పోలవరం జిల్లాకు తుఫాను ముప్పు.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి! | Cyclone Akwan Weather Alert | Sakshi
Sakshi News home page

పోలవరం జిల్లాకు తుఫాను ముప్పు.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి!

Nov 16 2026 11:01 PM | Updated on Nov 16 2026 11:01 PM

Cyclone Akwan Weather Alert

బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుఫానుగా బలపడింది. దీనికి 'అక్వాన్‌'గా నామకరణం చేశారు. ప్రస్తుతం గంటకు 10 కిలోమీటర్ల వేగంతో కదులుతున్న ఈ తుఫాను.. రానున్న రోజుల్లో అతి తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ తెలిపారు.

అయితే, ఈ సందర్భంగా పోలవరం జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ కే. దినేష్‌ కుమార్‌ సూచించారు. అక్వాన్‌ తుఫాను ప్రభావంతో నవంబర్‌ 17 నుంచి 20 వరకు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయవద్దని, వర్షాల సమయంలో పొంగిపొర్లే వాగులు, వంకలు, కాజ్వేలు దాటేందుకు ప్రయత్నించవద్దని కలెక్టర్‌ హెచ్చరించారు. ముఖ్యంగా గోదావరి, శబరి, సీలేరు నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.

అలాగే, తుఫాను ముందస్తు చర్యల్లో భాగంగా జిల్లా, డివిజన్‌, మండల స్థాయిలో 24 గంటల కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అత్యవసర సహాయం కోసం టోల్‌ ఫ్రీ నంబర్‌ 1800-425-4225ను సంప్రదించాలని కలెక్టర్‌ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

ఇదీ చదవండి: మున్సిపాలిటీ, కార్పొరేషన్లకు వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల ప్రకటన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement