చిరు దివ్వెలు
దీపావళి ఫెస్టివల్‌ను హ్యాపీగా, సేఫ్‌గా సెలబ్రేట్ చేసుకుంటానని చెబుతోంది చిన్నారి శాన్వీ పటేల్. నాగచైతన్య ‘దూత’ వెబ్ సిరీస్, నితిన్ ‘రాబిన్ హుడ్’ సినిమా, ‘మల్లి’ టెలివిజన్ సీరియల్‌లో బాలనటిగా ప్రేక్షకులను మెప్పించింది శాన్వీ. దీపావళి సెలబ్రేషన్స్ గురించి ఈ ‘లిటిల్ స్టార్’ చెప్పిన సంగతులు..
→ ప్రతి ఏడాదిలానే ఈ సంవత్సరం కూడా నాకు ఇష్టమైన దీపావళి పండగను నా ఫ్యామిలీతో కలిసి సెలబ్రేట్ చేసుకోబోతున్నాను. లక్ష్మీ పూజ చేసి, నా ఫ్యామిలీతో కలిసి క్రాకర్స్ కాలుస్తాను. సేఫ్‌గా ఎంజాయ్ చేస్తాను. ఈ దీపావళి పండక్కి ఆల్రెడీ కొత్త బట్టలు కొనుక్కున్నాను. లెహంగా తీసుకున్నాను.
→ దీపావళి రోజున దీపం పెట్టడం అంటే నాకు ఇలా ఇష్టం. దీపాల చుట్టూ స్పెషల్‌గా అలంకరిస్తాను. ఇలా డెకరేట్ చేయడం నాకు సంతోషంగా ఉంటుంది. అయితే డెకరేట్ చేసేటప్పుడు నాకేమైనా డౌట్ వస్తే మా అమ్మ హెల్ప్ చేస్తుంది.
→ మా ఇంట్లో ఈ పండక్కి ప్రత్యేకంగా కొన్ని పిండివంటలు చేస్తాం. పేణీలు, మురుకులు, కాజు కట్లీ చేస్తాం. ఇవన్నీ మా అమ్మ చేస్తుంటే నేను జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తాను. తినడం మాత్రమే కాదు... వండేటప్పుడు నేను చేయగలిగిన సాయం చేస్తాను.
→ టపాసులు కాల్చడం నాకు ఇష్టం. చాలా సరదాగా ఉంటుంది. కాకర పువ్వొత్తులు, భూ చక్రాలు, చిచ్చుబుడ్డి కాల్చుతాను. వీటిలో చిచ్చుబుడ్డి నాకు మరింత ఇష్టం. ఎందుకంటే పెద్దగా సౌండ్ రాదు. దీంతో ధైర్యంగా కాల్చుతాను (నవ్వుతూ..). పర్యావరణానికి పెద్దగా హాని కలిగించని క్రాకర్స్‌ను కాల్చడానికే నేను ప్రిఫరెన్స్ ఇస్తాను. ఇక నేను టపాసులు కాల్చేటప్పుడు మా నాన్నగారు నాతోనే ఉంటారు... జాగ్రత్తలు చెబుతారు.
→ క్రాకర్స్ కాల్చేటప్పుడు నేను చెప్పులు ధరించడం మర్చిపోను. మాలాంటి చిన్న పిల్లలు మాస్క్ వేసుకుని టపాసులు కాల్చడం ఇంకా శ్రేయస్కరం. అలాగే పెద్ద టపాసులు పేలుతున్నప్పుడు దూరంగా ఉండాలి కూడా. ప్రస్తుతం ‘శ్రీహరి కల్యాణం’ సీరియల్‌లో నటిస్తున్నాను. సెట్స్‌లో ఫెస్టివల్‌ను సెలబ్రేట్ చేస్తారు. మా ఇంట్లో కూడా సెలబ్రేషన్స్ ఉంటాయి. ఇలా నాకు డబుల్ హ్యాపీ. ఇంకా ఐదారు సీరియల్స్‌లో గెస్ట్ రోల్స్ కూడా చేస్తున్నాను. ‘నా కాళ్ళ గజ్జెలు’ సినిమాలో నేను మెయిన్ లీడ్ రోల్ చేశాను. త్వరలోనే రిలీజ్ అవుతుంది. అలాగే ఇంద్రజ మేడమ్‌తో నేను కలిసి నటించిన సినిమా రిలీజ్‌కు సిద్ధం అవుతోంది.
– ముసిమి శివాంజనేయులు


