బంగాళాఖాతంలో 'అక్వాన్' తుపాను | Cyclone Akwan: Expected to intensify At Bay of Bengal severe storm warning to AP | Sakshi
Sakshi News home page

బంగాళాఖాతంలో 'అక్వాన్' తుపాను

Nov 16 2026 9:13 PM | Updated on Nov 16 2026 9:16 PM

Cyclone Akwan: Expected to intensify At Bay of Bengal severe storm warning to AP

సాక్షి, విశాఖపట్నం: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుపానుగా బలపడింది. దీనికి ఇప్పటికే 'అక్వాన్'గా నామకరణం చేశారు. ప్రస్తుతం గంటకు 10 కిలోమీటర్ల వేగంతో కదులుతున్న ఈ తుపాను రేపు సాయంత్రానికి తీవ్ర తుపానుగా, గురువారం ఉదయానికి అతి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు.

అయితే ఈ తుపాను శుక్రవారం మధ్యాహ్నానికి నెల్లూరు–తుని మధ్య తీరం దాటే అవకాశం ఉందని వెల్లడించారు. తీరం దాటే సమయంలో గంటకు 120-130 కిలోమీటర్ల వేగంతో, గరిష్ఠంగా 145 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందన్నారు. తుపాను ప్రభావంతో గురు, శుక్రవారాల్లో కోస్తాంధ్రలో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని తెలిపారు.

మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని హెచ్చరించారు. తీర ప్రాంత ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అత్యవసర సహాయం కోసం 112, 1070, 18004250101 నంబర్లను సంప్రదించాలని, సమస్యల పరిష్కారం కోసం 'మన మిత్ర' వాట్సాప్ నంబర్ 9552300009కు సమాచారం అందించాలని కోరారు.

ఇదీ చదవండి: సీట్ల సర్దుబాటు చర్చలకు ప్రియాంక గాంధీ నాయకత్వం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement