breaking news
Fragrance
-
పెర్ఫ్యూమ్ బ్రాండ్లకు నిధుల పరిమళం
సాక్షి, బిజినెస్ డెస్క్: కొంతకాలంగా దేశీ ఫ్రాగ్రెన్స్ మార్కెట్‌పై ఇన్వెస్టర్లలో ఆసక్తి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో కొత్త తరం లగ్జరీ పెర్ఫ్యూమ్ బ్రాండ్లు పెద్ద ఎత్తున నిధులను సమీకరిస్తున్నాయి. న్యూఢిల్లీకి చెందిన ఫ్రాగానోట్స్ గతేడాది ఆగస్టులో రుకమ్ క్యాపిటల్ నుంచి ప్రీ–సిరీస్ ఫండింగ్ కింద 1 మిలియన్ డాలర్లు సమీకరించింది. అటు బెంగళూరు కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న హిరా ఫ్రాగ్రెన్సెస్ మాతృ సంస్థ మియోలా గతేడాది అక్టోబర్‌లో ప్రీ–సిరీస్ ఎ రౌండ్ కింద 6 మిలియన్ డాలర్లను సమకూర్చుకుంది. ఇక ఇండోర్‌కి చెందిన హౌస్ ఆఫ్ ఈఎం5 సంస్థ బోట్ సహవ్యవస్థాపకుడు అన్ గుప్తా నుంచి నిధులు సేకరించింది. ఇప్పటివరకు రూ. 5–6 కోట్లు ఇన్వెస్ట్ చేసింది. మరోవైపు, గుజరాత్‌కి చెందిన అదిల్ ఖాద్రి బ్రాండ్.. షార్క్ ట్యాంక్ ఇండియా షోలో రూ. 50 లక్షల ఫండింగ్ దక్కించుకుంది. 2023లో ఏర్పాటైన గుడ్మెల్ట్స్ అనే బ్రాండ్ కూడా ఆనికట్ క్యాపిట్ల నుంచి ప్రీ–సీడ్ ఫండింగ్‌ని సమకూర్చుకుంది. భారీగా కార్యకలాపాల విస్తరణ.. శశాంక్ చౌరీ ప్రారంభించిన హౌస్ ఆఫ్ ఈఎం5 తొలి ఏడాదిలో (2022–23) కేవలం 900 ఆన్లైన్ ఆర్డర్లను ప్రాసెస్ చేసింది. ప్రస్తుతం రోజుకు 2,000 ఆర్డర్లు, నెలకు దాదాపు 80,000 పైగా బాటిల్స్‌ని విక్రయిస్తోంది. కంపెనీ కస్టమర్లలో అత్యధిక శాతం వాటా 28–45 ఏళ్ల వారిదే ఉంటోంది. గత మూడేళ్లలో హౌస్ ఆఫ్ ఈఎం5 సుమారు రూ. 200 కోట్ల టర్నోవరు సాధించింది. వచ్చే మూడేళ్లలో రూ. 500 కోట్లు లక్ష్యంగా పెట్టుకుంది. అటు ఆఫ్‌లైన్‌లో కూడా కార్యకలాపాలను విస్తరించే ప్రణాళికల్లో ఉంది. ఆ తర్వాత అమెజాన్ ఫస్ట్ ద్వారా గ్లోబల్‌గా కూడా అవకాశాలను అందిపుచ్చుకోవాలని భావిస్తోంది. తమ కంపెనీ లాభాల్లోనే కొనసాగుతోందని, ఇన్వెస్టర్లు ఆసక్తిగానే ఉన్నా, ప్రస్తుతం మరిన్ని నిధులు సమీకరించాల్సిన తక్షణ అవసరమేమీ లేదని శశాంక్ తెలిపారు. మరోవైపు, 2018లో ప్రారంభమైన ఆదిల్ ఖాద్రి ప్రీమియం సెగ్మెంట్‌పై ప్రధానంగా దృష్టి పెడుతోంది. ప్రస్తుతం ప్రతి నెలా రూ. 11–12 కోట్ల ఆదాయం ఆర్జిస్తోంది. థర్డ్ పార్టీ తయారీ సంస్థ భాగస్వామ్యంతో నాలుగైదు నెలలకు సరిపడ నిల్వలను ఉత్పత్తి చేసి పెట్టుకుంటోంది. అంతర్గతంగా నిధులతోనే విస్తరణ చేపడుతోంది. హైదరాబాద్‌తో పాటు ముంబై, లక్నో, జైపూర్, సూరత్, అహ్మదాబాద్ తదితర నగరాల్లో దాదాపు 50 స్టోర్స్ నిర్వహిస్తోంది. వచ్చే రెండున్నర–మూడేళ్లలో స్టోర్స్ సంఖ్యను 111కి పెంచుకునే యోచనలో ఉంది. 2 బిలియన డాలర్ల మార్కెట్.. దేశీఫ్రాగ్రెన్స్ మార్కెట్ పరిమాణం ప్రస్తుతం సుమారు 2 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉంటుందని మోతీలాల్ ఓస్వాల్ ఓ నివేదికలో తెలిపింది. ఇది 2030 నాటికి 4.08 బిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా వేసింది. ఈ నేపథ్యంలో పెర్ఫ్యూమ్ బ్రాండ్లు అవకాశాలను అందిపుచ్చుకోవడంపై మరింతగా దృష్టి పెడుతున్నాయి. 2022లో గరిమా కక్కర్ ప్రారంభించిన ఫ్రాగానోట్ వచ్చే రెండేళ్లలో మెట్రోల్లో ఆఫ్‌లైన్ కార్యకలాపాలను మరింత పటిష్టం చేసుకునే ప్రయత్నాల్లో ఉంది. అలాగే వారణాసి, సోలన్లాంటి ప్రాంతాల్లోనూ విస్తరిస్తోంది. అటు అంతర్జాతీయ మార్కెట్లపైనా దృష్టి పెడుతోంది. ప్రధానంగా వచ్చే మూడేళ్లలో ప్రీమియం అఫోర్డబుల్ సెగ్మెంట్లో స్థానాన్ని బలోపేతం చేసుకోవాలని భావిస్తోంది. అటు హీరా ఫ్రాగ్రెన్సెస్ మాతృ సంస్థ మియోలా కూడా వచ్చే 12–18 నెలల్లో కార్యకలాపాలను విస్తరించే యోచనలో ఉంది. ఇటీవలే సమీకరించిన నిధుల్లో నుంచి సుమారు 2–2.2 మిలియన్ డాలర్లను ఇందుకోసం వెచి్చంచనున్నట్లు సంస్థ తెలిపింది. -
మట్టి పరిమళం: ఈ పెర్ఫ్యూమ్తో.. బయట వర్షం పడుతుందేమో అనే అనుభూతి..
వేడి, పొడి వాతావరణంలో ఒక్కసారిగా కురిసే చినుకులతో భూమి నుండి వెలువడే ఆహ్లాదకరమైన సువాసన మనసును సేదతీరుస్తుంది. ఇది మట్టి వెదజల్లే సహజ పరిమళం కావడంతో మన మనసుల్ని సంతోష సాగరంలో విహరింపజేస్తుంది. తొలకరి చినుకులు నేలను తాకినప్పుడు వచ్చే ఈ మట్టి సువాసనను ఆస్వాదించడంలో ఆడ–మగ అనే భేదమేమీ లేదు. అందుకే, ఈ సువాసనలు ఇప్పుడు అత్తరు రూపంలో అందరినీ అల్లుకు పోతున్నాయి.ప్రకృతి నుండి ప్రేరణ పొంది, సురక్షితమైన పదార్థాలతో తయారైన మట్టి అత్తరు పరిమళాలకు వందల సంవత్సరాల నైపుణ్యం గల వారసత్వ కంపెనీలు కూడా ఉన్నాయి. చెమట వాసనను దూరం చేస్తూ విభిన్న శ్రేణి వ్యక్తులను ఆకర్షిస్తుంది. ‘ది సెంట్ ఆఫ్ రైన్’ లేదా ‘పెట్రిచోర్ ఎసెన్షియల్ ఆయిల్’గా ప్రసిద్ధి చెందినవీ ఉన్నాయి. అన్ని దేశాలలోనూ ఈ తరహా సువాసనలను ప్రజలు ఇష్టపడుతున్నారు. ఆఫ్‌లైన్–ఆన్లైన్ మార్కెట్లో వందల రూపాయల నుంచి వేల రూపాయల వరకు ఈ ఎర్త్ సెంటెడ్ పెర్ఫ్యూమ్స్ అందుబాటులో ఉన్నాయి.చెక్.. తప్పనిసరి:– మనసును కదిలించే ఈ సువాసనగల అత్తరులో ఆల్కహాల్ వాడకం లేనివి ఎంచుకోవాలి.– అత్తరు లేదా పెర్ఫ్యూమ్ మన చర్మ తత్త్వానికి సరిపడుతుందా లేదా అని చెక్ చేసుకోవాలంటే ముందుగా దూది ఉండతో మణికట్టు, చెవి వెనక భాగాన కొద్దిగా అద్ది/స్ప్రే చేసి, 30 నిమిషాలు ఉండాలి. సరిపడితే రోజూ ఉపయోగించుకోవచ్చు.ప్రయోజనాలు ఏంటంటే?– మట్టి పరిమళం గల సహజ అత్తరు/పెర్ఫ్యూమ్ను వాడి మానసిక ఒత్తిడి నుంచి రిలాక్స్ కావచ్చు.– ఏకాగ్రతను మెరుగుపరుచుకోవాలనుకునేవారికి ఉత్తమమైన సాధానాలలో మట్టి పరిమళం ఒకటి లగ్జరీ హోటళ్లు, యోగా అండ్ ఆయుర్వేద రిసార్ట్‌లలో, అరోమా థెరపీ రిట్రీట్‌లలో సుగంధ లేపనాల తయారీలోనూ ఈ మట్టి అత్తరును ఉపయోగిస్తుంటారు.– మట్టి పరిమళం స్ప్రే చేసుకొని వెళితే మీ చుట్టూ ఉన్నవారు బయట వర్షం పడుతుందేమో అన్న అనుభూతికి లోనుకాకుండా ఉండలేరు.ఇవి చదవండి: Healthy Diet: ఓట్స్ – పొటాటో చీజ్ బాల్స్! -
5.2 బిలియన్ డాలర్లకు.. పరిమళాలు, ఫ్లేవర్ల పరిశ్రమ
కోల్‌కతా: దేశీయంగా పరిమళాలు, ఫ్లేవర్ల పరిశ్రమ ఏటా 12 శాతం వృద్ధి చెందనుంది. దీంతో వచ్చే మూడు, నాలుగేళ్లలో 5.2 బిలియన్ డాలర్లకు చేరగలదని అంచనాలు నెలకొన్నాయి. ఫ్రాగ్రెన్సెస్ అండ్ ఫ్లేవర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్ఏఎఫ్ఏఐ) ప్రెసిడెంట్ రిషభ్ కొఠారీ ఈ విషయాలు తెలిపారు. ‘దేశీయంగా ఫ్రాగ్రెన్స్, ఫ్లేవర్స్ పరిశ్రమ అత్యంత వేగంగా వృద్ధి చెందుతోంది. ప్రస్తుతం ఇది 3.7 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉంది‘ అని ఆయన చెప్పారు. వినియోగదారుల అభిరుచుల్లో మార్పులు, ఇతరత్రా అంశాలపై ఖర్చు చేయగలిగే స్థాయిలో ఆదాయాలు పెరుగుతుండటం తదితర అంశాలు ఇందుకు దోహదపడగలవని కొఠారీ వివరించారు. ఆహారోత్పత్తులు, పానీయాలు, వ్యక్తిగత సౌందర్య సంరక్షణ, హోమ్‌కేర్, ఫార్మా, కాస్మెటిక్స్ మొదలైన రంగాల్లో వీటిని ఎక్కువగా వినియోగి స్తుంటారు. సహజసిద్ధమైన, సేంద్రియ ఉత్పత్తులవైపు వినియోగదారులు మళ్లుతున్నందున ఆ విభాగాల్లో ఫ్రాగ్రెన్స్, ఫ్లేవర్స్ సంస్థలకు వ్యాపార అవకాశాలు ఉన్నాయని కొఠారీ పేర్కొన్నారు. -
కొత్త రకం హ్యాంగర్.. దగ్గరకు వెళ్తే పరిమళాలు వెదజల్లుతుంది!
దుస్తులు వేలాడదీసుకోవడానికి కలప హ్యాంగర్లు, లోహపు హ్యాంగర్లు చాలాకాలంగా వాడుకలో ఉన్నవే! వార్డ్‌రోబ్‌లలో దుస్తులు దాచుకోవడానికి చాలామంది హ్యాంగర్లు వాడుతుంటారు. సాదాసీదా హ్యాంగర్లకు అంతకు మించిన ఉపయోగం ఇంకేమీ లేదు. అయితే, అమెరికాకు చెందిన చైనీస్ సంతతి డిజైనర్ సూవా షోయి ఇటీవల ‘ప్లౌడ్’ పేరుతో పరిమళాలను వెదజల్లే హ్యాంగర్‌కు రూపకల్పన చేసింది. ఈ హ్యాంగర్‌ను విడిభాగాలుగా విడదీసుకోవడం, తిరిగి జోడించడం చాలా తేలిక. ఈ హ్యాంగర్‌లో గొట్టంలా ఉండే భాగంలో నచ్చిన పరిమళాలతో కూడిన సెంట్ పాడ్స్‌ను నింపుకొని, తిరిగి బిగించేసి, దుస్తులు తగిలించుకుంటే చాలు. ఈ హ్యాంగర్ అన్నివైపులా సమానంగా తిరుగుతూ దుస్తులను పరిమళభరితం చేస్తుంది. ఈ పరిమళాల హ్యాంగర్ ఇంకా మార్కెట్లోకి విడుదల కావాల్సి ఉంది. -
‘ఆ సువాసన’ వెదజల్లే కారు... ప్రపంచంలోనే మొదటి సారి
FORD MUSTANG MACH-E ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ పెరుగుతోంది. వాహనాల తయారీలో ఉన్న కంపెనీలు వినియోగదారులను ఆకట్టుకునేందుకు సరికొత్త ఫీచర్లను జోడిస్తున్నాయి. ఎక్కువ కంపెనీలు ఛార్జింగ్, మైలేజీపై దృష్టి సారించగా... ఫోర్డ్ ఓ అడుగు ముందుకు వేసి సరికొత్త ఫీచర్‌తో కస్టమర్లను ఆకట్టుకోవాలని ప్లాన్ వేసింది. ఆ ఫీలే వేరు ఇంతకాలం పెట్రోలు, డీజిల్ కార్లదే హవా నడిచింది. ఏళ్ల తరబడి పెట్రోలు కార్లు ఉపయోగించాం. దీంతో ఆ కార్లతో తెలియకుండానే ఒక అనుబంధం ఏర్పడింది. పైకి ఎవరు చెప్పకున్నా కారుకు సంబంధించి కంఫర్ట్, కంపాటబులిటీలతో పాటు పెట్రోల్ ఇంజన్ వాసనను కూడా ఫీల్ అయ్యేవారు చాలా మంది ఉంటారు. అయితే కొత్తగా వచ్చిన ఎలక్ట్రిక్ వెహికల్స్‌లో ఈ అనుభూతి మిస్ అవుతుందని చాలా మంది ఫీల్ అవుతున్నారు. వాసన మిస్ అవుతున్నాం పెట్రోల్ నుంచి ఎలక్ట్రిక్ వాహనాలకు మారిన తర్వాత పెట్రోలు వాసనను మిస్ అవుతున్నామని 70 శాతం మంది తెలిపినట్టు ఫోర్డ్ జరిపిన సర్వేలో తేలింది, వైన్, ఛీజ్ కంటే కూడా పెట్రోలు వాసనే ఎక్కువ ఇష్టపడతామని చెప్పిన వారి సంఖ్య కూడా చాంతాడంత తేలింది. తొలిసారిగా దీంతో ఎలక్ట్రిక్ వాహనాలు కార్లు ఉపయోగించే వారికి పెట్రోలు కారు స్మెల్ ఫీల్ మిస్ కాకుండా ఉండేందుకు ప్రత్యేక మాక్ ఈవ్ పేరుతో సరికొత్త ఫ్రాగ్రెన్స్ని తయారు చేసింది ఫోర్డ్. ప్రత్యేక పద్దతిలో తయారు చేసిన ఈ పరిమళాన్ని మొదటగా ఫోర్డ్ ముస్టాంగ్ మాక్ ఈ-జీటీ మోడల్‌తో ప్రవేశ పెట్టనుంది. పెట్రోలు వాసన మిస్ అవుతున్న వారికి ప్రత్యామ్నయం చూపనుంది. పెట్రోల్ వాసన అందించే తొలి ఈవీ కారుగా ఫోర్డ్ ముస్టాంగ్ మాక్ - ఈ జీటీ నిలవనుంది. -
ఒంటిప్స్
పెర్ఫ్యూమ్ను ఒంటికి రాసుకునే ముందు ఆ చోట కాస్త వ్యాజిలిన్ రాయాలి. అలా చేస్తే సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అంతేకాకుండా ఆ పరిమళం మీతో రోజంతా ఉంటుంది. వేసుకునే బట్టలు రోజంతా సువాసనలు వెదజల్లాలంటే ఊరికే పరఫ్యూమ్ కొట్టుకుంటే సరిపోదు. నీళ్లలో కొద్దిగా పర్ఫ్యూమ్ కలిపి చల్లుతూ ఐరన్ చేస్తే ఆ సువాసన ఎన్నో గంటల పాటు పరిమళాన్ని ఇస్తుంది. -
తిండి గోల ఇలాచీ! అమోఘమైన రుచి...
