మాట్లాడుతున్న టీడీపీ కార్యకర్త కుళ్లాయప్ప
నిజం ఒప్పుకున్న టీడీపీ కార్యకర్త
శింగనమల: ‘పోలింగ్ రోజు రిగ్గింగ్ చేసి గెలిచాం. ఈ విషయం పేపర్లు, టీవీల్లో కూడా వచ్చింది. అయినా ఎంపీపీ పదవి ఇవ్వడం లేదు’ అంటూ అనంతపురం జిల్లా శింగనమల మండలం ఈస్ట్ నరసాపురం గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త కుళ్లాయప్ప చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. శింగనమల మండలం సోదనపల్లి ఎంపీటీసీ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా గెలుపొందిన తులసి ఎంపీపీ పదవిని ఆశించారు.
అయితే ఆమెను కాకుండా వేరొకరిని ఎంపీపీ అభ్యర్థిగా ప్రకటించడంతో గురువారం అనంతపురంలోని శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద తులసి మద్దతుదారులు ధర్నా నిర్వహించారు. అక్కడికి వచ్చిన టీడీపీ కార్యకర్త కుళ్లాయప్ప మాట్లాడుతూ పోలింగ్ రోజున రిగ్గింగ్ చేసి మరీ గెలిచామని, అయినా ఎంపీపీ పదవి రాలేదని అన్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో ఇప్పటికైనా అసలు నిజాన్ని ఒప్పుకున్నారంటూ ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు.


