దీపావళి ఆఫర్.. రూ.100కే 10 రకాల కూరగాయలు! | Buy 10 veggies at Rs 100 in TN this Diwali | Sakshi
Sakshi News home page

దీపావళి ఆఫర్.. రూ.100కే 10 రకాల కూరగాయలు!

Nov 5 2026 1:43 PM | Updated on Nov 5 2026 1:43 PM

Buy 10 veggies at Rs 100 in TN this Diwali

దీపావళి పండుగ వేళ సామాన్యులకు ‘టీఎన్‌’ ప్రభుత్వం తీపి కబురు అందించింది. పెరుగుతున్న కూరగాయల ధరలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఊరట కల్పించేలా కేవలం రూ.100కే 10 రకాల కూరగాయల ప్యాక్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.

మూడు రోజుల పాటు ప్రత్యేక విక్రయాలు
‘టీఎన్‌’ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘వెట్రి స్పెషల్ వెజిటబుల్ ప్యాక్’ పథకం నవంబర్ 5 నుంచి 7వ తేదీ వరకు అమల్లో ఉంటుంది. రాష్ట్రంలోని ఎంపిక చేసిన 218 సహకార దుకాణాల ద్వారా ఈ ప్యాక్‌లను విక్రయించనున్నారు.

రూ.100 ప్యాక్‌లో ఏమేం ఉన్నాయంటే?
ఒక్కో ప్యాక్‌లో మొత్తం 10 రకాల నిత్యావసర కూరగాయలు ఉంటాయి. 
ఉల్లిపాయలు – 500 గ్రాములు
టమాటాలు – 500 గ్రాములు
వంకాయలు – 250 గ్రాములు
బంగాళాదుంపలు – 250 గ్రాములు
క్యారెట్లు – 200 గ్రాములు
బీన్స్ – 200 గ్రాములు
పచ్చిమిర్చి – 100 గ్రాములు
నిమ్మకాయలు – 100 గ్రాములు
అల్లం – 50 గ్రాములు
కొబ్బరికాయ – ఒకటి (400 నుంచి 450 గ్రాములు)

పర్యావరణహితమైన ప్యాకింగ్‌లో అందించే ఈ కూరగాయల కిట్ బరువు 2.55 కిలోల నుంచి 2.60 కిలోల వరకు ఉంటుంది. పండుగ సమయంలో వంటింటికి అవసరమైన పది రకాల కూరగాయలను ఒకే ప్యాక్‌లో అందించడం ఈ పథకం ప్రత్యేకత.

మూడు రోజులే అవకాశం
నవంబర్ 5, 6, 7 తేదీల్లో 218 ఎంపిక చేసిన సహకార విక్రయ కేంద్రాల్లో ఈ ప్యాక్‌లు అందుబాటులో ఉంటాయి. పండుగ సమయంలో కూరగాయల కొనుగోలు భారాన్ని తగ్గించేందుకు ఈ ప్రత్యేక విక్రయాలను తమిళనాడు ప్రభుత్వం చేపట్టింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement