భూతాపంతో మారిపోతున్న పూల పరిమళాలు.. | Global Warming Impact On Flower Fragrance | Sakshi
Sakshi News home page

భూతాపంతో మారిపోతున్న పూల పరిమళాలు..

Nov 28 2026 9:58 AM | Updated on Nov 28 2026 9:58 AM

Global Warming Impact On Flower Fragrance

పర్యావరణంలో ఏర్పడిన అసమతుల్యత పిచ్చుక మనుగడను ప్రశ్నార్థకం చేసింది. భూతాపం మితిమీరడం ఇప్పుడు పూల మీద ప్రభావం చూపిస్తోంది. పూల వాసనల్లో తేడాలు వస్తున్నాయి. పరపరాగ సంపర్కం జరగడానికి విడుదల కావాల్సిన సంకేతాలు శృతి తప్పుతున్నాయి. అడవిలో గాలి ఒక విచిత్రమైన సువాసనలతో నిండి ఉంటుంది. శాస్త్రవేత్తలు దీనిని భాష్పశీల సేంద్రియ సమ్మేళనాలుగా (వోలటైల్‌ ఆర్గానిక్‌ కాంపౌండ్స్‌) చెబుతారు.

మొక్కలు, పూలు విడుదల చేసే ఈ రసాయన సమ్మేళనాలే ప్రకృతికి ప్రత్యేకమైన పరిమళాన్నిస్తాయి. ఇప్పుడు గ్లోబల్‌ వారి్మంగ్‌ ఈ సమతుల్యతకు విఘాతం కలిగిస్తోంది. వేడెక్కుతున్న భూమి, వాతావరణంలో మార్పులు ఈ సువాసనల స్వరూపాన్ని మార్చేస్తున్నాయి. దీంతో ఈ సువాసనల మీద ఆధారపడి నడుస్తున్న జీవావరణ వ్యవస్థ ఒడిదొడుకులకు లోనవుతోంది.

పరాగసంపర్కం! 
పూలు విడుదల చేసే సువాసనలు తేనెటీగలు, సీతాకోకచిలుకలు వంటి కీటకాలను ఆకర్షిస్తాయి. తద్వారా పరాగసంపర్కం జరిగి, మొక్కల ప్రత్యుత్పత్తి, ఆహార పంటల దిగుబడికి దోహదం చేస్తుంది.

వాసన ఒక రక్షణ కవచం! 
ఏదైనా కీటకం లేదా శత్రువు మొక్కలపై దాడి చేసినప్పుడు, మొక్కలు ప్రత్యేకమైన రసాయన వాసనలను విడుదల చేసి ఇతర మొక్కలను అప్రమత్తం చేస్తాయి. ఈ వాసన వాటికి ఒక సమాచార వ్యవస్థ. వాసన అందగానే ఆ కీటకాలను తినే పెద్ద కీటకాలు, పక్షులు వచ్చి చేరతాయి.

వాతావరణ మార్పుల ప్రభావం!
ఉష్ణోగ్రతలు పెరగడం, కరువు పరిస్థితులు ఏర్పడటం, వాతావరణంలో కాలుష్యం పెరగడం వల్ల ఈ సువాసనల విడుదల చక్రం అస్తవ్యస్తమవుతోంది.

  • మొక్కలు అధిక వేడికి గురవడం వల్ల అవి విడుదల చేసే సువాసనల పరిమాణం, నాణ్యతలో మార్పు వస్తోంది. అవి విడుదల చేసే భాష్పశీల సేంద్రియ సమ్మేళనాల పరిమాణం, వాటి రసాయన కూర్పు మారిపోతున్నాయి. కొన్ని పూలు తమ సహజ సువాసనను కోల్పోతుండగా, మరికొన్ని భిన్నమైన వాసనలను విడుదల చేస్తున్నాయి.

  • వాతావరణంలో పెరిగిన కాలుష్య కారకాలు, అధిక ఉష్ణోగ్రతల వల్ల పూల నుంచి వెలువడే సువాసన అణువులు గాలిలో ఎక్కువ దూరం ప్రయాణించకముందే విచ్ఛిన్నమైపోతున్నాయి అంటే పూల పరిమళం ఆ మొక్క నుంచి ప్రయాణం మొదలుపెట్టి మరో మొక్కకు చేరకముందే గాలిలోనే నశిస్తోంది.

పర్యావరణంపై చూపించే పరిణామాలు! 
మొదట చెప్పుకున్నట్లు సువాసన ఒక సమాచార వ్యవస్థ. ప్రకృతిలో ఈ ‘వాసనల భాష’మారిపోవడం వల్ల పర్యావరణ సమతుల్యతకు మరో కొత్త సవాల్‌ ఎదురవుతోంది.

  • పూల సువాసనలను పసిగట్టి వాటి వద్దకు చేరుకునే తేనెటీగలు, ఇతర పరాగసంపర్క కీటకాలు, మారిన వాసనల వల్ల పూలను కచ్చితంగా గుర్తించలేక దారి తప్పుతాయి.

  • కీటకాలు పూలను సరిగ్గా గుర్తించలేకపోతే పరాగసంపర్కం తగ్గిపోతుంది. ఇది అడవుల విస్తరణపైనే కాకుండా, మనం తినే పండ్లు, కూరగాయలు, ఆహార ధాన్యాల ఉత్పత్తిపై కూడా తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఇది ఆహార భద్రతకు మరో సవాల్‌.

భూతాపం కేవలం ఉష్ణోగ్రతలను పెంచడమే కాకుండా, ప్రకృతిలోని జీవరాశులు ఒకదానితో ఒకటి మౌనంగా సంభాíÙంచుకునే ‘సువాసనల వారధి’ని కూడా కూల్చివేస్తోంది.
- సాక్షి స్పెషల్‌ డెస్క్‌

ఇదీ చదవండి: అమ్మా, ఇది వద్దు.. నాకు ఇష్టంలేదు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement