దీపావళి గిఫ్ట్‌.. ఉద్యోగులకు ఐఫోన్స్ | Delhi Company Gifts iPhone 16 To Employees For Diwali | Sakshi
Sakshi News home page

దీపావళి గిఫ్ట్‌.. ఉద్యోగులకు ఐఫోన్స్

Nov 4 2026 12:55 PM | Updated on Nov 4 2026 1:05 PM

Delhi Company Gifts iPhone 16 To Employees For Diwali

దీపావళి వచ్చిందంటే.. ఉద్యోగులకు కంపెనీల నుంచి ఏదో ఒక గిఫ్ట్ రావడం కామన్. సాధారణంగా స్వీట్లు, డ్రై ఫ్రూట్స్, గిఫ్ట్ హ్యాంపర్లు ఇస్తుంటారు. కానీ ఢిల్లీలోని ఓ కంపెనీ మాత్రం అందరికీ ఊహించని సర్‌ప్రైజ్ ఇచ్చింది. తమ ఉద్యోగులకు ఏకంగా ఐఫోన్ 16 స్మార్ట్‌ఫోన్లను దీపావళి కానుకగా అందించింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.

న్యూఢిల్లీలోని రోహిణి ప్రాంతానికి చెందిన కంపెనీ.. ఉద్యోగులకు ఐఫోన్లు గిఫ్ట్‌గా ఇచ్చిన వీడియోను తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. ఈ వీడియోలో ఉద్యోగుల డెస్క్‌లపై అందంగా రిబ్బన్లతో అలంకరించిన ఐఫోన్ 16 ఫోన్లు కనిపిస్తున్నాయి. తెలుపు, ఆకుపచ్చ, నీలం, నలుపు రంగుల్లో ఉన్న ఫోన్లను కంప్యూటర్ల ముందు ఉంచారు. చివర్లో కొంతమంది మహిళా ఉద్యోగులు తమకు వచ్చిన గిఫ్టులను చూసి ఎంతో సంతోషంగా స్పందించడం చూడవచ్చు.

ఈ వీడియోను షేర్ చేస్తూ కంపెనీ ''నో కాంపిటీషన్.. ఆప్కో క్యా మిలా?'' (మీకు ఏమి గిఫ్ట్ వచ్చింది?) అంటూ క్యాప్షన్ ఇచ్చింది. సాధారణంగా పండుగలకు స్వీట్లు, గిఫ్ట్ బాక్సులు ఇచ్చే కంపెనీలు ఉన్న సమయంలో.. ఏకంగా ఐఫోన్లు ఇవ్వడంతో నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఉద్యోగులను సంతోషపెట్టాలంటే.. ఇలా చేయాలంటూ కంపెనీపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement