‘స్నేక్‌ గ్యాంగ్‌’ దోషులకు సుప్రీంలో బెయిల్‌... | Snake Gang Case Supreme Court Interim Bail | Sakshi
Sakshi News home page

‘స్నేక్‌ గ్యాంగ్‌’ దోషులకు సుప్రీంలో బెయిల్‌...

Nov 28 2026 10:13 AM | Updated on Nov 28 2026 10:20 AM

Snake Gang Case Supreme Court Interim Bail

యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్న ఫైసల్‌ దయ్యాని, తయ్యబ్‌ బసలామా, ఖాదర్‌ బరక్బాలకు ఊరట

సాక్షి, న్యూఢిల్లీ: హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన ‘స్నేక్‌ గ్యాంగ్‌’ కేసులో యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్న దోషులకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. అప్పీళ్లపై తుది విచారణ పెండింగ్‌లో ఉన్నంతకాలం శిక్షను నిలిపివేస్తూ మధ్యంతర బెయిల్‌ మంజూరు చేయడానికి అత్యున్నత న్యాయస్థానం అంగీకరించింది. ఈ కేసులో దోషులుగా ఉన్న తయ్యబ్‌ బసలామా, ఖాదర్‌ బరక్బా, ఫైసల్‌ దయ్యాని దాఖలు చేసిన పిటిషన్లపై జస్టిస్‌ సతీష్‌ చంద్ర శర్మ, జస్టిస్‌ ఎన్‌. కోటీశ్వర్‌ సింగ్‌లతో కూడిన ధర్మాసనం గురు, శుక్రవారాల్లో విచారణ జరిపి కీలక ఉత్తర్వులు వెలువరించింది.

అనారోగ్యం, సుదీర్ఘ జైలు శిక్షపై వాదనలు 
గురువారం మౌఖిక ప్రస్తావన మేరకు శుక్రవారం విచారణకు వచ్చిన ఫైసల్‌ దయ్యాని, తయ్యబ్‌ బసలామా పిటిషన్లపై ఇరుపక్షాల న్యాయవాదులు వాదనలు వినిపించారు. పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదిస్తూ.. దోషి ఇప్పటికే 12 ఏళ్ల 3 నెలల 6 రోజుల పాటు జైలు శిక్ష అనుభవించారని ధర్మాసనం దృష్టికి తెచ్చారు.

అంతేకాకుండా ఆయన శ్వాసకోశ సమస్య, ఆర్థరైటిస్, నడుము నొప్పి వంటి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని, దీనికి సంబంధించిన వైద్య ధ్రువీకరణ పత్రాలు కూడా కోర్టు రికార్డులో ఉన్నాయని పేర్కొన్నారు. ఈ కేసులో ఆయన నిర్దోíÙగా విడుదలయ్యేందుకు పూర్తి అవకాశాలు ఉన్నాయని, అప్పీల్‌ తుది విచారణకు సమయం పట్టే అవకాశం ఉన్నందున శిక్షను నిలిపివేసి బెయిల్‌ మంజూరు చేయాలని కోరారు.

మరోవైపు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాదులు ఈ బెయిల్‌ అభ్యర్థనను తీవ్రంగా వ్యతిరేకించారు. నేరం తీవ్రతను దృష్టిలో ఉంచుకుని బెయిల్‌ ఇవ్వవద్దని, శిక్షను నిలిపివేయవద్దని కోరారు. ఇరుపక్షాల వాదనలు విన్న జస్టిస్‌ సతీష్‌ చంద్ర శర్మ, జస్టిస్‌ ఎన్‌. కోటీశ్వర్‌ సింగ్‌ ధర్మాసనం.. ఈ ఘటన తనకు తెలుసని, ఇందులో అత్యాచారం అభియోగం లేదని వ్యాఖ్యానించింది. కేసు రికార్డులను పరిశీలించిన అనంతరం పిటిషనర్‌ ఇప్పటికే సుదీర్ఘకాలంగా జైలులో ఉన్న అంశాన్ని పరిగణనలోకి తీసుకుని శిక్ష నిలిపివేత పిటిషన్‌ను అనుమతిస్తున్నట్లు స్పష్టం చేసింది.

ట్రయల్‌ కోర్టు విధించే షరతులకు లోబడి పిటిషనర్‌ను బెయిల్‌పై విడుదల చేయాలని ఆదేశించింది. ఇదే కేసులో మరో సహ దోషి తరఫు న్యాయవాది స్పందిస్తూ.. తమ శిక్ష నిలిపివేత పిటిషన్‌ కూడా 2025 జూలై 18 నుంచి పెండింగ్‌లో ఉందని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. దీనిపై స్పందించిన ధర్మాసనం.. దరఖాస్తు చేసుకుంటే మెన్షనింగ్‌ జాబితాలోకి వస్తుందని తెలిపింది.

ఖాదర్‌ బరక్బాకు గురువారమే మధ్యంతర బెయిల్‌
గురువారం ఇదే కేసులో మరో దోషి ఖాదర్‌ బరక్బా దాఖలు బెయిల్‌ పిటిషన్‌పై ఇదే ధర్మాసనం విచారణ జరిపింది. ఖాదర్‌ బరక్బా 12 ఏళ్లుగా జైలులోనే ఉన్నారని, అప్పీల్‌ తుది విచారణ పూర్తి కావడానికి సమయం పడుతుందని ఆయన తరఫు న్యాయవాది వాదించారు. తెలంగాణ ప్రభుత్వ న్యాయవాదులు బెయిల్‌ మంజూరును వ్యతిరేకించినప్పటికీ సుదీర్ఘ జైలు శిక్షను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం ట్రయల్‌ కోర్టు షరతులకు లోబడి బరక్బాకు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది.

ఇదీ చదవండి: దీపం వివాదం.. ప్రధాని మోదీ ఆసక్తికర పోస్ట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement