కశ్మీర్‌లో పెరిగిన చలి తీవ్రత | Kashmir recorded its coldest night of the season as the minimum temperature dropped | Sakshi
Sakshi News home page

కశ్మీర్‌లో పెరిగిన చలి తీవ్రత

Nov 25 2026 1:30 AM | Updated on Nov 25 2026 1:30 AM

Kashmir recorded its coldest night of the season as the minimum temperature dropped

సీజన్‌లోనే అత్యంత చలి రాత్రి నమోదు 

శ్రీనగర్‌: కశ్మీర్‌ లోయలో చలి తీవ్రత పెరిగింది. సోమవారం రాత్రి ఈ సీజన్‌లోనే అత్యంత చలి నమోదైంది. మంగళవారం ఉదయం లోయలోని అనేక ప్రాంతాలను పొగమంచు కమ్మేసింది. ఉష్ణోగ్రత మైనస్‌ 1.6 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయింది. అంతకుముందు రోజు నమోదైన మైనస్‌ 0.4 డిగ్రీల సెల్సియస్‌ని రికార్డును అధిగమించింది. ఈ సీజన్‌ సాధారణ ఉష్ణోగ్రత కంటే దాదాపు 1.3 నుంచి 1.7 డిగ్రీలు తక్కువగా ఉంది.

 ప్రముఖ పర్యాటక ప్రాంతమైన పహల్గామ్‌లో మైనస్‌ 4.6 డిగ్రీల సెల్సియస్‌ నమోదైంది. ఇది ఈ సీజన్‌లోనే అత్యంత తక్కువ ఉష్ణోగ్రత. దక్షిణ కశ్మీర్‌లోకి ప్రవేశించే ద్వారంగా పిలిచే ఖాజీగుండ్‌లో మైనస్‌ 2 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదైంది. దక్షిణ కశ్మీర్‌లోని షోపియాన్‌లో మైనస్‌ 4.1 డిగ్రీల సెల్సియస్‌ నమోదైంది.

ఉత్తర కశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలో ఉన్న ప్రసిద్ధ స్కీ–రిసార్ట్‌ గుల్మార్గ్‌ వద్ద 0.2 డిగ్రీల సెల్సియస్, కుప్వారాలో మైనస్‌ 1 డిగ్రీ సెల్సియస్, కోకెర్నాగ్‌లో మైనస్‌ 0.1 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ నెల చివరి వరకు లోయలో వాతావరణం ప్రధానంగా పొడిగా ఉంటుందని, రాత్రి ఉష్ణోగ్రతలు మరింత తగ్గే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement