గిరిబాబు మృతిపై ఆయన కుటుంబ సభ్యులకు వైఎస్ జగన్ పరామర్శ | YS Jagan condoles with Giribabus family members over his death | Sakshi
Sakshi News home page

గిరిబాబు మృతిపై ఆయన కుటుంబ సభ్యులకు వైఎస్ జగన్ పరామర్శ

Nov 16 2026 7:41 PM | Updated on Nov 16 2026 7:41 PM

YS Jagan condoles with Giribabus family members over his death

ప్రకాశం జిల్లా:  సీనియర్ నటుడు గిరిబాబు (80) మృతిపై ఆయన కుటుంబ సభ్యులను వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పరామర్శించారు. గిరిబాబు తనయుడు రఘుబాబుతో వైఎస్‌ జగన్‌ ఫోనులో మాట్లాడారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

కాగా, గిరిబాబు ఈ నెల 14న (శనివారం) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న గిరిబాబు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన అసలు పేరు యెర్రా శేషగిరిరావు. గిరిబాబు 1946 జూన్ 8న ప్రకాశం జిల్లా రావినూతల గ్రామంలో జన్మించారు.

గిరిబాబు అంత్యక్రియలు ఈ నెల 15న (ఆదివారం) ముగిశాయి. ఆయన స్వగ్రామం రావినూతలలో అభిమానుల అశ్రునయనాల మధ్య ఆయనకు వీడ్కోలు పలికారు. టాలీవుడ్ ప్రముఖులతో పాటు అభిమానులు పెద్దఎత్తున హాజరై ఆయన భౌతికకాయానికి నివాళులర్పించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement