ఉత్తరాంధ్రకు తుపాన్‌ ముప్పు.. అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక! | Cyclone Heavy Rains North Andhra | Sakshi
Sakshi News home page

ఉత్తరాంధ్రకు తుపాన్‌ ముప్పు.. అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక!

Nov 20 2026 6:14 AM | Updated on Nov 20 2026 6:14 AM

Cyclone Heavy Rains North Andhra

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర తుపాన్‌ అక్వాన్‌ తీరం దాటే ప్రక్రియ ప్రారంభమైంది. తుపాన్‌ బాహ్య వలయం ఇప్పటికే ఉత్తరాంధ్ర–దక్షిణ ఒడిశా తీరాలను తాకింది. అయితే, ఇది గంటకు 21 కిలోమీటర్ల వేగంతో కదులుతూ ఉదయానికి ఒడిశాలోని గోపాల్‌పూర్‌ సమీపంలో పూర్తిగా తీరం దాటనుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.

ప్రస్తుతం తుపాన్‌ కళింగపట్నానికి 110 కిలోమీటర్లు, విశాఖపట్నానికి 170 కిలోమీటర్లు, గోపాల్‌పూర్‌కు 170 కిలోమీటర్లు, పూరీకి 250 కిలోమీటర్లు, నరసాపురానికి 370 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. దీంతో ఉత్తరాంధ్ర తీర ప్రాంతాల్లో వాతావరణ పరిస్థితులు మారుతున్నాయి.

తుపాన్‌ ప్రభావంతో నేడు శ్రీకాకుళం జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే ఉత్తరాంధ్రలోని ఇతర జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

ఇప్పటికే శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్ఛాపురం, కవిటి, సోంపేట, కంచిలి, మందస, పలాస, వజ్రపుకొత్తూరు మండలాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఇచ్ఛాపురంలో అత్యధికంగా 16 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కంచిలి, కవిటిలో 10 సెంటీమీటర్లు, పలాసలో 9.9 సెంటీమీటర్లు, సోంపేటలో 9.2 సెంటీమీటర్లు, వజ్రపుకొత్తూరులో 4.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.

ఈ నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీఎస్‌డీఎంఏ ఎండీ, ఆర్టీజీఎస్‌ సీఈవో ప్రఖర్‌ జైన్‌ సూచించారు. తుపాన్‌ ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అవసరమైతేనే బయటకు రావాలని, అధికారుల సూచనలు పాటించాలని హెచ్చరించారు.

ఇదీ చదవండి: ఒడిశా వైపు ‘ఆక్వాన్‌’ తుపాను

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement