వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కుటుంబ వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసిన విందుకు త్రిష కృష్ణన్, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ హాజరయ్యారు. వైఎస్ అనిల్ రెడ్డి కుమార్తె శ్రేయ, ఉజ్జ్వల్‌ల వివాహ రెసెప్షన్ లీలా ప్యాలెస్‌లో ఘనంగా జరిగింది. ఈ వేడుకలో తారలు, ప్రముఖులు, రాజకీయనాయకులు సందడి చేశాడు. ముఖ్యంగా ఈ వేడుకల్లో తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్, త్రిష కలిసి మరోసారి కనిపించి వార్తల్లో నిలిచారు. త్రిష ఈ వేడుకల్లో కలర్‌ఫుల్ లుక్‌తో అబ్బురపర్చింది.
ఆమె ధరించిన గులాబీ రంగు చీర ప్రధాన ఆకర్షణగా నిలిచి అందరి చూపులను కట్టిపడేసింది. చీరంతా ముత్యాల సీక్విన్స్, క్రిస్టల్స్‌తో చేతితో ఎంబ్రాయిడరీ చేశారు. దీని పల్లుకు టాసెల్స్ అలంకరించారు. దీనికి మ్యాచింగ్‌గా ఎంబ్రాయిడరీ బ్లౌజు, నడుము చుట్టూ టాసెల్స్, చేతులపై ఈకల డిజైన్లు ఉన్నాయి. త్రిషీ ఈ అందమైన లేత గులాబీ చీరను చక్కగా క్లాసిక్ స్టూల్ కట్టుకున్నారు. ఈ లుక్‌కి సరిపోయేలా చోకర్, స్టేట్‌మెంట్ చెవిపోగులను ధరించారు.
ఇక మేకప్ విషయానికి వస్తే..పింక్‌షేడ్స్‌లో మోనోటోన్‌గా ఉంచారు. కొద్దిగా పింక్‌లబ్లష్, ప్రకాశవంతమైన లిప్‌స్టిక్, పింక్ ఐషాడోతో లుక్ పూర్తి చేశారు. కనురెప్పల వెంట పలుచని ఐలైనర్ పొర, బొట్టుతో మరింత అందంగా కనిపించారు. తన హెయిర్‌స్టైల్ కోసం సాఫ్ట్ వేవ్స్‌ను ఎంచుకున్నారు. ఇక ముఖ్యమంత్రి విజయ్ టైలర్డ్ బ్రౌన్ సూట్‌లో కనిపించారు.
బ్రౌన్ బ్లేజర్ ఆఫ్ వైట్ రంగు చొక్కాతో చాలా హుషారుగా కనిపించారు. కాగా, ఆమె తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో త్రిష కృష్ణన్ ఐస్ బ్లూరంగు పట్టు చీరలో కనిపించి అందరి దృష్టిని ఆకర్షించారు. ఆ తర్వాత విజయ్ సీఎంగా జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో సైతం పాల్గొని వార్తల్లో నిలిచారు. మళ్లీ ఇలా వైఎస్ ఇంట జరిగిన వివాహ వేడుకలో మరోసారి ఇద్దరు కలిసి కనిపించి హాట్‌టాపిక్‌గా మారారు.
ఇదీ చదవండి: Sai Pallavi: ఆమె సాక్షాత్తు సీతమ్మే! సాయిపల్లవి లుక్‌పై ప్రశంసల వెల్లువ..


