హసీనా రాకపై బంగ్లాదేశ్ వైఖరి మార్పు | Bangladesh Changing Goalposts On Hasina | Sakshi
Sakshi News home page

హసీనా రాకపై బంగ్లాదేశ్ వైఖరి మార్పు

Nov 24 2026 9:39 PM | Updated on Nov 24 2026 9:47 PM

Bangladesh Changing Goalposts On Hasina

సాక్షి, న్యూఢిల్లీ: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా డిసెంబర్ 16న స్వదేశానికి తిరిగి వస్తానని ప్రకటించడంతో ఆ దేశ రాజకీయాల్లో కలకలం రేగింది. అయితే ఆమె స్వచ్ఛందంగా రావడం కుదరదని, భారత్ ఆమెను అప్పగించాల్సిందేనని బంగ్లాదేశ్ ప్రభుత్వం స్పష్టం చేసింది.

2024 ఆగస్టులో నిరసనల నేపథ్యంలో దేశం విడిచిన హసీనా భారత్‌లో ఆశ్రయం పొందుతున్న విషయం తెలిసిందే. గతంలో ఆమెను తిరిగి పంపాలని భారత్‌ను కోరిన బంగ్లాదేశ్ ప్రభుత్వం ఇప్పుడు అప్పగింత ప్రక్రియ ద్వారానే ఆమె రావాలని చెబుతోంది.

డిసెంబర్ 16 బంగ్లాదేశ్ విముక్తి దినోత్సవం కావడంతో అదే రోజున తిరిగి వస్తానని హసీనా ప్రకటించడంతో ఈ విషయంపై రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది. ఆమె రాకతో నిషేధిత అవామీ లీగ్ మళ్లీ రాజకీయంగా క్రియాశీలంకం కావచ్చని అంచనాలు ఉన్నాయి.

ఇక మరోవైపు, బంగ్లాదేశ్‌లో అల్లర్లు, రాజకీయ ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. అయితే ప్రస్తుతం భారత్‌పై పలు ఆరోపణలు చేస్తూ నాహిద్ ఇస్లాం విమర్శలు చేయడంతో ఇరు దేశాల మధ్య హసీనా అంశం మరింత కీలకంగా మారింది.

ఇదీ చదవండి: విజయ్‌ ప్రభుత్వానికి మద్రాస్ హైకోర్టు సూచన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement