కొత్త రకం హ్యాంగర్‌.. దగ్గరకు వెళ్తే పరిమళాలు వెదజల్లుతుంది!

Clothes Hanger: Fragrance Filled Hanger Named Plaud Rotate Hands Of Clock - Sakshi

దుస్తులు వేలాడదీసుకోవడానికి కలప హ్యాంగర్లు, లోహపు హ్యాంగర్లు చాలాకాలంగా వాడుకలో ఉన్నవే! వార్డ్‌రోబ్‌లలో దుస్తులు దాచుకోవడానికి చాలామంది హ్యాంగర్లు వాడుతుంటారు. సాదాసీదా హ్యాంగర్లకు అంతకు మించిన ఉపయోగం ఇంకేమీ లేదు. అయితే, అమెరికాకు చెందిన చైనీస్‌ సంతతి డిజైనర్‌ సూవా షోయి ఇటీవల ‘ప్లౌడ్‌’ పేరుతో పరిమళాలను వెదజల్లే హ్యాంగర్‌కు రూపకల్పన చేసింది.

ఈ హ్యాంగర్‌ను విడిభాగాలుగా విడదీసుకోవడం, తిరిగి జోడించడం చాలా తేలిక. ఈ హ్యాంగర్‌లో గొట్టంలా ఉండే భాగంలో నచ్చిన పరిమళాలతో కూడిన సెంట్‌ పాడ్స్‌ను నింపుకొని, తిరిగి బిగించేసి, దుస్తులు తగిలించుకుంటే చాలు. ఈ హ్యాంగర్‌ అన్నివైపులా సమానంగా తిరుగుతూ దుస్తులను పరిమళభరితం చేస్తుంది. ఈ పరిమళాల హ్యాంగర్‌ ఇంకా మార్కెట్‌లోకి విడుదల కావాల్సి ఉంది. 

మరిన్ని వార్తలు :

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top