పై వరుస: అరుణ మిల్లర్, పియా దండియా, ప్రమీలా జయపాల్, కింది వరుస: సుహాస్ సుబ్రమణ్యం, అమీ బేరా, రో ఖన్నా
ఫ్లోరిడా నుంచి హౌస్‌కు పియా దండియా..
జార్జియా అసెంబ్లీకి జ్యోత్ సింగ్
మిషిగన్ సెనేటర్‌కు భారత్‌తో కనెక్షన్!
వాషింగ్టన్: అమెరికా మధ్యంతర ఎన్నికల్లో ఈ సారి కూడా భారతీయులు చెప్పుకోదగ్గ స్థాయిలో రాణించారు. ఒక తరం క్రితం వరకు అమెరికాలోని భారతీయ సంతతి ప్రజలు కేవలం వైద్యం, ఇంజనీరింగ్, ఐటీ, వ్యాపార రంగాలకే పరిమితం అమెరికా రాజకీయాల్లో ఏళ్లుగా ఉన్న వారిని కాసేపు పక్కనబెడితే తాజా ఎన్నికల్లో ఇద్దరు భారతీయ సంతతి నేతలు మొట్టమొదటిసారి చట్టసభల్లోకి ప్రవేశించారు.
అమెరికాలో భారతీయ సంతతి నేతల రాజకీయం చాలా వరకూ కాలిఫోర్నీయా, న్యూజెర్సీ వంటి రాష్ట్రాలకే పరిమితం. కానీ ఈసారి ఫ్లోరిడా, జార్జియా వంటి రాష్ట్రాల్లో పియా దండియా, జ్యోత్ సింగ్‌ల సాధించిన విజయాలు.. అమెరికా రాజకీయాల్లో సరికొత్త అధ్యాయమని చెప్పాలి. ఫ్లో్లరిడాలోని 22వ కాంగ్రెగేషనల్ డిస్ట్రక్ట్ నుంచి భారతీయ మూలాలున్న పియా దండియా హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌కు ఎన్నికయ్యారు.
ఈ ఘనత సాధించిన తొలి భారతీయ సంతతి ప్రజాప్రతినిధిగా ఆమె చరిత్ర సృష్టించారు. రిపబ్లికన్ పార్టీకి చెందిన కేసీ అక్సర్‌పై విజయం సాధించారు. భారతీయ అమెరికన్లు పలువురు హౌస్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. సుహాస్ సుబ్రమణ్యం వర్జీనియా రాష్ట్రం డిస్ట్రక్ట్ 10 నుంచి, కాలిఫోర్నీయాలోని డిస్ట్రక్ట్ 17 నుంచి రో ఖన్నా, ప్రమీలా జయపాల్ వాషింగ్టన్‌లోని డిస్ట్రిక్ట్ సెవెన్ నుంచి మళ్లీ ఎన్నికకయ్యారు.
వీరితోపాటు కాలిఫోర్నీయా డిస్ట్రిక్ట్ త్రీ నుంచి అమీ బేరా కూడా డెమోక్రాట్ల తరఫున మరోసారి హౌస్‌కు ఎన్నికయ్యారు. సెనేట్ ఎన్నికల్లో మాత్రం భారతీయులు కానీ, భారతీయ మూలాలు ఉన్న వారు కానీ ఎన్నిక కాలేదు. పియా దండియా భారతీయ సంతతికి చెందిన రాజకీయనేత కావడం గమనార్హం. ఈమె తల్లిదండ్రులు 1980లలో రాజస్థాన్‌లోని జైపూర్ నుంచి ఫ్లారిడాకు వలస వెళ్లారు.
తండ్రి డాక్టర్ రోహిత్ దండియా పామ్ బీచ్ కౌంటీలో ఇరవై ఏళ్లుగా వైద్యసేవలు అందిస్తున్నారు. పియా తల్లి జుపిటర్ ప్రాంతంలో లో ఒక మాంటిస్సొరి పాఠశాలను స్థాపించారు. మరోవైపు జార్జియా రాష్ట్రంలో భారతీయ సంతతికి చెందిన జ్యోత్ సింగ్ కూడా జార్జియా అసెబ్లీకి ఎన్నికయ్యారు. సాధించారు. ఈ ఘనత సాధించిన తొలి సిక్కు–అమెరికన్ ప్రజాప్రతినిధిగా నిలిచారు.
తెలుగమ్మాయి లెఫ్టినెంట్ గవర్నర్!
మేరీల్యాండ్ లెఫ్టినెంట్ గవర్నర్ స్థానానికి డెమోక్రాట్ల తరఫున పోటీ చేసిన 61 ఏళ్ల అరుణా మిల్లర్ కూడా గెలుపొందారు. ఏడేళ్ల వయసులో అరుణ మిల్లర్ కుటుంబం ఆంధ్రప్రదేశ్ నుంచి అమెరికా వలస వెళ్లింది. మిస్సోరీ యూనివర్శిటీ నుంచి సివిల్ ఇంజినీరింగ్ చదివిన అరుణ పాతికేళ్లపాటు మాంటిగోమని కౌంటీ రవాణా శాఖలో పనిచేశారు. మేరీలాండ్ హౌస్ ఆఫ్ డెలిగేట్స్‌లో 2010 నుంచి 2018 వరకూ డిస్ట్రక్ట్ 15కు ప్రాతినిథ్యం వహించారు. మేరీల్యాండ్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఎన్నికైన రెండో మహిళగా అరుణ మిల్లర్ రికార్డు సృష్టించారు. తొలి శ్వేతేతర జాతి మహిళ కూడా.
మన అల్లుడు.. సెనేటర్
ఈ సారి ఎన్నికల్లో మిషిగన్ నుంచి సెనేట్‌కు ఎన్నికైన డెమొక్రాటిక్ అభ్యర్థి అబ్దుల్ ఎల్–సయ్యద్ భారతదేశపు అల్లుడు. అమెరికా సెనేట్‌కు ఎన్నికైన మొట్టమొదటి ముస్లింగానూ రికార్డు సృష్టించారు. స్వతహాగా ఈజిప్టు నుంచి అమెరికాకు వలస వచ్చిన వ్యక్తి కానీ.. భార్య సారా జుకా తల్లిదండ్రులు కర్ణాటకలోని భట్కళ్ నుంచి అమెరికాకు వలసవెళ్లారు.


