ఆవుపేడతో అద్భుతాలు సృష్టిస్తున్న మహిళ! | Diwali 2026: Woman Use Cow Dung To Make Diyas For Eco Friendly | Sakshi
Sakshi News home page

ఆవుపేడతో అద్భుతాలు సృష్టిస్తున్న మహిళ!

Nov 5 2026 4:08 PM | Updated on Nov 5 2026 4:08 PM

Diwali 2026: Woman Use Cow Dung To Make Diyas For Eco Friendly

పండగొస్తే గాని ఆవుపేడతో కళ్లాపు చల్లని గ్రామాల సంఖ్య రోజురోజుకీ పెరిగి΄ోతోంది. టెక్నాలజీ, అర్బనైజేషన్, ఆధునికత వల్ల మన పాత పద్ధతుల్ని ఎప్పుడో మరచిపోయాం. కాని ఆవుపేడతో ముంగిట్లో కళ్లాపు చల్లడమే కాదు తెలివికి పదును పెడితే కళాకృతులను చేయవచ్చని నిరూపించిందో మహిళ. గోమయంతో అందమైన ప్రమిదలు, పూజా సామాగ్రి, విభూది వంటివి చేస్తూ తనకు తానే కొత్త రకం ఉపాధిని సృష్టించుకుంది. 

పెద్దపల్లి జిల్ల రామగిరి మండలం కల్వచర్లకు చెందిన యాదగిరి పద్మావతి ఒక సాధారణ గృహిణి. ఇంటి ముందు కళ్లాపు చల్లడానికి, పొలాల్లో ఎరువులు వేయడానికి ఉపయోగించే ఆవుపేడతో అనేక రకాలైన వస్తువులను తయారు చేసి ఔరా అనిపిస్తోంది. ప్రమిదలు, పూజా సామగ్రి, విభూది మాత్రమే కాకుండా హెయిర్‌ ఆయిల్, నొప్పుల ఉపశమనానికి ఉపయోగించే ఆయిల్స్‌ను కూడా తయారు చేస్తోంది.

ప్రకృతికి మేలు
పేడను వృథా చేయకుండా వివిధ వస్తువులుగా మలచడం సంప్రదాయ జ్ఞానానికి ఉపాధి ఆలోచనను జోడించినట్లవుతోంది. పర్యావరణ హితమైన ప్రత్యామ్నాయ ఉత్పత్తులపై ప్రజల్లో అవగాహన పెరిగితే వీటికి మార్కెట్‌ అవకాశాలు మెరుగుపడవచ్చు. అయితే ఉత్పత్తుల తయారీలో పరిశుభ్రత, నాణ్యత, సురక్షిత వినియోగానికి సంబంధించిన ప్రమాణాలు పాటించడం ముఖ్యం. 

అందుబాటులో ఉన్నవాటితోనే..
‘ఆవు పేడను చాలామంది ఎరువుగా, పిడకల తయారీకి మాత్రమే ఉపయోగిస్తారు. కానీ దానితో ఎన్నో రకాల వస్తువులు తయారు చేయవచ్చనే ఆలోచన వచ్చింది. ఇంట్లోనే అందుబాటులో ఉండే వనరులతో ఏదైనా చేయవచ్చని భావించా. నా ఉత్పత్తులకు ఆదరణ, ప్రోత్సాహం లభిస్తే మరికొందరు మహిళలకు కూడా ఉపాధి కల్పించాలనుకుంటున్నా.’ 
– యాదగిరి పద్మావతి, కల్వచర్ల

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement