అమెరికాకు చెందిన 54 వ్యక్తి గడ్డంతో ప్రపంచ రికార్డులకెక్కాడు. ఏకంగా 5 అడుగుల 3 అంగుళాల సహజ గడ్డం పెంచినందుకు వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్నాడు. కాన్వాస్‌లోని బాల్డ్విన్‌కు చెందిన మాథ్యూ హే రెండు దశాబ్దాలకు పైగా తన గడ్డాన్ని కత్తిరించలేదన. జీవించి ఉండి, అత్యంత పొడవైన సహజ గడ్డం పెంచినందుకు ఈ టైటిల్‌ని కైవసం చేసుకున్నాడు.
అతని గడ్డం తన తోటి అమెరికన్ అయిన రుడాల్ఫ్ మార్టినో పేరిట ఉన్న మూడు అడుగుల ఆరు అంగుళాల మునుపటి రికార్డు కంటే రెండు అడుగుల పొడవు ఉండటం విశేషం. ఈ మేరకు హే మాట్లాడుతూ..తాను సుమారు 20 ఏళ్ల క్రితం గడ్డం పెంచడం ప్రారంభించినట్లు తెలిపారు. అతను ఎప్పుడు చిన్న గడ్డాన్నే ఉంచుకున్నప్పటికీ..కొందరు చిన్నారులు దాన్ని అల్లమని అడగడంతో గడ్డం పెంచాలనే ఆలోచన వచ్చిందట.
ఆ రూపం నచ్చడంతో తను గడ్డం షేవ్ చేసుకోవడమే మానిసినట్లు తెలిపాడు. కాలక్రమేణ ఆ అల్లిన జుట్టు ఒకే పాయగా చిక్కుపడి, ప్రతి ఏడాది సుమారు మూడు నుంచి నాలుగు అంగుళాలు పెరుగతూ వచ్చిందట. చివరి అది తన బెల్టు మాదిరిగా నడుముకు చుట్టుకునేంత పొడవుగా పెరిగిందని చెప్పుకొచ్చాడు.
ఎలా మెయింటైన్ చేస్తాడంటే..
ఇంతపెద్ద గడ్డం పెంచడం ఒక ఎత్తు మెయింటైన్ చేయడం మరోక ఎత్తు కదా. మరి హే మాత్రం అంత పెద్ద గడ్డాన్ని ముడి వేసి తన రోజువారీ పనులు చేసుకుంటాడట. అంతేగాదు షాంపు, కండీషనర్‌లతో దాన్ని క్లీన్‌గా ఉంచుకుంటాడట. అంతేకాదండోయ్ రికార్డు స్థాయిలో పొడువుగా ఉన్న ఆ గడ్డానికి భీమా చేయించాలా లేదా అని ఆలోచిస్తున్నాడట.
అలాగే కొందరు తన రూపాన్ని చూసి ప్రశంసించగా, మరికొందరు విమర్శిస్తుంటారట కూడా. ఇంకో విశేషమేమిటంలో నో షేవ్ నవంబర్ నెలలోనే అతడి రికార్డు నమోదవ్వడం. ప్రస్తుతానికి హే ఆ గడ్డాన్ని కత్తిరించాలని ఆలోచన లేదని, మరింతగా పెంచుతూ సంరక్షించాలనే అనుకుంటున్నాడట.లి
ఇదీ చదవండి: ఆటో నడుపుతూనే సూపర్ టెట్‌కి సన్నద్ధం..! మనసుని కదిలించే కథ..


