ఫ్యాషన్‌కి సరికొత్త అర్థం..! 'సంస్కృత శ్లోకాల సంస్కృతి'.. | Fashion: Fans praise Aishwarya Rai in Gita inspired gown at Cannes | Sakshi
Sakshi News home page

ఫ్యాషన్‌కి సరికొత్త అర్థం..! 'సంస్కృత శ్లోకాల సంస్కృతి'..

May 30 2025 8:40 AM | Updated on May 30 2025 10:45 AM

Fashion: Fans praise Aishwarya Rai in Gita inspired gown at Cannes

ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనేటప్పుడు సంస్కృత పదాల ప్రింట్లు ఉన్న కండువాలు, దుపట్టాలు వంటివాటిని ధరించడం చూస్తుంటాం. అయితే ఇటీవల అంతర్జాతీయ వేదికలపైనా ఆడంబరంగా జరిగే వేడుకలలోనూసంస్కృత శ్లోకాల ఎంబ్రాయిడరీ, ప్రింట్లతో డిజైన్‌ చేసిన దుస్తులు ధరించి లోతైన భారతీయ ఆత్మను సరికొత్తగా పరిచయం చేస్తున్నారు. ఆధునిక ఆలోచనలకు సంప్రదాయాన్ని జోడించిఫ్యాషన్‌ రంగంలో హుందాతనాన్నీ చాటుతున్నారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో పిల్గొనేవారు 
వీటిని ఎంచుకుంటున్నారు.

కాన్స్‌లో.. సంస్కృత శ్లోకం
ఇటీవల కాన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌–2025లో నటి ఐశ్వర్యారాయ్‌ అద్భుతమైన బ్రొకేడ్‌ సిల్వర్‌ కేప్, బ్లాక్‌ గౌన్‌ ధరించి అంతర్జాతీయంగా అభిమానులను ఆకట్టుకున్నారు. భారతీయ డిజైనర్‌ గౌరవ్‌ గుప్తా డిజైన్‌ చేసిన ఆ గౌను కేప్‌పైన భగవద్గీత శ్లోకాన్ని ఎంబ్రాయిడరీ చేశారు. ‘కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచనా. అంటే–కర్మలను చేసే హక్కు మీకు ఉంటుంది. 

కానీ, ఆ కర్మల ఫలాలకు కాదు’ అని అర్థం వచ్చేలా ఫ్యాషన్, ఆధ్యాత్మికత– ఈ రెండింటి కలబోతను ఐశ్వర్య తన దుస్తుల ద్వారా ప్రకటించింది. కాన్స్‌ డ్రెస్‌ కోడ్‌ ప్రకారం బనారసి వెండి కేప్‌ ఐశ్వర్య లుక్‌ను ఆకర్షణీయంగా మార్చింది. వెండి, బంగారు, నలుపు రంగులతో కూడిన ఈ డ్రెస్‌తో విశ్వపు అందాన్ని వేదికపైన చిత్రీకరించి, రాణిలా వెలిగిపోయింది ఐష్‌.

వెడ్డింగ్‌ లెహంగాపైన
ఇషా అంబానీ తన సోదరుడి వివాహ సమయంలో ధరించిన సంప్రదాయ లెహంగా అందరినీ అమితంగా ఆకట్టుకుంది. డిజైనర్లు అబుజాని, సందీప్‌ ఖోస్లా డిజైన్‌ చేసిన ఆ లెహంగాపైన భగవద్గీత  శ్లోకాలను ఎంబ్రాయిడరీతో డిజైన్‌ చేశారు. గౌరీ పూజలో పాల్గొనడానికి ఆమె ఈ సంస్కృత శ్లోకాలతో డిజైన్‌ చేసిన లెహంగాను ధరించింది.

అక్షరాల మాల
ఫ్యాబ్రిక్‌ పైన క్లిష్టమైన డిజైన్లుగా సంస్కృత శ్లోకాలు ప్రాచుర్యం పొదడంతో డిజైనర్లు కూడా ఆసక్తి చూపుతున్నారు. దీంతో సంస్కృత శ్లోకాలు, ప్రాంతీయ భాషలో ఉన్న అక్షరాల ప్రింట్లు సాంస్కృతిక, ఆధ్యాత్మిక ప్రాముఖ్యత నింపుకుంటున్నాయి. 

భగవద్గీత వంటి గ్రంథాల నుండి ఈ శ్లోకాలను తరచుగా చీరలు, లెహంగాలు, కుర్తీలు, దుపట్టాలు వంటి క్లాత్స్‌పై ముద్రించడం, ఎంబ్రాయిడరీ చేయడం, నేత నేయడం చేస్తున్నారు. ఈ ధోరణి మహిళలు తమ దుస్తుల ద్వారా వారి సాంస్కృతిక గుర్తింపును, వారసత్వాన్ని వ్యక్తపరిచే వీలు కల్పిస్తోంది.

కలెక్షన్‌ థీమ్‌
ధ్యాన, యోగ కలెక్షన్‌లో ‘ఓం నమః శివాయ, యోగ కర్మస్య కోశలం, సర్వ భవంతు సుఖినః శాంతిః భవంతుః శాంతిః ... వంటి శ్లోకాలతో మోడ్రన్‌ ట్రెడిషనల్‌ వేర్‌ రూపుదిద్దుకుంటోంది.

రాజస సంస్కృతం
మహాభారతం, రామాయణం వంటి ఇతిహాసాల నుండి శ్లోకాలతో గౌన్లు, షేర్వాణీలను అలంకరిస్తున్నారు. బ్లాక్‌ కాటన్‌ లేదా సిల్క్‌ ఫ్యాబ్రిక్‌ మీద బంగారు రంగులో సంస్కృత అక్షరాలను ఎంబ్రాయిడరీ లేదా ప్రింట్స్‌గా వేస్తున్నారు.

బోర్డర్‌ డిజైన్లు, ప్రింటింగ్‌ టెక్నిక్‌లు
సంస్కృత శ్లోకాలను చీరలు లేదా దుపట్టాల అంచులపై ముద్రిస్తున్నారు. వీటిలో జెపూర్‌ స్టయిల్‌ బ్లాక్‌ ప్రింట్స్‌ని ఉపయోగిస్తున్నారు. 

(చదవండి: భగవద్గీత శ్లోకం, బ్లాక్‌ వెల్వెట్‌ గౌను : ఐశ్వర్య సెకండ్‌ లుక్‌పై ప్రశంసలు)

Advertisement
 
Advertisement
Advertisement