తమిళనాడులోని తిరుపరంకుండ్రం దీపం వివాదం నేపథ్యంలో.. దీపత్తూన్‌పై కార్తీక దీపం వెలిగించాల్సిందేనని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసిన వేళ.. ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ఓ పోస్టు ఆసక్తికరంగా మారింది. ‘వెట్రివేల్ మురుగనుక్కు ఆరోగరా!’ (విజయం మురుగన్ స్వామికే) అంటూ భక్తి సందేశం ట్వీట్ చేశారు. అయితే, న్యాయపరమైన విచారణలు, ఆలయ వివాదం గురించి ఆయన నేరుగా ఎలాంటి ప్రస్తావన చేయలేదు.
కాగా, తిరుప్పరంకుండ్రం కొండపై కార్తీక దీపం వెలిగించే విషయంలో తమ ఆదేశాలను పాటించకపోవడంపై సుప్రీంకోర్టు నిన్న (శుక్రవారం) తమిళనాడుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఉద్దేశపూర్వకంగా తమ ఆదేశాలను ఉల్లంఘించారన్న సుప్రీంకోర్టు తమిళనాడు ప్రధాన కార్యదర్శి సహా పలువురు ఉన్నతాధికారులకు కోర్టు ధిక్కార నోటీసులు జారీ చేసింది. అంతేకాకుండా తిరుప్పరంకుండ్రంలోని అరుళ్మిగు సుబ్రమణ్యస్వామి దేవాలయ ట్రస్టు బోర్డును తాత్కాలికంగా సస్పెండ్ చేసింది.
Vetrivel Muruganukku Arogara! வெற்றிவேல் முருகனுக்கு அரோகரா! वेट्रिवेल मुरुगनुक्कु अरोगरा!
— Narendra Modi (@narendramodi) November 27, 2026
ప్రభుత్వ అధికారులు కోర్టు ఆదేశాలను కాకుండా రాజకీయ నేతల ఆదేశాల మేరకే నడుచుకున్నట్లు కనిపిస్తోందని వ్యాఖ్యానించింది. వివాదాస్పద దీపథూన్ రాతి స్తంభంపై శనివారం దీపం వెలిగించాలని, నవంబర్ 24న ఉచ్చిపిళ్లయ్యార్ మండపంలో వెలిగించిన జ్యోతితోనే కార్తీక దీపాన్ని వెలిగించాలని జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ విపుల్ ఎం. పంచోలిలతో కూడిన ధర్మాసనం ఆదేశించింది. విచారణ సందర్భంగా న్యాయమూర్తులు మాట్లాడుతూ కార్యనిర్వాహక వర్గం కోర్టు ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా అతిక్రమించడాన్ని విస్మరించలేమని స్పష్టం చేసింది.
అలాంటి చర్యలపై కఠిన వైఖరి తీసుకోవాల్సిందేనని స్పష్టం చేస్తూ... ప్రధాన కార్యదర్శిని వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశించింది. అలాగే అధికారుల మధ్య జరిగిన ఈమెయిల్ సంభాషణలు, ఫోన్‌కాల్స్, మెసేజీల వివరాలతో కూడిన అఫిడవిట్ సమర్పించాలని కోరింది. ప్రధాన కార్యదర్శితోపాటు డీజీపీ, హిందూ రిలీజియస్ అండ్ ఛారిటబుల్ ఎండౌమెంట్స్ శాఖ కార్యదర్శి, కమిషనర్, మదురై జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్, ఎస్పీ, దేవాలయ నిర్వాహకులు తదితరులకు ధిక్కార నోటీసులు జారీ చేసింది. తమ ఆదేశాలను అమలు చేయడంలో రాష్ట్ర పోలీసులు విఫలమయ్యారని పేర్కొంటూ అరుళి్మగు సుబ్రమణ్యస్వామి దేవాలయం, తిరుప్పరంకుండ్రం కొండ ప్రాంత భద్రతను సీఆర్‌పీఎఫ్‌కు అప్పగించింది.
దేవాలయ పరిపాలన నిర్వహణ కోసం రిటైర్డ్ న్యాయమూర్తులు ఎస్. వైద్యనాథన్, వి. పారి్థబన్‌లతో కూడిన ఇద్దరు సభ్యుల కమిటీని నియమించింది. వివాదాస్పద ప్రాంతంలోని దర్గా నుంచి కనీసం 50 మీటర్ల దూరంలో భక్తులు ఎవరైనా దీపాలు వెలిగించుకోవచ్చని కోర్టు స్పష్టం చేసింది. అదే సమయంలో దర్గాకు వచ్చే భక్తుల ప్రార్థనలకు ఎటువంటి ఆటంకం కలగకుండా చూడాలని, దర్గా భద్రతను సీఆర్‌పీఎఫ్ పర్యవేక్షించాలని ఆదేశించింది.
ఇదీ చదవండి: షేక్ హసీనా సంచలన ప్లాన్!