సువాసనతోబాటు భిన్నమైన రుచిని తేవడంలో ఘనాపాటి యాలక్కాయ. సుగంధ ద్రవ్యాలలో రారాణిగా పేరొందిన ఇలాచీ వంటింటి షెల్ఫ్‌లో లవంగంతో చేరి గాజు సీసాలో ఘాటుగా జోడీ కట్టినా నా రూటే సపరేట్ అన్నట్టుగా ఉంటుంది. యాలకులను ప్రాచీనకాలంలోనే మనవారు సుగంధ ద్రవ్యంగా వాడినట్టు చరిత్ర చెబుతోంది. 2వ శతాబ్దంలో శుశ్రుతుడు రాసిన చరకసంహితలోను, 4వ శతాబ్దంలో కౌటిల్యుడు రాసిన అర్ధశాస్త్రంలోనూ యాలకుల ప్రస్తావన ఉన్నట్టు తెలుస్తోంది. ‘కార్డమమ్’ అని పిలిచే ఆంగ్లేయులూ యాలకుల పంటలో ఘనాపాటిగానే పేరుతెచ్చుకున్నారు. దీని శాస్త్రీయ నామం ఎలెట్టరియా. మన దేశంలో యాలకుల ఉత్పత్తిలో అగ్రస్థానం సిక్కిం కొట్టేసినప్పటికీ దక్షిణ భారతదేశంలో నీలగిరి కొండలు యాలకుల జన్మస్థానంగా చెబుతారు. శ్రీలంక, బర్మా, చైనా, టాంజానియా... ప్రపంచంలో ఎన్ని చోట్ల యాలకులు పండినా, భారతదేశపు యాలకులు అత్యుత్తమమైనవిగా పేర్గాంచాయి. అంతేకాదు ప్రపంచంలో యాలకులను అత్యధికంగా పండించేది మన దేశమే. కుంకుమపువ్వు తర్వాత అత్యంత ఖరీదైన సుగంధ ద్రవ్యంగా పేరున్న యాలకులను గ్రీకులు, రోమన్లు అత్తరు తయారీలో వాడేవారట. అరేబియన్ దేశాలలో యాలకులను కాఫీతోను, మిగిలిన దేశాలలో తేయాకుతోనూ కలిపి పానీయంగా సేవిస్తారు. మిఠాయి, కేక్, పేస్ట్రీలలోనే కాదు మన దేశంలో ఘాటైన వంటల్లో మసాలా దినుసుగానూ యాలకులను వాడుతారు. యాలకులను సంప్రదాయ వైద్యంలో అనేక రుగ్మతలకు మందుగా వాడుతారు. అజీర్తి, మలబద్ధకం, అల్సర్లు, ఆస్తమా, జలుబు, సైనస్, కలరా, తలనొప్పి, చెడు శ్వాస.. వంటి ఎన్నో ఆరోగ్యసమస్యలకు యాలకులు దివ్యౌషధం. -
ఇంటిప్స్
ఆయా సీజన్లలో వాడే దుస్తులను సీజన్ అయిపోయాక అల్మరాలో పెట్టి ఉంచేస్తాం. అలాంటప్పుడు అవి వాసన వస్తుంటాయి. అలా జరగక్కుండా ఉండాలంటే ఆ బట్టల మధ్య ఒకట్రెండు వేప పుల్లలు పెట్టండి.షెల్ఫులు, వార్డ్‌రోబ్‌ల తలుపులు బిగిసిపోతే... చక్రాలు, స్క్రూలకు సబ్బు కానీ, మైనం కానీ పూయాలి. పింగాణీ పాత్రల మీద మరకలు పోవాలంటే... నెయిల్ పాలిష్ రిమూవర్లో ముంచిన గుడ్డతో తుడవాలి. ఇల్లంతా సువాసన రావాలంటే... ఓ ప్రమిదలో వేపనూనె వేసి దీపం వెలిగిస్తే సరి.


