కార్తికేయుడి చేతిలో కుక్కుటం? | Devotion: What is the reason behind Lord Kartikeya holding a rooster | Sakshi
Sakshi News home page

కార్తికేయుడి చేతిలో కుక్కుటం?

Nov 5 2026 5:12 PM | Updated on Nov 5 2026 5:12 PM

Devotion: What is the reason behind Lord Kartikeya holding a rooster

మధ్యప్రదేశ్‌లోని మందసౌర్‌ ప్రాంతం ప్రాచీన కాలంలో దశపురం అనే పేరుతో ప్రసిద్ధి చెందింది. ఇక్కడ లభించిన కార్తికేయుని శిల్పం గుప్తుల కాలం లేదా వారికి సమకాలీనమైన ఔలికర రాజుల కాలానికి చెందినదిగా పేర్కొనబడింది. ఈ శిల్పం క్రీ.శ. 4వ లేదా 5వ శతాబ్దానికి చెందినదిగా గుర్తించబడింది. మందసౌర్‌ ప్రాంతం ప్రాచీన భారతదేశ చరిత్రలో శాసనాలు, దేవాలయ నిర్మాణాలు, శిల్పకళకు ప్రసిద్ధి చెందింది.

ఈ శిల్పంలో కార్తికేయుడు తన ఎడమ చేతిలో కోడిని పట్టుకుని ఉన్నాడు. సంస్కృతంలో కోడిని కుక్కుటం అంటారు. కార్తికేయుని ధ్వజంపై కోడి చిహ్నం ఉండటంతో ఆయనను కుక్కుటధ్వజుడు అని పిలుస్తారు. కార్తికేయుని ప్రతిమా లక్షణాల్లో కోడి ఒక ప్రత్యేకమైన గుర్తింపు. కొన్ని శిల్పాల్లో కోడి ధ్వజంపై కనిపిస్తుంది. మరికొన్ని శిల్పాల్లో ఈ విగ్రహంలో ఉన్నట్లుగా నేరుగా చేతిలో పట్టుకున్న రూపంలో కనిపిస్తుంది. దక్షిణ భారతదేశంలో మురుగన్‌ ఆరాధనలో నెమలి కార్తికేయుని వాహనంగా, కోడి ధ్వజ చిహ్నంగా ప్రసిద్ధి చెందాయి. ఉత్తర, మధ్య భారతదేశాల్లో లభించిన కార్తికేయుని చీన శిల్పాల్లోనూ ఆయనకు సంబంధించిన ప్రత్యేక లక్షణాలు కనిపిస్తాయి.

ఈ విగ్రహంలో తలపై కేశాలంకరణ, మెడలోని ఆభరణాలు, వస్త్రధారణ, శరీరాకృతి ఆనాటి శిల్ప సంప్రదాయానికి సంబంధించిన వివరాలను తెలియజేస్తాయి. గుప్తుల కాలపు శిల్పాల్లో ముఖాకృతి, శరీర నిష్పత్తులు, ఆభరణాల చెక్కడానికి ప్రత్యేక ప్రాధాన్యం కనిపిస్తుంది. మందసౌర్‌లో లభించిన ఈ కార్తికేయుని శిల్పం ప్రాచీన భారతదేశంలో స్కంద ఆరాధన, దేవతామూర్తుల రూపకల్పన, శిల్పకళా అభివద్ధిని అధ్యయనం చేయడానికి ఉపయోగపడుతుంది.  
–జి.బి. విశ్వనాథ, రిటైర్డ్‌ డిప్యూటీ కలెక్టర్‌ 

ఇదీ చదవండి: వెలుగుల పండుగ వెనుక ఇంత ఆరోగ్య రహస్యం ఉందా..?!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement