తొలి నల్లజాతి గవర్నర్‌గా కీషా | Keisha Lance Bottoms scripts history as first Black woman Governor in US | Sakshi
Sakshi News home page

తొలి నల్లజాతి గవర్నర్‌గా కీషా

Nov 5 2026 5:20 AM | Updated on Nov 5 2026 5:20 AM

Keisha Lance Bottoms scripts history as first Black woman Governor in US

అగ్రరాజ్యం అమెరికాలో రాజకీయం కొత్త రికార్డు నెలకొల్పింది. నవంబరు మూడవ తేదీ జరిగిన మధ్యంతర ఎన్నికల్లో డెమోక్రాట్లు రెండు సభల్లో, గవర్నర్‌ స్థానాల్లోనూ ఆధిక్యం సాధించడం ఒక విశేషమైతే.. అమెరికా చర్రితలోనే గవర్నర్‌ స్థానానికి ఎన్నికైన నల్ల జాతీయురాలిగా జార్జియాకు చెందిన కీషా లాన్స్‌ బాటమ్‌ చరిత్ర సృష్టించారు. అంతే కాకుండా, దాదాపు రెండు దశాబ్దాలుగా రిపబ్లికన్ల కంచుకోటగా ఉన్న జార్జియా కోటను డెమోక్రాట్లు బద్దలు కొట్టగలిగారు.  

ప్రజాపోరాటాల ప్రయాణం! 
న్యాయ, శాసన, కార్యనిర్వాహక వ్యవస్థల్లో పనిచేసిన అరుదైన అనుభవమున్న కీషా రాజకీయ ప్రస్తానం అట్లాంటా వీధుల్లోంచే మొదలైంది. 1970 జనవరి 18న అట్లాంటాలో జని్మంచిన కీషా, ఫ్లారిడా ఏ అండ్‌ ఎం విశ్వవిద్యాలయంలో డిగ్రీ, జార్జియా స్టేట్‌ కాలేజ్‌ ఆఫ్‌ లా నుంచి న్యాయశాస్త్ర పట్టా పొందారు. లాయర్‌గా, ప్రాసిక్యూటర్‌గా, మేజి్రస్టేట్‌ జడ్జిగా క్రిమినల్‌ జస్టిస్‌ వ్యవస్థలో తనదైన ముద్ర వేశారు. అట్లాంటా సిటీ కౌన్సిల్‌ సభ్యురాలిగా రెండుసార్లు (2010 – 2018)ఎన్నికై, స్థానిక సమస్యల పరిష్కారానికి కృషి చేశారు. ఆ తరువాత అట్లాంటా నగర 60వ మేయర్‌గా 2018లో బాధ్యతలు చేపట్టారు. కోవిడ్‌–19 సమయంలో కీషా తీసుకున్న నిర్ణయాలు మాత్రమే కాకుండా పేదలకు ఇళ్లు కట్టివ్వడం, పౌర హక్కుల రక్షణకు చర్యలు తీసుకోవడం వంటివి కీషాకు దేశవ్యాప్త ప్రశంసలు తెచ్చిపెట్టాయి. జో బైడెన్‌ అమెరికా అధ్యక్షుడిగా ఉండగా 2022–2023 మధ్యకాలంలో కీషా వైట్‌ హౌస్‌ ’ఆఫీస్‌ ఆఫ్‌ పబ్లిక్‌ ఎంగేజ్‌మెంట్‌’లో కీలకపాత్ర పోషించారు. సీనియర్‌ సలహాదారుగానూ 
వ్యవహరించారు.  

మెరుగైన హామీలతో జనాదరణ
2026 గవర్నర్‌ ఎన్నికల్లో కీషా ఆరోగ్యం, కనీస వేతనాల పెంపు, సామాన్యుడికి అందుబాటులో ఇళ్లు వంటి హామీలిచ్చి ప్రజలను ఆకట్టుకున్నారు. కీషా సాధించిన ఈ చారిత్రాత్మక గెలుపు జార్జియా రాజకీయాలకు మాత్రమే పరిమితం కాకుండా, అమెరికా ప్రజాస్వామ్య చరిత్రలోనే మైలురాయిగా నిలిచిపోతాయని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement