారు చేసినట్లు సమాచారం. అసెంబ్లీ ఎన్నికల వరకు ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉన్న డీఎంకే, ఇప్పుడు ఎన్డీయే ప్రభుత్వ ప్రతిపాదనకు మద్దతు ఇవ్వడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

కేంద్రం అంగీకరించిన డీఎంకే ప్రధాన డిమాండ్లు 
డీలిమిటేషన్ ప్రక్రియ వల్ల దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరగకుండా ఉండేందుకు డీఎంకే కేంద్రం ముందు రెండు ప్రధాన డిమాండ్లను ఉంచింది.వాటిని పరిష్కరిస్తామని కేంద్రం హామీ ఇచ్చినట్లు డీఎంకే నేతలు పేర్కొంటున్నారు. లోక్‌సభ స్థానాల్లో తమిళనాడుకు ప్రస్తుతం ఉన్న 7.18 శాతం వాటాను యథాతథంగా కాపాడాలి. రాష్ట్రాల సాపేక్ష ప్రాతినిధ్య నిష్పత్తిని 2051 వరకు (మరో 25 ఏళ్ల పాటు) మార్చకుండా స్తంభింపజేయాలి.

 ప్రస్తుతం ప్రతిపాదించిన సవరించిన ఫార్ములా ప్రకారం, రాష్ట్రాల మధ్య ఉన్న పార్లమెంటరీ ప్రాతినిధ్య పంపిణీ నిష్పత్తిని యథాతథంగా కొనసాగిస్తారు. అదే సమయంలో, దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో లోక్‌సభ, అసెంబ్లీ సీట్లను ఏకరీతిగా 50 శాతం మేర పెంచాలని ప్రతి పాదిస్తున్నారు.

ఇదీ చదవండి : ‘ఇండియా’ కూటమికి శరద్‌ పవార్ బిగ్ షాక్?!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement